ఇంట్లోకి జిగేల్ రాణి ఎంట్రీ.. ఊపులు, హోయలకు కంటెస్టెంట్లు చిత్తు.. నయా కెప్టెన్‌గా ఎవరంటే..

బిగ్‌బాస్ హౌస్‌లో 18వ రోజు, 19వ రోజు సరదగా సాగిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సాక్షిదీక్షిత్ అడుగుపెట్టగా వాతావరణం కొత్తగా మారిపోయింది. టాస్క్‌లు, పార్టీలతో ఇళ్లంతా కళకళలాడింది. ఇంటి సభ్యులు జోష్‌తో ఊగిపోయారు. ఇంటి కెప్టెన్‌గా గంగవ్వ ఎంపికయ్యారు. ఇంకా ఇంటిలో ఏం జరిగిందంటే..

ఉక్కు హృదయం టాస్క్‌పై రచ్చ

ఉక్కు హృదయం టాస్క్‌పై రచ్చ

ఉక్కు హృదయం సందర్భంగా జరిగిన సంఘటనలపై ఇంటి సభ్యుల మధ్య చిన్నపాటి డిస్కషన్ జరిగింది. తనను కిడ్నాప్ చేయడంపై అభిజిత్‌పై దివి వద్యా కోపగించుకొన్నారు. మమల్ని మోసం చేశావని డ్యాన్స్ మాస్టర్ అమ్మా రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఉక్కు హృదయంపై కాసేపు వాదులాడుకొన్నారు.

జైలు నుంచి నోయల్‌కు విముక్తి

జైలు నుంచి నోయల్‌కు విముక్తి

ఇక జైల్లో ఉన్న నోయల్ సీన్‌ తన ఆహారం కోసం రాగులను విసురురాయిని తప్పితూ వాటిని పొడి చేశారు. అలా వంట కోసం ఏర్పాట్లు చేసుకొంటుండగా జైలుశిక్ష కాలం పూర్తయిందని చెప్పాడు. ఆ తర్వాత నోయల్‌ను ఇంటి సభ్యులు ఊరేగిస్తూ ఇంట్లోకి తీసుకెళ్లారు.

ఇంటి కెప్టెన్‌గా గంగవ్వ

ఇంటి కెప్టెన్‌గా గంగవ్వ

ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. కొన్ని కలర్స్ పోసిన బౌల్స్‌ను ఇచ్చారు. ఎవరి బౌల్స్‌లో ఎక్కువ కలర్ ఉంటే వాళ్లు ఇంటి కెప్టెన్‌గా అవుతారు అని గేమ్ రూల్స్ చెప్పారు. అభిజిత్, హారిక, గంగవ్వ, గేమ్ మొదలుపెట్టారు. చివరికి గంగవ్వ బౌల్‌లో కలర్ ఎక్కువగా ఉండటంతో కెప్టెన్‌గా ఎంపికయ్యారు. మూడోవారం కెప్టెన్‌గా గంగవ్వ వ్యవహరించబోతున్నారు.

ఇంట్లోకి జిగేల్ రాణి

ఇంట్లోకి జిగేల్ రాణి

ఇంటిలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా స్వాతి దీక్షిత్ అడుగుపెట్టారు. బుట్ట బొమ్మ పాట ప్లే అవుతుండగా ఇంటి సభ్యులు డ్యాన్స్ చేస్తూ ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత అందరితో పరిచయ కార్యక్రమం జరిగిన తర్వాత మెయిన్ హాల్‌లో సమావేశం జరిగింది. స్వాతి దీక్షిత్ రావడంతోపాటు ఇంట్లోని మగ కంటెస్టెంట్లకు ఓ సర్‌ప్రైజ్ తెచ్చింది. ఆమెను ఇంప్రెస్ చేసిన వాళ్లకు ఆ సర్‌ప్రైజ్ ఉంటుందని చెప్పారు.

స్వాతిని దీక్షిత్‌ను ఇంప్రెస్ చేసిన ఆ నలుగురు

స్వాతిని దీక్షిత్‌ను ఇంప్రెస్ చేసిన ఆ నలుగురు

స్వాతి దీక్షిత్‌ను ఉద్దేశించి ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఇంప్రెస్ చేశారు. అఖిల్ పాటపడగా, అమ్మా రాజశేఖర్ లవ్‌తో డైలాగ్స్ చెప్పారు. జబర్దస్త్ అవినాష్ లవ్ ప్రపోజ్ చేశాడు. నోయల్ పాడపాడగా. ఇతరులు తమకు నచ్చిన విధంగా ఇంప్రెస్ చేశారు. అయితే అఖిల్, అమ్మా రాజశేఖర్, నోయల్, అవినాష్‌కు గులాబీ పువ్వు ఇచ్చి ఇంప్రెస్ చేశారని చెప్పగా.. ఐదుగురికి లాంజ్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Bigg Boss హోస్ట్ గా టాప్ హీరోయిన్.. గ్రాండ్ ఎంట్రీ ఆ రోజే!
లాంజ్‌లో పార్టీనైట్ షో

లాంజ్‌లో పార్టీనైట్ షో

స్వాతీ దీక్షిత్ పార్టీలో పాల్గొన్న అఖిల్, అమ్మా రాజశేఖర్, నోయల్, అవినాష్‌ మాత్రమే రూమ్‌లోకి అనుమతించారు. పార్టీ సాంగ్స్ ప్లే అవుతుండగా ఇంటి సభ్యులు జోష్‌తో డ్యాన్స్ చేశారు. అలా మూడు పాటలు ప్లే చేయగా ఇంటి సభ్యులు పార్టీ మూడ్‌లోకి వెళ్లారు. లాంజ్‌లో మాస్ స్టెప్పులతో అలరించారు. అలా పార్టీని గ్రాండ్‌ ఇంటి సభ్యులు సెలబ్రేట్ చేసుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X