బిగ్ బాస్‌ సీజన్ - 4కు డేట్ ఫిక్స్: ప్రత్యేకమైన వ్యక్తి పుట్టినరోజు నుంచే షో ప్రారంభం.!

By Manoj

చాలా రోజులు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్న షో 'బిగ్ బాస్'. ఉత్తరాదిలో సత్తా చాటిన ఈ షో... దక్షిణాదిలోకి ఎంటరై చాలా ఏళ్లే అవుతోంది. తెలుగులోనూ ఇది మూడేళ్ల క్రితమే పరిచయం అయింది. ఈ క్రమంలోనే విజయవంతంగా మూడు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. దీంతో నాలుగో సీజన్‌ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్‌ సీజన్ - 4కు డేట్ ఫిక్స్ అయినట్లు తెలిసింది. ప్రత్యకమైన వ్యక్తి పుట్టినరోజు నుంచే ఇది ప్రారంభం కాబోతుంది. ఆ వివరాలు మీకోసం..!

మొదటిది మాములే.. తర్వాత రచ్చ రచ్చే

మొదటిది మాములే.. తర్వాత రచ్చ రచ్చే

సరికొత్త థీమ్‌తో నడిచే షో కావడంతో తెలుగులో సక్సెస్ అవుతుందా అని అందరూ అనుమానపడుతున్న సమయంలో బిగ్ బాస్ విజయవంతం అయింది. మొదటి సీజన్‌లో ఏమాత్రం గొడవలకు తావు లేకుండా నడిచినప్పటికీ... ఆ తర్వాతి సీజన్లలో మాత్రం కంటెస్టెంట్ల మధ్య కొట్లాటలు దర్శనమిచ్చాయి. ఇక, బయట కూడా షో విషయంలో పలు రకాల వివాదాలు చుట్టుముట్టాయి.

వివాదాలున్నా.... విజయవంతం చేశారు

వివాదాలున్నా.... విజయవంతం చేశారు

బిగ్ బాస్ షో అంటేనే చాలా మంది విరుచుకుపడిపోయేలా దానిపై రూమర్లు క్రియేట్ అయ్యాయి. దీంతో షోను నిషేదించాలన్న డిమాండ్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఈ రియాలిటీ షో సక్సెస్ అయిందంటే దాని వెనుక హోస్టుల పాత్ర ఎంతో ఉంది. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్, రెండో దానిని నాని, మూడో సీజన్‌ను నాగార్జున సక్సెస్‌ఫుల్‌గా నడపడం వల్లే ఇది సాధ్యమైంది.

మూడు సీజన్లు... విజేతలు మారలేదు

మూడు సీజన్లు... విజేతలు మారలేదు

బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. వీటిలో మొదటి దానిని శివ బాలాజీ, రెండో దానిని కౌశల్ మండా, మూడో సీజన్‌ను రాహుల్ సిప్లీగంజ్ గెలుచుకున్నారు. ప్రతి సీజన్‌లో ఆడవాళ్లు కూడా సత్తా చాటుతున్నప్పటికీ... చివరి మెట్టుపై బోల్తా పడుతున్నారు. దీంతో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

 నాలుగో సీజన్.... అన్నీ అనుమానాలే

నాలుగో సీజన్.... అన్నీ అనుమానాలే


బిగ్ బాస్ సీజన్ -3 ముగిసి చాలా రోజులే అవుతోంది. దీంతో నాలుగో సీజన్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ విజృంభించడంతో సీజన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అలాగే, హోస్ట్ విషయంలోనూ ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. దీనిని హోస్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు.

రూమర్లకు పుల్‌స్టాప్... స్టార్ మా క్లారిటీ

రూమర్లకు పుల్‌స్టాప్... స్టార్ మా క్లారిటీ

అసలు బిగ్ బాస్ సీజన్ -4 ఉంటుందా..? ఉండదా.? అని అనుకుంటున్న సమయంలో స్టార్ మా దీనిపై క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే ఈ సీజన్ ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీజర్‌ను కూడా వదిలింది. ఆ తర్వాత నాగార్జున షూట్‌లో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయడంతో, హోస్ట్ ఆయనే అని అందరికీ క్లారిటీ వచ్చేసింది.

 బిగ్ బాస్‌ సీజన్ - 4కు ముహూర్తం ఫిక్స్

బిగ్ బాస్‌ సీజన్ - 4కు ముహూర్తం ఫిక్స్

ఈ సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని చెప్పిన స్టార్ మా డేట్‌ను మాత్రం ప్రకటించలేదు. దీంతో ఆగస్టు రెండో వారంలో ఇది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్‌ సీజన్ - 4కు ముహూర్తం ఫిక్స్ అయినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇది ఆగస్టు 29 నుంచి మొదలవబోతుందట.

Recommended Video

Kannada Superstar Upendra Kabja Movie Photoshoot Making
 ప్రత్యేకమైన వ్యక్తి పుట్టినరోజు నుంచే షో

ప్రత్యేకమైన వ్యక్తి పుట్టినరోజు నుంచే షో

ఆగస్టు 29న అక్కినేని నాగార్జున పుట్టినరోజు. అందునా ఆరోజు శనివారం. సో.. అదే సరైన డేట్ అని స్టార్ మా అభిప్రాయపడినట్లు సమాచారం. అందుకే ఆరోజే షో ప్రారంభించబోతున్నారు. ఇదిలాఉండగా... ఈ సీజన్‌లో పూనమ్ బజ్వా, మంగ్లీ, రఘు మాస్టర్, నందూ, నోయల్, మంజూష, అరియానా గ్లోరీ సహా తదితరులు కంటెస్టెంట్లుగా వస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X