అరియానా Vs సోహైల్: కత్తులు దూసుకొన్న సెలబ్రిటీలు, బిగ్‌బాస్ హౌస్‌లో మాటల యుద్ధం
ఇంటిలో మూడో వారం ఇంటి సభ్యుల మధ్య గందరగోళం, గొడవలు, వాగ్వాద సన్నివేశాలు తారస్థాయికి చేరుకొన్నాయి. మూడో వారానికి ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో వాడివేడి చర్చ జరిగింది. ఇంటి సభ్యులు ఒకరిపై వాగ్భ్రాణాలు సంధించుకొన్నారు. ఓవరాల్‌గా 16వ రోజు మొత్తం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోవడంతో సరిపోయింది. 16వ రోజున ఇంటిలో జరిగిన సన్నివేశాలు, సంఘటనలు ఏమిటంటే..
Recommended Video

మూడో వారంలో రేషన్ మేనేజర్‌గా
మూడోవారానికి కెప్టెన్‌గా నోయల్ వ్యవహరిస్తుండటంతో రేషన్ మేనేజర్‌ను నియమించుకోవాలని బిగ్‌బాస్ కోరగా.. ఆ పోస్టును అభిజిత్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. రేషన్ మేనేజర్‌గా ఎంపికైన అభిజిత్‌కు బిగ్‌బాస్ థ్యాంక్స్ చెప్పారు. అలా అభిజిత్ రేషన్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇంటి సభ్యులందరూ అభిజిత్‌ను అభినందించారు.

మూడో వారం నామినేషన్‌లో
బిగ్‌బాస్ తెలుగు 4 హౌస్‌లో కరాటే కల్యాణి ఎలిమినేషన్ అవుతూ దేవీ నాగవల్లిని నామినేషన్ చేయడం తెలిసిందే. ఇక సోమవారం 16వ రోజున కెప్టెన్ నోయల్ సీన్‌కు ప్రత్యేక అధికారాలు ఇచ్చి ఎవరినైనా నామినేట్ చేసే అధికారం ఇవ్వడంతో ఈ వారం నామినేట్ అయిన రెండో సెలబ్రిటీగా యాంకర్ లాస్య జాబితాలో చేరారు. అలా నామినేషన్ ప్రక్రియ మొదలు కాకముందే ఇద్దరు సభ్యులు నామినేట్ కావడం గమనార్హం.

అరియానా, సోహైల్ మధ్య వాగ్వాదం
నామినేషన్ ప్రక్రియలో సోహైల్, అరియానా గ్లోరి మధ్య పెద్ద గొడవే జరిగింది. అరియానాను నామినేట్ చేస్తూ సోహైల్ కొన్ని కారణాలు చెప్పడంతోపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిద్దరి మధ్య కొన్ని విషయాలపై వాడివేడి చర్చ జరిగింది. నీ గురించి ఏమిటో నాకు తెలుసని సోహైల్ అంటే.. నీ గురించి నాకు బాగానే తెలుసు అంటూ అరియానా ఘాటుగా జవాబిచ్చారు. నా గురించి మాట్లాడటం నన్ ఆఫ్ బిజినెస్ అంటూ ఒకరికొకరు గట్టిగా వాదులాడుకొన్నారు.

సెలబ్రిటీ మధ్య మాటల యుద్ధం
ఇంటి సభ్యుల్లో సుజాత, హారిక మధ్య, అలాగే అఖిల్ సార్థక్, కుమార్ సాయి మధ్య భారీగా మాటల యుద్దం జరిగింది. వీరే కాకుండా ప్రతీ ఒక్కరు రెండేసి ఫోటోలు మంటల్లో వేస్తూ నామినేట్ చేయాల్సి రావడంతో వారు చెప్పే కారణాలపై వాదులాట జరిగింది. దాంతో ఇంటి వాతావరణం గంభీరంగా మారింది.

మూడోవారం నామినేషన్‌లో
మూడో వారంలో నామినేట్ అయిన సెలబ్రిటీలో ఏడుగురు ఉన్నారు.
న్యూస్ రీడర్ దేవీ నాగవల్లి
యాంకర్ లాస్య మంజునాథ్
యాంకర్ అరియానా గ్లోరి
కమెడియన్, నటుడు కుమార్ సాయి
యూట్యూబర్ మెహబూబ్ దిల్ సే
సినీ నటి మోనల్ గజ్జర్
యాంకర్ దేత్తడి హారిక


Click it and Unblock the Notifications











