Bigg Boss: బిగ్ బాస్‌లో బయట పడిన లవ్ ట్రాక్.. నాగార్జున ముందే ఆమె అలా చేయడంతో సీక్రెట్ లీక్

బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని షో ఇది. అంతలా ఈ కార్యక్రమం దాదాపు ఐదేళ్లుగా మన దగ్గర హవాను చూపిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. ఏమాత్రం అంచనాలు లేకుండానే.. ఎన్నో అనుమానాల మధ్య మొదలైన దీనికి తెలుగు ప్రేక్షకులు భారీ స్థాయిలో ఆదరణను అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లు చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బిగ్ బాస్ ఐదో సీజన్ కూడా మొదలైంది. ఆరంభం నుంచే ఇది ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే కొన్ని లవ్ ట్రాకులు కూడా ప్రారంభ దశలో ఉన్నాయి. దీంతో ఎవరు ఎప్పుడు కలుస్తారా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్‌లో ఓ లవ్ ట్రాక్ బయట పడింది. ఆ వివరాలు మీకోసం!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

ఆ సీజన్లకు మించేలా ప్లాన్ చేశారుగా

ఆ సీజన్లకు మించేలా ప్లాన్ చేశారుగా

గతంలో ప్రసారం అయిన బిగ్ బాస్ నాలుగు సీజన్లు రికార్డులు క్రియేట్ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నారు. అందుకు అనుగుణంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 19 మంది కంటెస్టెంట్లను పంపించారు. అలాగే, ఆరంభం నుంచే సరికొత్త టాస్కులతో షో ఆసక్తికరంగా సాగుతోంది. దీనికితోడు గొడవలు, కొట్లాటలు వంటి వాటితో మరింత మజాను పంచుతూ వెళ్తోంది.

వాటి కోసమే వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్

వాటి కోసమే వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్

బిగ్ బాస్ ప్రియులు షోను ఇష్టపడడానికి అందులో కనిపించే లవ్ ట్రాకులు కూడా ప్రధాన కారణం అనే చెప్పాలి. అందుకే నిర్వహకులు ప్రతి సీజన్‌లోనూ కొందరిని జంటలుగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులకు ఇవి బాగా నచ్చుతున్నాయి. ఇప్పటికే ఇలా ఎంతో మంది బిగ్ బాస్ జోడీలు అనిపించుకున్నారు. తద్వారా భారీ స్థాయిలో పాపులర్ కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో ఐదో సీజన్‌లో ఎవరు జంటలుగా మారతారు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు అనుగుణంగానే కొందరిని హైలైట్ చేస్తున్నారు షో నిర్వహకులు.

ఫ్లాన్ ప్రకారమే ఫోకస్ చేస్తున్న టీమ్

ఫ్లాన్ ప్రకారమే ఫోకస్ చేస్తున్న టీమ్

బిగ్ బాస్‌లో కనిపించే లవ్ ట్రాకులకు ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుంది. చుట్టూ వందల కెమెరాలు ఉన్నా.. చాలా మంది రొమాంటిక్‌గా కనిపిస్తూ తమ తమ ప్రేమలను వ్యక్త పరచుకుంటూ ఉండడం ప్రేక్షకులకు కావాల్సినంత మజాను పంచుతోంది. ఇక, ఐదో సీజన్‌లో ఇప్పటికే పలువురిని జంటలుగా చూపిస్తున్నారు. అలాగే, రొమాంటిక్‌గా ఉండే టాస్కులు సైతం ఇస్తున్నారు. తద్వారా ప్రస్తుతానికి హౌస్‌లో రెండు మూడు జంటలు ఉన్నట్లు హైలైట్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే వాళ్లు తరచూ హగ్గులిస్తూ, కొంటెగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు.

గత సీజన్‌లో ప్లాన్... వర్కౌట్ కాలేదు

గత సీజన్‌లో ప్లాన్... వర్కౌట్ కాలేదు

గత సీజన్‌లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లను జంటలుగా మార్చడానికి బిగ్ బాస్ నిర్వహకులు ఆరంభంలోనే ప్లాన్ చేశారు. దీంతో అభిజీత్ హారికలా పలువురు ముందు నుంచే కనెక్షన్ కుదుర్చుకున్నారు. ఇలాగే ఇప్పుడు ఐదో సీజన్ కంటెస్టెంట్ హమీదా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలోనే అక్కినేని నాగార్జున మేల్ కంటెస్టెంట్లకు సంబంధించిన కొన్ని కళ్లను చూపించి ఏది కావాలని అడిగాడు. దీనికి ఒక పిక్చర్‌ను ఆమె సెలెక్ట్ చేసుకుంది. అవి ప్రముఖ మోడల్ జస్వంత్‌వి. లోపల వీళ్లిద్దరూ కలుస్తారని అంతా అనుకున్నారు. కానీ, ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదు.

వాళ్లిద్దరి మధ్య సెట్టు.. రచ్చ చేస్తూనే

వాళ్లిద్దరి మధ్య సెట్టు.. రచ్చ చేస్తూనే

ఐదో సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మేల్ కంటెస్టెంట్లలో సింగర్ శ్రీరామ చంద్ర ఒకడు. హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకుంటోన్న ఈ కుర్రాడు.. బోల్డ్ బ్యూటీ హమీదాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అలాగే, తరచూ రొమాంటిక్‌గా చూస్తూ మాట్లాడుతున్నాడు. అతడికి అనుగుణంగానే హమీదా కూడా ప్రతిస్పందిస్తోంది. ఇక, ఇటీవలే వీళ్లిద్దరూ కలిసి మసాజ్‌లు చేసుకున్నారు. అలాగే, ఇటీవలే ఈ జంట రొమాంటిక్ డ్యాన్స్‌తో అలరించింది. దీంతో వీళ్ల ట్రాక్‌పై అనుమానాలు కలుగుతున్నాయి.

 బిగ్ బాస్‌లో బయట పడిన లవ్ ట్రాక్

బిగ్ బాస్‌లో బయట పడిన లవ్ ట్రాక్

ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో హౌస్‌లోని కంటెస్టెంట్లను ఆడవాళ్లు, మగవాళ్లు టీమ్‌లుగా కూర్చోబెట్టి డెస్టెనీ అనే గేమ్ ఆడించాడు నాగార్జున. దీని ప్రకారం.. కప్పులు ఉంటాయి.. వాటిలో అమ్మాయిలు వచ్చి బాల్ వేయాలి.. దాని కింద ఎవరి పేరు ఉంటుందో వాళ్లతో కలిసి డ్యాన్స్ చేయాలి. ఇలా ఇద్దరూ రెండు పోడియంలపై డ్యాన్స్ చేస్తే నాగార్జున వాళ్లకు మార్కులు ఇస్తారు. దీంతో ఈ ఎపిసోడ్ అంతా సందడి సందడిగా సాగింది. ఇక, ఇందులో హమీదా.. శ్రీరామ చంద్ర జంటగా వచ్చారు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఉన్న లవ్ ట్రాక్ కూడా బయట పడిపోయింది.

Recommended Video

Bigg Boss Telugu 5: Sriram Chandra - Hamida హాట్‌ హాగ్స్‌.. రొమాంటిక్ డ్యాన్సు || Oneindia Telugu
 నాగార్జున ముందే అలా చేయడంతో

నాగార్జున ముందే అలా చేయడంతో

హమీదా, శ్రీరామ్ లవ్‌లో ఉన్నారని కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఓ సంఘటన చోటు చేసుకుంది. కప్పులో బాల్ వేయాడానికి వచ్చిన హమీదా.. దాని కింద శ్రీరామ చంద్ర పేరు కనిపించగానే గట్టిగా కేకలు వేస్తూ తెగ సంతోష పడిపోయింది. అందుకు అనుగుణంగానే అతడు కూడా తన పేరు రాగానే ఎంతో ఉత్సాహంతో కనిపించాడు. దీంతో హౌస్‌మేట్స్ ఒక్కసారిగా షాక్ అవగా... ప్రేక్షకులకు వీళ్ల బంధంపై క్లారిటీ వచ్చింది. నాగార్జున ముందే వీళ్లు ఇలా చేసి తమ ట్రాక్‌ను బయట పెట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X