Bigg Boss: ఆ కంటెస్టెంట్ కోసం బిగ్ బాస్ సంచలన నిర్ణయం.. షో చరిత్రలో తొలిసారి రూల్ మార్చేసి మరీ!

అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టు.. అసలు క్లిక్ అవుతుందా లేదా అన్న అనుమానాల నడుమ తెలుగులోకి పరిచయం అయిన షో బిగ్ బాస్. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన దీనికి మన ప్రేక్షకులు భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో నాలుగు సీజన్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్ కూడా అదే రీతిలో స్పందనను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక, తాజా సీజన్‌లో ఓ కంటెస్టెంట్ కోసం బిగ్ బాస్ రూల్‌ను మార్చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

వాటన్నింటికీ మించి ఉండేలా ప్లాన్

వాటన్నింటికీ మించి ఉండేలా ప్లాన్

బిగ్ బాస్ షో చాలా భాషల్లో ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. అయితే, తెలుగులో వచ్చే దానికి మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. అందుకే ఈ షో నాలుగు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. అది కూడా జాతీయ స్థాయి రేటింగ్‌తో దూసుకెళ్తోంది. ఇక, తాజా సీజన్‌లో నిర్వహకులు సరికొత్త ప్లాన్లు చేస్తూ ఐదింతలు మజాను పంచుతున్నారు.

నలుగురు ఔట్.. మంచి రేంటింగ్‌తో

నలుగురు ఔట్.. మంచి రేంటింగ్‌తో

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ నాలుగు వారాలు జరగగా.. సరయు రాయ్, ఉమాదేవి, లహరి షారి, నటరాజ్ మాస్టర్లు ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు హౌస్‌లో 15 మంది ఉన్నారు. వీళ్ల ద్వారా బిగ్ బాస్ సరికొత్త టాస్కులు చేయిస్తున్నాడు. దీంతో ఈ షోకు భారీ రేటింగ్ వస్తూనే ఉంది.

ఆమెకు మాత్రం అలా షాకిచ్చాడుగా

ఆమెకు మాత్రం అలా షాకిచ్చాడుగా

కొద్ది వారాల క్రితం బిగ్ బాస్ 'శక్తి చూపరా డింబకా' అనే టాస్క్ ఇచ్చాడు. అందులో గెలిచిన హమీదాకు ఓ పవర్ ఇచ్చాడు. దీని ప్రకారం.. ఆమె ఎంపిక చేసుకున్న వాళ్లు ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కోల్పోతారని చెబుతాడు. అప్పుడామె ప్రియను ఎంపిక చేసుకుంటుంది. దీంతో ఆమె కెప్టెన్ అయ్యే ఛాన్స్ కోల్పోవడంతో పాటు పలుమార్లు నామినేట్ అయింది.

రాజ్యానికి ఒక్కడే రాజు అనే టాస్కు

రాజ్యానికి ఒక్కడే రాజు అనే టాస్కు

బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల కోసం ఈ వారం 'రాజ్యానికి ఒక్కడే రాజు' పేరిట ఇద్దరు రాజుల మధ్య హోరాహోరి పోరు జరుగుతోంది. ఇందులో ఒక రాజ్యానికి రవి, మరో రాజ్యానికి సన్నీ యువరాజులుగా ఉంటారు. మిగిలిన కంటెస్టెంట్లు వాళ్లకు నచ్చిన యువరాజుకు సపోర్ట్ చేసుకోవచ్చు. ఇది పలు రకాలుగా హోరాహోరీగా సాగింది. ఇందులో రవి రాజుగా ఎంపికయ్యాడు.

ఆమె కోసం రూల్ మార్చేసిన బాస్

ఆమె కోసం రూల్ మార్చేసిన బాస్

'రాజ్యానికి ఒక్కడే రాజు' టాస్కులో విజయం సాధించిన రవి నేరుగా కెప్టెన్సీకి పోటీ పడతాడని బిగ్ బాస్ చెప్పాడు. అలాగే, ఆ టీమ్ నుంచి మరో ముగ్గురిని ఎంపిక చేయమని సూచించాడు. దీంతో శ్వేత, ఆనీ, హమీదా పేర్లను చెప్పాడు. అప్పుడు బిగ్ బాస్ ఎవరైనా తప్పుకుంటే ప్రియకు కెప్టెన్ అయ్యే అవకాశం పొందుతారు అని చెప్పి ఆమె కోసం రూల్‌ను మార్చేస్తాడు.

తన వల్లే అంటూ హమీదా చెబుతూ

తన వల్లే అంటూ హమీదా చెబుతూ

ఈ కెప్టెన్సీ టాస్కులో ప్రియ పాల్గొని గెలిస్తే భవిష్యత్‌లో మళ్లీ పోటీలో ఉండవచ్చని బిగ్ బాస్ చెబుతాడు. దీంతో ఆమె కోసం త్యాగం చేసేందుకు రవి ముందుకొస్తాడు. కానీ, హమీదా అప్పుడు తన వల్లే కెప్టెన్ అయ్యే ఛాన్స్ కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆమె తప్పుకుంటుంది. దీంతో ప్రియ ఈ వారం కెప్టెన్సీ టాస్కులో పోటీ చేస్తుంది. ఇందులో ఆమె గెలిచినట్లు కూడా తెలుస్తోంది.

Recommended Video

Make-Up Artist Sadhana Singh About Samantha & Preetham Jukalkar Relationship || Filmibeat Telugu
బిగ్ బాస్ నిర్ణయంపై విమర్శలు

బిగ్ బాస్ నిర్ణయంపై విమర్శలు

ప్రియకు కెప్టెన్ అయ్యే అవకాశం లేకుండా చేసిన బిగ్ బాస్.. ఇప్పుడు ఆమె కోసం మరోసారి రూల్‌ను మార్చడం చర్చనీయాంశం అవుతోంది. అదే సమయంలో సన్నీకి మరోసారి అన్యాయం జరిగిందని షో నిర్వహకులపై విమర్శలు చేస్తున్నారు పలువురు. చరిత్రలో తొలిసారి ఓ కంటెస్టెంట్‌కు మినహాయింపు ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X