ముహూర్తం ఫిక్స్.. ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. బిగ్ బాస్ ఆట మొదలయ్యేది అప్పుడే
బిగ్‌బాస్ షోకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఎట్టకేలకు బుల్లితెర ప్రేక్షకులను వినోదాన్ని పంచేందుకు బిగ్ బాస్ వస్తున్నాడు. ఇప్పటికే మూడు సీజన్లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్ బాస్ ఈ సారి సరికొత్తగా రాబోతోన్నాడు. ప్రస్తుతం పరిస్థితులకు తగ్గట్టు ఆటలో ఎన్నో మార్పులు తీసుకు రాబోతోన్నాడు. ఇక ఇప్పటికే వచ్చిన ప్రోమో తెగ వైరల్ అవుతోండగా.. తాజాగా కొత్త ప్రోమోలు బయటకు వచ్చాయి. దీంతో పాటే షో ఎప్పుడు ప్రారంభం కానుందో కూడా ప్రకటించారు.
Recommended Video

కొత్త ప్రోమోలతో రచ్చ..
బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు సంబంధించిన ప్రోమోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. పక్కింటి ముచ్చట్లు, అత్తా కోడళ్ల నాటకాలు నేపథ్యంతో విడుదల చేసిన మొదటి ప్రోమో ఎంతగానో వైరల్ అయింది. ఇక తాజాగా విడుదల చేసిన ఆడవాళ్ల ముచ్చట్లు, సెలూన్ షాప్‌లో టీవీల్లో వచ్చే రొమాన్స్ సీన్లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా చూపెట్టిన ప్రోమోలు సైతం తెగ హల్చల్ చేస్తున్నాయి.

కొత్త లిస్ట్..
బిగ్ బాస్ షోలో పాల్గొనబోయే వారి లిస్ట్‌లో రోజుకో కొత్త పేరు వినిపిస్తూనే ఉంది. తాజాగా వినిపిస్తున్న వారిలో.. నోయెల్, దేత్తడి హారిక, దివి, లాస్య, గంగవ్వ, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, దేవీ నాగవల్లి, సోహెల్, ముక్కు అవినాష్, దిల్ సే మెహబూబా, రఘు మాస్టర్, ఆరియానా, యాంకర్ సుజాత, మోనాల్, అభిజీత్ వంటివారున్నారు.

క్వారంటైన్‌లో కంటెస్టెంట్లు..
వీరందరూ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో సింగర్ నోయెల్‌కు కరోనా వచ్చిందనే వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అందుకే మిగతా ఇంటి సభ్యులను కూడా ఇంకా కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉంచాలని భావిస్తున్నారట. అందుకే షోను ఇంకో వారం రోజులు వాయిదా వేశారట.

అప్పుడే ప్రారంభం..
మామూలుగా అయితే బిగ్ బాస్ షోను ఆగస్ట్ చివరి వారంలో ప్రారంభించాలని ముందుగా నిర్ణయించారు. కానీ అనూహ్యంగా కంటెస్టెంట్లలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో షోను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 6ను సాయంత్రం ఆరు గంటలకు షోను ప్రారంభించబోతోన్నట్టు తాజాగా అధికారికంగా ప్రకటించారు.


Click it and Unblock the Notifications











