Bigg Boss 5 Promo: హమీదాతో శ్రీరామ్ లహరి గొడవ.. నేనేం పని మనిషిని కాదంటూ సీరియస్ వార్నింగ్!

తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆదివారం నాడు కర్టెన్ రైజర్ ఈవెంట్ తో ప్రారంభమైన ఈ షో మొదటి మూడు ఎపిసోడ్లు ఆసక్తికరంగా సాగాయి. ఈ రోజు నాలుగో ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించిన కొన్ని ప్రోమోలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమో వివరాల్లోకి వెళితే

పవర్ రూమ్ కోసం

పవర్ రూమ్ కోసం

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కెప్టెన్సీ టాస్క్ కంటే ముందే ఈ సారి ఒక పవర్ హౌస్ అనే కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. ఒక రూమ్ బయట హ్యాండ్ స్కానర్ ఏర్పాటుచేసి బజర్ మోగిన సమయానికి ఎవరైతే హ్యాండ్ ఎక్కడ ఉంటారో వారికి పవర్ రూమ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ముందుగా ఈ పవర్ రూమ్ బాధ్యతలు విశ్వకి దక్కాయి, విశ్వకి ఈ బాధ్యతలు దక్కడంతో ఇద్దరు మనుషుల చేత వాళ్ళ బట్టలు సహా అన్ని స్టోర్ రూమ్ లో పెట్టించే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

పాపం కాజల్

పాపం కాజల్

అందులో భాగంగా రవి, ప్రియ ఇద్దరిని విశ్వ ఎన్నుకోగా ఇద్దరూ కూడా తమ తమ బట్టలు అన్నీ తీసేసి స్టోర్ రూమ్ లో పెట్టి కాస్త ఫన్ జనరేట్ చేశారు. ఇక తర్వాత ఈ పవర్ రూమ్ అవకాశం మానస్ నాగులపల్లికి దక్కింది. అతనికి దక్కిన పవర్ ప్రకారం కాజల్ ను ఎన్నుకున్నాడు, ఈ టాస్క్ ప్రకారం హౌస్ లో ఉన్న సభ్యులు అందరూ నిద్రపోయాక కాజల్ నిద్ర పోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమె ఇంటి సభ్యుల కంటే ముందు నిద్రపోతే గనుక సైరన్ మోగుతుంది. దీంతో మిగతా వారందరి నిద్ర కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి.

పవర్ రూమ్ బయట కాపలా

పవర్ రూమ్ బయట కాపలా

ఇక మధ్యలో ఎవరైనా నిద్రలేచినా సరే కాజల్ ను నిద్రలేపి వాళ్ళు మళ్ళీ వచ్చి పడుకున్నాక మాత్రమే ఆమె నిద్రపోవాల్సి ఉంటుంది. దీంతో ఆమె నిద్ర వ్యవహారంలో ఇబ్బందులు పడుతోంది. ఇక ఈ పవర్ రూమ్ కోసం మిగతా ఇంటి సభ్యులందరూ నిద్రాహారాలు సైతం మానేసి పవర్ రూమ్ బయట కాపలా కాస్తుంటారు. అలా కాపలా కాస్తూ ఉన్నా సరే ఈ సారి బాధ్యతలు సిరికి దక్కాయి. ఆమెకు వచ్చిన టాస్క్ ప్రకారం ఒక ఇద్దరు ఇంటి సభ్యులను ఆమె సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఎంపిక కాబడిన ఒక ఇంటి సభ్యుడు మరో ఇంటి సభ్యుడికి సేవలు చేయాల్సి ఉంటుంది.

మాటల యుద్ధం

మాటల యుద్ధం

అలా సేవలు చేసే అవకాశం లోబోకు ఇవ్వగా సేవలు చేయించుకునే అవకాశం మాత్రం షణ్ముఖ్ జస్వంత్ కి ఇచ్చింది. ఇక లోబో సేవలు చేస్తూనే కాసేపు కామెడీ పండించే ప్రయత్నం చేశాడు.
ఇక ఆ తర్వాత లహరి షారి అలాగే హమీద మధ్య మాటల యుద్ధం మొదలైంది. లహరి తనతో సరిగా మాట్లాడమని హమీదతో అంటే హమీద కూడా సీరియస్ గా నేను ఎలా మాట్లాడాలో నువ్వు నేర్పించాల్సిన అవసరం లేదని అంటుంది.

Recommended Video

Maha Samudram Movie Team On 'Cheppake Cheppake' Song
మళ్ళీ గొడవ

మళ్ళీ గొడవ

దీంతో మిగతా ఇంటి సభ్యులు అందరూ ఏదో గొడవ జరుగుతుందని గమనిస్తూ ఉంటారు. తర్వాత హమీద ఏడుస్తూ ఉండగా లహరి మాత్రం నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవాలంటే ఇంట్లో మాట్లాడుకోవాలి, అని కానీ ఇక్కడ మాట్లాడకూడదు అంటుంది. మొత్తం మీద ఈ రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగే లాగా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X