డెత్ గేమ్‌కు తెరలేపిన సెలబ్రిటీలు.. బిగ్‌బాస్ సీరియస్ వార్నింగ్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో నాలుగో వారం నామినేషన్లకు తెర లేచినట్టు కనిపిస్తున్నది. ఈ సారి నామినేషన్‌ కోసం బిగ్‌బాస్ కొత్తగా ప్లాన్ చేసినట్టు స్పష్టమైంది. కొత్త రకం టాస్క్‌, గెటప్స్‌తో ఇంటి వాతావరణాన్ని మార్చేశారు. ఇక తాజాగా విడుదల చేసిన సోమవారం ఎపిసోడ్ టీజర్ ఆసక్తిని రేపుతున్నది. ఆ టీజర్ వివారాల్లోకి వెళితే..

డిటెక్టివ్స్‌గా అఖిల్, సోహైల్

డిటెక్టివ్స్‌గా అఖిల్, సోహైల్

అఖిల్, సోహైల్ ఇద్దరు డిటెక్టివ్‌‌లుగా మారిపోయారు. చేతిలో ఫిస్టల్‌తో ఫ్యాన్సీ గెటప్‌తో హడావిడి చేస్తున్నారు. ఇంటిని పర్యవేక్షిస్తూ సభ్యులను విచారించారు. డెత్ గేమ్‌లో ఇంటి సభ్యులు ప్లాన్ గురించి ఆరా తీస్తూ కనిపించారు. ఇలా ఇంట్లో సభ్యుల గొడవలు, నామినేషన్ గొడవలు గందరగోళాన్ని సృష్టించినట్టు కనిపిస్తున్నది.

సుజాత, అమ్మా రాజశేఖర్‌ను ఇంటారాగేషన్

సుజాత, అమ్మా రాజశేఖర్‌ను ఇంటారాగేషన్

ఇక ఇంటి సభ్యుల్లో అమ్మా రాజశేఖర్ మాస్టర్‌ను, జోర్దార్ సుజాత్‌ను డిటెక్టివ్స్ అఖిల్, సోహైల్ విచారిస్తూ కనిపించారు. మాస్టర్ మీరు ఎవరినీ చంపాలనుకొంటున్నారో చెప్పండి అంటూ అమ్మా రాజశేఖర్, సుజాతను అడగడం కనిపించింది. ఇక నామినేషన్ గేమ్‌లో కుమార్ సాయి ఇరిటేట్ అవుతూ ఎప్పుడూ అదే కథ చెబుతున్నారు అంటూ లేచి వెళ్లిపోయారు.

తమలో తాము గొడవ

తమలో తాము గొడవ


మెహబూబ్, అరియానా, లాస్య, అభిజిత్, అవినాష్ అనేక పాయింట్లను లేవనెత్తారు. అయితే డిటెక్టివ్స్ సోహైల్, అఖిల్ తమలో తాము గొడవ పడటం గేమ్‌లో ట్విస్ట్‌గా మారింది. బిగ్‌బాస్ చెప్పిందేమిటీ అంటూ తమలో తాము చర్చించుకొన్నారు. బయటో పంచాయితీ అయితే మనదో పంచాయితీ అంటూ గుసగుసలాడుకొంటూ అఖిల్, సోహైల్ కనిపించారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Devi Nagavalli Re Entry? !ప్రేక్షకుల డిమాండ్!! | Filmibeat Telugu
ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ క్లాస్

ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ క్లాస్

ఇదిలా ఉండగా, ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇది నామినేషన్ ప్రక్రియ అనే విషయాన్ని గుర్తుంచుకోండి అంటూ క్లాస్ పీకారు. ఇంటి నుంచి గుంపుగా సెలబ్రిటీలు పరుగెత్తతూ నానా రచ్చ చేసినట్టు స్పష్టమైంది. దీంతో సోమవారం ఎపిసోడ్ మరింత ఆసక్తిగా ఉంటుందనే ఫీలింగ్‌ను టీజర్ కల్పించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X