Bigg Boss unseen హారికతో తిరిగితే తప్పులేదా? మోనాల్ ఫైర్.. నీకు మోసం చేయను.. అభిజిత్ క్లారిటీ
బిగ్‌బాస్ తెలుగు షోలో సాగుతున్న ట్రాయంగిల్ స్టోరి హైలెట్‌గా మారుతున్నది. అభిజిత్, మోనాల్, అఖిల్ మధ్య జరుగుతున్న ప్రేమ వ్యవహారం వారి మధ్య గందరగోళం సృష్టిస్తున్నది. ఈ క్రమంలో గత రాత్రి ఎపిసోడ్‌లో ప్రసారమైన అన్ సీన్ ఎపిసోడ్‌లో అభిజిత్, మోనాల్ గజ్జర్ మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా ఉంది. ఆ సంభాషణ మీ కోసం..

అఖిల్‌తో క్లోజ్‌గా ఉంటే తప్పా?
అఖిల్ సార్థక్‌తో నేను క్లోజ్‌గా ఉంటున్నాను. అందులో వేరే విషయం లేదు. ఇంటిలో నాకు సరిపడే మనస్తత్వంతో ఉంటున్నాను. నీవు కూడా నీకు నచ్చిన వారితో ఉండటం లేదా? అఖిల్‌తో ఉండటాన్ని ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారో అర్ధం కావడం లేదు. అఖిల్ చిన్నవాడు.. వాడి మనసులో ఏమీ లేదు అని అభిజిత్‌తో మోనాల్ వాదనకు దిగింది.

ఇంట్లో ఏం జరుగుతుందో దాచగలమా?
అఖిల్‌తో క్లోజ్‌గా ఉన్న మాత్రాన ఇంట్లో ఏం జరుగుతుంది. ఇంట్లో అందరి కాదని ఏం చేస్తాం. ఇంటి నిండా కెమెరాలు ఉండగా ఏం జరుగుతుంది. అంతా రికార్డింగ్ అవుతూనే ఉందిగా. మా మధ్య దాచాల్సిన విషయాలే ఏమి లేవు. ఈ షోను అందరూ చూస్తున్నారు. అంత మాత్రాన మా గురించి చెవులు కొరుక్కోవడం ఏమిటో అర్థం కావడం లేదు అని మోనాల్ అన్నారు.

దేత్తడి హారికతో నీవు గంటల కొద్ది మాట్లాడితే
దేత్తడి హారికతో నీవు గంటల గంటలు మాట్లాడితే తప్పు లేదు కానీ నేను అఖిల్ క్లోజ్‌గా ఉంటే ఏదో మాట్లాడుతున్నారు. నీవు హారికతో క్లోజ్‌గా ఉంటే నేను ఏమైనా అడిగానా. మమల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు అని మోనాల్ గట్టిగా క్లాస్ పీకింది. అయితే నేను హారికతో క్లోజ్‌గా ఉన్న సుజాత్, లాస్య, అరియానా మిగితా అందరితో క్లోజ్‌గానే ఉంటున్నాను. నీ మాదిరిగా ఒక్కరితోనే క్లోజ్‌గా ఉండటం లేదు అని అభిజిత్ అన్నారు.

నీకు మోసం చేయను అంటూ అభిజిత్
మోనాల్ ఎమోషనల్‌గా మారడం చూసి అభిజిత్ కూల్ చేసే ప్రయత్నం చేస్తూ.. ఇంటిలో ఎవరు ఏమనుకొన్నా నీ మీద నాకు ఉండే అభిప్రాయం వేరు. నీ గురించి, నీవు పెరిగిన విధానం, నీ ప్రవర్తన గురించి తెలుసు కాబట్టి నేను పెద్దగా ఏమీ ఊహించుకోలేదు. నా నుంచి నీకు ఎలాంటి ప్రతికూలత ఉండదు. నేను నిన్ను మోసం చేయను. నీతో ఎంత సన్నిహితంగా ఉండాలో అంతే ఉంటాను అని మోనాల్‌తో అభిజిత్ అన్నారు.
Recommended Video

నీ బాధను నేను అర్ధం చేసుకోగలను
అర్ధరాత్రి రెండు గంటల తర్వాత మోనాల్ గజ్జర్ ఒంటరిగా కూర్చొని.. నా జీవితంలో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు అంటూ మదనపడుతుంటే.. అభిజిత్ లేచివచ్చి సముదాయించాడు. నీవు ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడకు. నీ మనసు బాగాలేదన్న విషయం నాకు తెలుసు. అందుకే నీకు కంపెనీ ఇద్దామని నిద్ర నుంచి లేచి వచ్చాను. నీ బాధను నేను అర్ధం చేసుకోగలను అని అభిజిత్ అన్నారు.


Click it and Unblock the Notifications











