twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంటెస్టెంట్ల లిస్ట్‌లో కొత్త మలుపులు.. బిగ్‌బాస్‌లోకి మై విలేజ్ షో సెన్సేషన్.. ఈ సారి రచ్చ రచ్చే

    |

    బిగ్ బాస్ షో మొదలవ్వక ముందే రసవత్తరంగా మారింది. పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరంటూ రచ్చ రచ్చగా మారింది. ఇప్పటికే ఎన్నో లిస్ట్‌లు, ఎంతో మంది పేర్లు బిగ్ బాస్‌ నాల్గో సీజన్‌లో వినిపిస్తున్నాయి. షో ప్రారంభం కావడానికి సమయం దగ్గర పడుతుండటంతో లీకులు కూడా జోరందుకున్నాయి. అందుకే కొత్త కొత్త జాబితాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో మరి కొన్ని పేర్లు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతున్నాయి.

    ప్రోమోలతో రచ్చ..

    ప్రోమోలతో రచ్చ..

    బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు సంబంధించిన ప్రోమోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. కింగ్ నాగార్జున సెటైర్లు, బిగ్ బాస్ కాన్సెప్ట్‌ను ఎంతో ఫన్నీగా తెలియజేసేలా ప్రోమోలు విడుదల చేయడంతో నాల్గో సీజన్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక వీటికి తగ్గట్టే కంటెస్టెంట్ల లిస్ట్‌ కూడా తెగ వైరల్ అవుతోంది.

    ఖండించిన వారి లిస్ట్..

    ఖండించిన వారి లిస్ట్..

    బిగ్‌బాస్ 4లో పాల్గొనబోయే వారి జాబితా ఇదే నంటూ లెక్కలేనన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అందులో చాలా మంది తాము పార్టిసిపేట్ చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో శ్రద్దాదాస్, తరుణ్, ప్రగతి, పూనమ్ కౌర్ వంటి వారు బిగ్ బాస్ వార్తను ఖండించారు. ఇక రోజుకో లిస్ట్ వైరల్ అవుతుండగా.. తాజాగా కొన్ని పేర్లు కొత్తగా వినిపిస్తున్నాయి.

    కంటెస్టెంట్ల లిస్ట్..

    కంటెస్టెంట్ల లిస్ట్..

    బిగ్‌బాస్ 4లో మంగ్లీ, నందు, జబర్దస్త్ ముక్కు అవినాష్, యాంకర్ ప్రగతి, ఆరియానా, యూట్యూబర్ మెహబూబ్, సీరియల్ హీరో అఖిల్, సింగర్ నోయెల్, కొరియోగ్రఫర్ రఘు-ప్రణవి దంపతులు ఇలా పాల్గొనబోతోన్నారని కొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ జాబితాలోకి కొంత మంది పేర్లు కొత్తగా వినిపిస్తున్నాయి.

    గత సీజన్ మాదిరి..

    గత సీజన్ మాదిరి..

    మూడో సీజన్‌లో బాబా భాస్కర్ వచ్చినట్టుగానే ఈ సారి అమ్మ రాజశేఖర్‌ను తీసుకురావాలని భావిస్తోన్నట్టు తెలుస్తోంది. ఇక వివాదాలకు కేరాఫ్ నటి అయిన కరాటే కళ్యాణిని కూడా తీసుకోబోతోన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన మరో వ్యక్తిని కూడా బిగ్ బాస్‌లోకి రాబోతోన్నట్టు తెలుస్తోంది.

    Recommended Video

    SV Ranga Rao : ఇంటర్నేషనల్ అవార్డ్ పొందిన మొదటి భారత నటుడు ఎస్వీ రంగారావు..
    గంగవ్వతో రచ్చ..

    గంగవ్వతో రచ్చ..

    మై విలేజ్ షోతో యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన గంగవ్వ బిగ్ బాస్ హౌస్‌లోకి రాబోతోన్నట్టు లీకులు అందుతున్నాయి. ఇక గంగవ్వ చేసే రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఒక వేళ గంగవ్వ గనుక హౌస్‌లోకి వస్తే అది వేరే లెవెల్. ఇక ఒకప్పటి టాప్ యాంకర్ లాస్య పేరు కూడా లిస్ట్‌లో వినిపిస్తోంది. మరి ఈ పేర్లు నిజంగా అధికారిక లిస్ట్‌లో ఉంటాయో లేదో చూడాలి.

    English summary
    Bigg Boss Telugu Season 4: Amma Rajasekhar Gangavva to Lasya Manjunath May Participated.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X