బిగ్ బాస్ 5: బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొదలయ్యింది.. ఈసారి రాబోయే సింగర్ ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ మొదలైనప్పుడు అంచనాలు బాగానే ఉన్నప్పటికీ రేటింగ్స్ విషయంలో మాత్రం సరైన ఓపెనింగ్స్ అయితే అందుకోలేదు. మొత్తానికి ఏదోలా నాగార్జున తన హోస్టింగ్ తో 105రోజుల ప్రయాణాన్ని పరవాలేదు అనే విదంగా ముగించారు. బిగ్గెస్ట్ రియాలిటీ షోగా ఎంతగానో క్రేజ్ అందుకున్న బిగ్ బాస్ 4 మధ్యలో కొంత నిరాశపరిచినప్పటికి ఫైనల్ లో మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది. ఇక సీజన్ 4 విజేతగా అనుకున్నట్లుగానే అభిజిత్ గెలిచేశాడు. ఇప్పుడు సీజన్ 5కోసం నిర్వాహకులు కంటెస్టెంట్స్ ను రెడీ చేస్తున్నట్లు సమాచారం..

Recommended Video

Bigg Boss నుండి వచ్చాక కెరీర్ ఉండదు అంటారు.. కానీ Divi Vadthya విషయం లో ఇది తప్పు
దారుణమైన రేటింగ్స్

దారుణమైన రేటింగ్స్

బిగ్ బాస్ షో మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ విషయంలో పెద్దగా ఆకట్టుకోని బిగ్ బాస్ మధ్యలో కూడా కొంత వరకు బోర్ కొట్టిచిందనే చెప్పాలి. ఊహించని విధంగా కొన్నిసార్లు సీరియల్స్ కంటే దారుణమైన రేటింగ్స్ ను అందుకున్నాయి. ఒకసారైతే స్టార్ మా టాప్ ప్రోగ్రామ్ లిస్టులో 5వ స్థానానికి పడిపోయింది. ఇక ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టులతో షో మళ్ళీ గాడిలో పడింది.

గెలువును ముందే ఊహించిన జనాలు

గెలువును ముందే ఊహించిన జనాలు

మొత్తానికి బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరో ముందే ఊహించారు జనాలు. షో మొదలైన రెండు నెలలకే అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ అని దాదాపు అందరు పసిగట్టేశారు. మిగతా వాళ్ళు చేసిన పొరపాట్లే అతనికి బాగా కలిసొచ్చాయి. అభిజిత్ నిజానికి కొంతమంది మంది పడిన కష్టంలో కొంచెం కూడా పడలేదు. వీలైనంత వరకు పొరపాట్లు చేయకుండా తన గేమ్ తన స్టైల్ లో ఆడుతూ వచ్చాడు.

సీజన్ 5.. పనులు మొదలయ్యాయి

సీజన్ 5.. పనులు మొదలయ్యాయి

బిగ్ బాస్ సీజన్ 3, 4 లకు నాగార్జున తన హోస్టింగ్ తో ఎలాగైతే ఆకట్టుకున్నారో సీజన్ 5కు కూడా మళ్ళీ మన్మథుడే వస్తాడని తెలుస్తోంది. ఇక సీజన్ 4 కంటెస్టెంట్స్ విషయంలో కాస్త తక్కువ రేంజ్ ఉన్న సెలబ్రెటీలను తీసుకున్నప్పటికీ కంటెస్టెంట్స్ వారి టాలెంట్ తో మంచి క్రేజ్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం 5వ సీజన్ కోసం నిర్వాహకులు ప్లాన్స్ మొదలు పెట్టినట్లు సమాచారం.

కంటెస్టెంట్ గా మరో సింగర్

కంటెస్టెంట్ గా మరో సింగర్

ప్రస్తుతం సీజన్ 5 కోసం కొంతమంది సెలబ్రెటీలు సెలెక్ట్ అయినట్లు అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక ప్రముఖ సింగర్ హేమచంద్రను కూడా సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. గతంలో గీత మాధురి, రాహుల్ సిప్లిగంజ్ లాంటి సింగర్స్ బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్నారు. ఇక ఇప్పుడు హేమచంద్రను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X