పింకీని పెళ్లి చేసుకోడానికి అతడు రెడీ.. వాళ్ల మదర్‌ గురించి నాకు తెలుసంటూ రవి సంచలన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తుంటాయి. కానీ, చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని.. అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ.. నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇదే ఉత్సాహంతో నిర్వహకులు ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఏకంగా నాలుగు సీజన్లను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదో దాన్ని కూడా మొదలు పెట్టారు. ఇందులోకి కంటెస్టెంట్లుగా వచ్చిన వారిలో ప్రత్యేకంగా నిలిచింది మాత్రం టాన్స్‌జెండర్ ప్రియాంక సింగే అని చెప్పాలి. ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ బరువైన బాధ్యతను తలకెత్తుకున్న ఆమె.. ప్రశంసలు అందుకుంటూ సాగిపోతోంది. కానీ, మానస్‌తో వ్యవహరించే తీరుతో విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో వాళ్లిద్దరిపై రవి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ సంగతులు మీకోసం!

భారీ అంచనాలు.. మంచి రెస్పాన్స్‌తో

భారీ అంచనాలు.. మంచి రెస్పాన్స్‌తో

చాలా భాషల్లో బిగ్ బాస్ షో ప్రసారం అయినా తెలుగులో వచ్చే షోకు మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. సామాన్యులే కాదు.. దీనికి సెలెబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయారు. ఫలితంగా ఈ షోపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఐదో సీజన్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనికి కారణం ఇందులో గతంలో కంటే కొత్త కంటెంట్ ఉండడంతో పాటు ఎన్నో రకాల ఎమోషన్స్ కనిపిస్తుడడమే. ఇక, ఆరంభంలోనే 18 రేటింగ్ అందుకున్న ఈ సీజన్.. వీక్ ఎపిసోడ్స్‌కు కూడా మంచి స్పందనే దక్కించుకుంటోంది.

అందరిలోనూ స్పెషల్ కంటెస్టెంట్‌గా

అందరిలోనూ స్పెషల్ కంటెస్టెంట్‌గా

తాజా సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో ప్రియాంక సింగ్ అలియాస్ జబర్ధస్త్ సాయితేజ స్పెషల్ అట్రాక్షన్ అయిన విషయం తెలిసిందే. జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ మంచి గుర్తింపును అందుకున్న సాయితేజ.. జెండర్‌ను మార్చుకోవాలన్న కోరికతో ఆ తర్వాత సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు. ఆ సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి సమయంలో ప్రియాంక సింగ్‌కు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. దీంతో స్పెషల్ కంటెస్టెంట్‌గా పేరొందింది.

ఆదర్శంగా నిలిచిన ప్రియాంక సింగ్

ఆదర్శంగా నిలిచిన ప్రియాంక సింగ్

బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రియాంక సింగ్ మాత్రం ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చింది. గతంలో తమన్నా కూడా ఇలాగే ప్రవేశించినా.. తన వివాదాస్పద తీరుతో విమర్శల పాలైంది. అయితే, ప్రియాంక మాత్రం హౌస్‌లోకి ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. చక్కని కట్టుబొట్టుతో ఆడవాళ్లే ఈర్శ పడేంత అందంగా తయారవడంతో పాటు హుందాగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి ఆమెకు భారీ స్థాయిలో సపోర్టు కూడా లభిస్తోంది. దీంతో ఈమె పలుమార్లు ఎలిమినేషన్ తప్పించుకుంది.

పింకీ వింత లవ్ ట్రాక్ హైలైట్‌ అవుతూ

పింకీ వింత లవ్ ట్రాక్ హైలైట్‌ అవుతూ

షోలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచే ప్రియాంక సింగ్‌ పలు రకాలుగా ఫోకస్ అవుతోంది. ఆమె రూపం, ఆట తీరుకు చాలా మంది ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సైతం ఆమెకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈమె ఆరంభం నుంచే మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. దీంతో వీళ్ల వింత ట్రాక్ కూడా హైలైట్ అవుతూ ఉంది. దీన్ని బిగ్ బాస్ నిర్వహకులు మరింత ఫోకస్ చేస్తూ చూపిస్తున్నారు. ఫలితంగా ఈ విషయం ప్రేక్షకులు తప్పుబడుతున్నారు. దీంతో ప్రియాంక సింగ్‌పై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

అందరిదీ అదే అభిప్రాయం.. అతడు

అందరిదీ అదే అభిప్రాయం.. అతడు

బిగ్ బాస్ షోలో కనిపించే లవ్ ట్రాకులపై ప్రేక్షకులతో పాటు హౌస్‌మేట్లకు ప్రత్యేకమైన శ్రద్ద ఉంటుంది. ఐదో సీజన్‌లో కూడా పలువురు జంటలుగా మారతారని అంతా అనుకున్నారు. కానీ, ప్రియాంక సింగ్ వ్యవహారాన్ని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఆమె మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నించడంతో కంటెస్టెంట్లు ఆట పట్టిస్తున్నారు. అదే సమయంలో తెగ అల్లరి చేస్తున్నారు. ఇక, ఈ విషయంలో మానస్ మాత్రం ఎంతో సెటిల్డ్‌గా ఉంటున్నాడు. ప్రియాంకకు వీలైనంత స్పేష్ మాత్రమే ఇస్తున్నాడు. కానీ, ఈమె మాత్రం చాలా సీరియస్‌గానే ట్రై చేస్తోంది.

ప్రియాంక, మానస్‌కు పెళ్లి చేసేశారుగా

ప్రియాంక, మానస్‌కు పెళ్లి చేసేశారుగా

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో మాట్రిమోనీ టాస్క్ జరిగింది. ఇందులో పెళ్లి కాని అబ్బాయిలు, అమ్మాయిలు తమకు కాబోయే వాళ్లు ఎలా ఉండాలో చెప్పాలి. అందులో ఎవరి మాటలు నచ్చుతాయో వాళ్లు బెస్ట్ జోడీగా నిలుస్తారని బిగ్ బాస్ చెప్పాడు. ఇక, ఇందులో తాను చాలా తక్కువగా మాట్లాడతానని.. ఎక్కువ మాట్లాడుతూ.. తన ఫ్యామిలీ అన్నట్టుగా అందర్నీ బాగా చూసుకోవాలని చెప్పాడు. దీనికి అనుగుణంగానే ప్రియాంక ఆన్సర్ ఇచ్చింది. దీంతో వీళ్లను బెస్ట్ జోడీగా హౌస్‌మేట్స్ సెలెక్ట్ చేశారు. అనంతరం వీళ్లిద్దరికీ దండలు మార్చేసి మరీ పెళ్లి కూడా చేశారు.

పింకీ మానస్‌పై రవి సంచలన వ్యాఖ్యలు

పింకీ మానస్‌పై రవి సంచలన వ్యాఖ్యలు

పింకీ, మానస్ గురించి రవి, ప్రియ, ఆనీ మధ్యలో చర్చ జరిగింది. ఆ సమయంలో రవి.. మానస్ విషయంలో పింకీ క్లారిటీగా ఉందా అని అడగ్గా.. పిచ్చ క్లారిటీతో ఉందని ప్రియ చెప్పింది. కానీ, ఆనీ మాస్టర్ మాత్రం 'పింకీ టూమచ్‌గా ఆశలు పెట్టుకుంటుంది. ఆమెను చూస్తే భయమేస్తుంది. తన గురించి తాను ఆడకుండా మానస్ కోసమే ఆడుతుంది' అని అంది. అప్పుడు రవి 'నాకు మానస్ వాళ్ల అమ్మ కూడా తెలుసు. ఆమె కాబోయే కోడలు కోసం ఎలా ఆలోచిస్తుందో తెలుసు. అందుకే మానస్ దగ్గరకు వెళ్లి అడిగా.. అతడు టాస్కులో పెళ్లికి ఓకే అన్నాడు' అని చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X