అది నా క్యారెక్టర్ కాదు.. నన్ను అందరూ వాడుకొన్నారు.. మోసం చేశారు.. కరాటే కల్యాణి

తెలుగు సినిమా పరిశ్రమలో కరాటే కల్యాణికి ఉన్న ఇమేజ్‌ ఓ రకంగా ఉంటుంది. ఓ చిత్రంలో బాబీ అంటూ ఓ పాత్రలో నటించిన తర్వాత ఆమెకు 'వ్యాంప్' అనే ముద్ర పడింది. కానీ బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 4లోకి అడుగుపెట్టిన తర్వాత కరాటే కళ్యాణి అంటే గౌరవప్రదమైన అభిప్రాయం వ్యక్తమైంది. తెరమీద కనిపించే పాత్రలతో వ్యక్తుల వ్యక్తిత్వాలకు సంబంధం లేదనే అభిప్రాయాన్ని ఆమె ప్రవర్తన, ఆమె కట్టుబాట్లు వ్యక్తం చేశాయి. కరాటే కల్యాణిలోని సున్నిత భావాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. బిగ్‌బాస్ వేదికపైకి వచ్చిన తర్వాత ఆమె మాట్లాడుతూ..

Recommended Video

#BiggBossTelugu4 : మాస్క్ ముఖానికి అవసరం, ఎంటర్టైన్మెంట్‌కు కాదు | Contestants Entry || Oneindia
శ్రీకాకుళం జిల్లాలో పుట్టి విజయనగరంలో...

శ్రీకాకుళం జిల్లాలో పుట్టి విజయనగరంలో...

నా పేరు కరాటే కల్యాణి. పుట్టింది శ్రీకాకుళం జిల్లా కవిటి. పెరిగింది విజయనగరం జిల్లాలో. చదువు అయితే అబ్బలేదు కానీ సంప్రదాయ కళలు మాత్రం అబ్బాయి. అయితే బాబీ అనే క్యారెక్టర్ విపరీతంగా జనాల్లోకి వెళ్లిపోయింది. కానీ నా క్యారెక్టర్ అది కాదు. కరాటే కల్యాణి స్క్రీన్ పేరు కాదు. నాకు తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ ఉంది. నేషనల్ లెవెల్‌లో నాలుగుసార్లు గోల్డ్ మెడల్ తీసుకొన్నాను అని కరాటే కల్యాణి తెలిపారు.

పెళ్లి నాకు దురదృష్టం తెచ్చింది..

పెళ్లి నాకు దురదృష్టం తెచ్చింది..


నాకు జీవితంలో మా నాన్న అంటే చెప్పలేనంత ప్రేమ. అలాగే మానాన్న ద్వారా హరికథ చెప్పడం అంటే అంతే ప్రేమ ఏర్పడింది. పెళ్లి అనేది కొంతమందికి అదృష్టం. కొంతమందికి దానితోనే దురదృష్టం వస్తుంది. పెళ్లైన ప్రతీసారి కూడా ప్రెగ్నెన్సీ రావడం మిస్ అవ్వడం జరిగిపోతుంటుంది అంటూ కరాటే కళ్యాణి ఎమోషనల్ అయ్యారు.

సీమంతం జరుపుకోవాలనే కోరిక ఉంది..

సీమంతం జరుపుకోవాలనే కోరిక ఉంది..

నా జీవితంలో ఒక కోరిక ఉంది. నాకు సీమంతం జరగడం చూసుకోవాలనే కోరిక ఉంది. నేను గర్బవతి అయినప్పుడు పెద్దగా ఉండే నా పొట్టను చూసుకోవాలనుకొంటాను. కానీ నాకు ఎప్పుడూ ఆ కోరిక తీరలేదు. పెళ్లి నా జీవితానికి కలిసిరాలేదు. నన్ను అందరూ మోసం చేశారు. వాడుకోవడానికి చూశారే తప్ప.. నా గురించి ఎవరూ కేర్ తీసుకోలేదు అంటూ కరాటే కల్యాణి కంటతడి పెట్టారు.

ఓ బాబును కోళ్ల గూట్లో వేశారని

ఓ బాబును కోళ్ల గూట్లో వేశారని

నా జీవితం చాలా నిస్పారంగా సాగుతున్న సమయంలో ఓ ఊరి నుంచి ఫోన్ వచ్చింది. ఓ బాబును కోళ్లగూట్లో పడేశారు. ఆ బాబుకు ఒళ్లంతా చీమలు పట్టాయి. మీరు బాబును పెంచుకొంటానని చెప్పారు కదా.. వాళ్ల పోజిషన్ బాగాలేదు. ఆ బాబును మీరు పెంచుకొంటారా అని అడిగితే వాడిని తెచ్చుకొన్నాను అని కరాటే కల్యాణి అన్నారు.

ఆ బాబును నా గుండెలపైనే

ఆ బాబును నా గుండెలపైనే

నా చేతికి ఆ బాబు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాడిని నా గుండెలపైనే పెంచుకొంటున్నాను. బిగ్‌బాస్‌లో ఉంటే.. నీవేంటో అద్దంలో చూసుకొన్నట్టుగా ఉంటుంది. అందుకే నేను బిగ్‌బాస్‌లోకి వచ్చాను. నేనేంటో జనాలకు చెప్పడానికి బిగ్‌బాస్ చక్కటి వేదికగా భావిస్తున్నాను అని కరాటే కళ్యాణి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X