బిగ్‌బాస్ ఇంట్లో గాయపడిన జబర్దస్త్ అవినాష్.. మెడికల్ రూమ్‌కు తరలింపు!

బిగ్‌బాస్ హౌస్‌లో కిల్లర్ కాయిన్ పాయింట్స్ టాస్క్‌ 24వ రోజు కూడా కొనసాగింది. ఎక్కువ సంఖ్యలో కాయిన్స్ సొంతం చేసుకోవడానికి ఇంటి సభ్యులు ఎత్తుకుపై ఎత్తు వేశారు. సోయల్, మెహబూబ్ ఇంటి సభ్యులు నిద్రపోతే వారి కాయిన్స్ దొంగిలించే ప్రయత్నం చేశారు. అలా తమ కాయిన్స్ దొంగిలించడంపై ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సోహైల్, అమ్మా రాజశేఖర్ మాస్టర్ల మధ్య గట్టిగానే గొడవ జరిగింది. 24వ రోజున ఏం జరిగిందంటే..

అమ్మా రాజశేఖర్, సోహైల్ ఫైట్

అమ్మా రాజశేఖర్, సోహైల్ ఫైట్


తన కాయిన్స్‌ దొంగిలించడంపై సోహైల్‌పై అమ్మా రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే తాను గేమ్ ఆడుతున్నానంటూ సోహైల్ సమాధానమిస్తే మాస్టర్ మండిపడ్డారు. కాయిన్స్ దొంగలించి గేమ్ ఎలా గెలుస్తావో చూస్తాను. ఆడురా నీ ఆట.. నీవు ఎలా గెలుస్తావో చూస్తా. ఇంత కష్టపడి కాయిన్స్ సంపాదిస్తే కొట్టేస్తారా? మనసాక్షి లేకుండా ఆడండి అని రాజశేఖర్ శాపనార్థాలు పెట్టాడు.

స్విచ్ కార్డును పడేసిన మెహబూబ్.. దక్కించుకొన్న సుజాత

స్విచ్ కార్డును పడేసిన మెహబూబ్.. దక్కించుకొన్న సుజాత

కిల్లర్ కాయిన్ టాస్క్ సందర్భంగా బిగ్‌బాస్ స్విచ్ కార్డును పై నుంచి వేశాడు. ఆ కార్డు మెహబూబ్ చేతికి దక్కింది. అయితే అది పనికిరాదనుకొని పడేస్తే.. జోర్దార్ సుజాత్ తీసుకొని దాచుకొన్నారు. ఆ తర్వాత స్విచ్ కార్డు‌కు స్పెషల్ పాయింట్స్ ఉంటాయి. దానిని జాగ్రత్తగా పెట్టుకొండి అంటూ సూచించాడు. స్విచ్ కార్డును పడేసిన మెహబూబ్ షాక్ గురయ్యాడు. కార్డును పడేసినందుకు మెహబూబ్‌ను సోహల్ తిడుతూ కనిపించాడు. చేతికి వచ్చిన అదృష్టాన్ని పడేశాడు కదరా అంటూ తిట్టాడు.

మెహబూబ్‌కు ఎక్కువ పాయింట్లు

మెహబూబ్‌కు ఎక్కువ పాయింట్లు

కిల్లర్ కాయిన్స్ గేమ్ ఫస్ట్ లెవెల్ ముగిసింది. మీ కాయిన్స్‌ను తీసుకొని లివింగ్ రూమ్‌లోకి వచ్చి వారు సంపాదించిన కాయిన్స్‌ లెక్క చెప్పమని అడుగగా.. మెహబూబ్ అత్యధికంగా 4వ పాయింట్లు, ఆ తర్వాత సోహైల్ అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

వెల్ ప్రో డ్రస్సులతో కిల్లర్ కాయిన్ టాస్క్

వెల్ ప్రో డ్రస్సులతో కిల్లర్ కాయిన్ టాస్క్

ఆ తర్వాత రెండో లెవెల్ గేమ్ ప్రారంభమైంది. ఇంటి సభ్యులకు ప్రత్యేకంగా వెల్ ప్రో జాకెట్ డ్రెస్సులు ఇచ్చాడు. అలాగే మరో వెల్ ప్రో కిల్లర్ కాయిన్ ఇచ్చి దానిని ఎవరిపైకి విసిరాలి. అది ఎవరికైనా అతుక్కుపోతే వారి సగం అంటే 50 శాతం కాయిన్స్ విసిరిన వ్యక్తికి వెళ్లిపోతాయి అని గేమ్ రూల్ చెప్పారు.

గాయపడిన జబర్దస్త్ అవినాష్

గాయపడిన జబర్దస్త్ అవినాష్

కిల్లింగ్ కాయిన్ రెండో లెవెల్ ఆడుతున్న సమయంలో అవినాష్ పడిపోయాడు. అవినాష్ గాయం కావడంతో ఇంటి సభ్యులు అతడికి చికిత్స అందించాలని బిగ్‌బాస్‌కు సూచించారు. ఆ తర్వాత అవినాష్‌ను మెడికల్ రూమ్‌కు తీసుకొని వెళ్లారు. అలా రెండో లెవెల్ గేమ్ కొనసాగుతున్నది.

Recommended Video

Actor Madhunandan Interview Part 2 రాజ్ తరుణ్, హెబ్బాపటేల్ కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉంటది!!
మోనాల్ భోరున ఏడుస్తూ

మోనాల్ భోరున ఏడుస్తూ

ఈ క్రమంలో మెనాల్ గజ్జర్ తీవ్ర మనస్తాపానికి గురైంది. బాత్రూంలోకి వెళ్లి తనకు తాను ఏడుస్తూ తన బాధను చెప్పుకొనే ప్రయత్నం చేశారు. తనను ఉద్దేశించి మాస్టర్ కామెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చారు. తెలుగులో మాట్లాడమని సూచిస్తే.. నాకు తెలుగులో ఇప్పుడు మాట్లాడటం రాదు. నా బాధను ఇంగ్లీష్‌లోనే చెప్పుకొంటాను అంటూ ఏడ్చింది. ఆ తర్వాత బాత్రూంలోకి వెళ్లి భోరున విలపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X