బిగ్ బాస్ -4పై స్టార్ మా అధికారిక ప్రకటన.. టీజర్‌తో సర్‌ప్రైజ్ చేసిన యూనిట్

By Manoj Kumar P

కొత్త థీమ్‌తో వచ్చినప్పటికీ... తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిన షో 'బిగ్ బాస్'. ఉత్తరాదిలో ఎప్పటి నుంచో ప్రసారం అవుతోన్న ఈ స్పెషల్ షో... కొన్నేళ్ల క్రితం దక్షిణాదిలోనూ పరిచయం అయింది. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ షో విజయవంతంగా ప్రసారం అయింది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుని, నాలుగో దానికి సిద్ధం అవుతోంది. దీంతో నాలుగో సీజన్‌పై తరచూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో స్టార్ మా దానిపై అధికారిక ప్రకటన చేసింది. అంతేకాదు, ఓ టీజర్‌ను సైతం వదిలింది. ఆ వివరాలు మీకోసం.!

Recommended Video

Bigg Boss 4 Telugu : Bigg Boss 4 రచ్చ రచ్చే.. కంటెస్టెంట్లు గా జిగేల్‌మనిపించే అందాలు..!
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ

బిగ్ బాస్ షో తెలుగులో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. సరికొత్తగా వచ్చిన ఈ షో మన ప్రేక్షకులకు చేరువ కావడానికి చాలా సమయం పడుతుందని అంతా భావించారు. కానీ, దానికి భిన్నంగా జరిగింది. ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభమైన ఈ షోకు తక్కువ వ్యవధిలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే వరుసగా మూడు సీజన్లు పూర్తి చేసుకోగలిగింది.

3 సీజన్లు.. ముగ్గురు విన్నర్లు.. హోస్టులు

3 సీజన్లు.. ముగ్గురు విన్నర్లు.. హోస్టులు

ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రారంభమైనా భారీ విజయాన్ని అందుకుంది బిగ్ బాస్ షో. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్‌లో శివ బాలాజీ విజేతగా నిలవగా.. నాని యాంకరింగ్ చేసిన రెండో సీజన్‌ను కౌశల్ మండా గెలుచుకున్నాడు. ఇక, ఎన్నో వివాదాల నడుమ ప్రారంభమైన మూడో సీజన్‌కు నాగార్జున హోస్ట్ చేయగా.. రాహుల్ సిప్లీగంజ్ టైటిల్ నెగ్గాడు.

నాలుగో సీజన్... ఎన్నో ఊహాగానాలు

నాలుగో సీజన్... ఎన్నో ఊహాగానాలు

మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్... నాలుగో దానికి సైతం సంసిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే దాని గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే సరికొత్త విషయాలు ప్రచారం అవుతున్నాయి. ఇందులో భాగంగానే సీజన్ హోస్ట్... పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి గాసిప్పులు పుట్టుకొస్తున్నాయి.

బిగ్ బాస్ -4పై స్టార్ మా అధికారిక ప్రకటన

కరోనా ప్రభావంతో సినిమా.. సీరియల్స్‌కు సంబంధించిన షూటింగులు నిలిచిపోయాయి. దీంతో స్టార్ మా వీలైనంత త్వరగా బిగ్ బాస్ నాలుగో సీజన్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కొంత మంది ప్రముఖులతో చర్చలు సైతం జరుపుతోందని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సీజన్‌ 4పై ఆ చానెల్ అధికారిక ప్రకటన చేసింది.

టీజర్‌తో సర్‌ప్రైజ్ చేసిన BB యూనిట్

టీజర్‌తో సర్‌ప్రైజ్ చేసిన BB యూనిట్

బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో ప్రారంభం కాబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్టార్ మా ప్రకటన చేస్తూ ఓ టీజర్ వదిలింది. అందులో ఏ వివరాలూ తెలుపకపోయినా త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలిపింది. దీంతో బిగ్ బాస్ ప్రియులు ఆనందంలో మునిగిపోతున్నారు. దీంతో ఈ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.

బిగ్ బాస్ -4లో ఉండే కంటెస్టెంట్లు వీళ్లేనా

బిగ్ బాస్ -4లో ఉండే కంటెస్టెంట్లు వీళ్లేనా

ఈ సీజన్‌కు సంబంధించిన ప్రకటన రాకముందే అందులో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో హీరో అల్లరి నరేష్, సింగర్ హేమచంద్ర, కమెడియన్ తాగుబోతు రమేష్, యాంకర్ వర్షిణి, సింగర్ మంగ్లీ, యాంకర్ ఝాన్సీ, హీరో నందు సహా ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీళ్లే ఫైనల్ అవుతారా అన్నది తెలియాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X