అఖిల్, మోనాల్ అఫైర్‌లో హైడ్రామా.. చేతిలో చేయి వేసి సంతకాలు.. కంటతడి తుడిచేస్తూ అభిజిత్ ఎమోషనల్
తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో 30వ రోజు కొందరు భావోద్వేగాలతో కనిపించారు. ఆ తర్వాత ఒకరినొకరితో మనసు విప్పి మాట్లాడుకొని తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించారు. అనంతరం ఇంటిలో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. సంపన్న వర్గాలుగా సోహైల్, మెహబూబ్, హారిక, అరియానా, గంగవ్వ, ఇక బీబీ హోటల్ స్టాఫ్‌గా ఇంటి సభ్యులు నటించారు. ఇంటిలో 31వ రోజు ఏం జరిగిందంటే..

లాస్యను ఓదార్చిన గంగవ్వ
నామినేషన్‌లో దివి పప్పు గురించి కామెంట్ చేయడంతో యాంకర్ లాస్య మనస్తాపానికి గురైంది. బాధతో ఏడుస్తూంటే గంగవ్వ ఓదార్చే ప్రయత్నం చేశారు. లాస్య నువ్వాల ఏడిస్తే మీ ఇంట్లో వాళ్లు చూస్తే బాధపడుతారు. మీరు ఇలా ఏడిస్తే నాకు బాధ కలుగుతుంది అంటూ లాస్య కంటతడిని గంగవ్వ తుడిచింది.

మోనాల్ ఏడుస్తుంటే అభిజిత్ సారీ
నామినేషన్ ప్రక్రియలో తన గురించి అఖిల్‌కు, అభిజిత్‌కు గొడవ జరిగిన తీరుతో మోనాల్ ఏడుపులో మునిగిపోయింది. లాస్య ఓదార్చుతుండగా అభిజిత్ వచ్చి నా వల్లే గొడవ జరిగింది. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అఖిల్ నీ పేరు ఎత్తడం వల్ల నేను అలా మాట్లాడిల్సి వచ్చింది. సారీ అంటూ మోనాల్ కంటతడిని తడిచారు.

మోనాల్‌తో అఖిల్ సార్థక్ ఎమోషనల్‌గా
ఇక 29వ రోజు అర్ధరాత్రి అఖిల్, మోనాల్ కూర్చొని నామినేషన్ ప్రక్రియలో జరిగిన గొడవ గురించి చర్చించారు. నేను ఓ మాట అంటే దానిని కావాలనే టాపిక్‌ను డైవర్ట్ చేశారు. దానిని కావాలని వివాదంగా మలిచాడు అంటూ మోనాల్‌కు అఖిల్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మోనాల్‌ను కూల్ చేసే ప్రయత్నం చేయడానికి అఖిల్ ట్రై చేయడం కనిపించింది.

అభిజిత్ చేతిలో మోనాల్ చేయి వేసి
ఇక మరోసారి అభిజిత్, మోనాల్ మధ్య చర్చ జరిగింది. వారిద్దరూ కూర్చొని నామినేషన్ ప్రక్రియలో జరిగిన వివాదంపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఇక ముందు నీ గురించి అసలే మాట్లాడను. అందుకు సాక్ష్యంగా నీ చేతిపై నోటరీ రాసి సంతకం చేస్తాను. నా గురించి నీవు మాట్లాడనని చెప్పి నా చేతిపై సంతకం చేయాలని అడిగితే.. అభిజిత్ చేతిపై మోనాల్ సంతకం చేసింది.
Recommended Video

ఇంటిలో ఫన్‌గా బీబీ హోటల్ టాస్క్
ఇక ఇంటిలో కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బీబీ హోటల్ టాస్క్ మొదలైంది. రిచ్ పీపుల్‌గా సోహైల్, మెహబూబ్, హారిక ఇంటిలోకి ప్రవేశించగా హోటల్ సిబ్బంది స్వాగతించారు. అంతలోనే ప్రిన్సెస్ అరియానా ఇంట్లోకి ప్రవేశించడంతో సందడిగా మారింది. బీబీ హోటల్ టాస్క్ చాలా ఫన్‌గా సాగింది. అరియానా, అవినాష్ మధ్య వినోదం ఫుల్లుగా నవ్వించింది. టాస్క్ మొత్తం ఫన్‌తో సాగుతుంది.


Click it and Unblock the Notifications











