Bigg Boss: నాగార్జున ముందు హమీదా వింత కోరిక.. అది వేస్తే నువ్వు కనిపించవు అంటూనే ఒప్పుకున్నాడుగా!

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా ఇండియాలోకి పరిచయం అయిన కార్యక్రమం బిగ్ బాస్. పాశ్చాత్య సంస్కృతికి అద్దం పట్టేలా ఉండే ఈ షోకు అన్ని భాషల్లోనూ అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే, తెలుగులోకి కూడా ఇది నాలుగేళ్ల క్రితమే వచ్చింది. ఇక్కడైతే ఎవరూ ఊహించని రీతిలో స్పందనను అందుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఐదో సీజన్ కూడా గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ఇది కూడా గత సీజన్ల మాదిరిగానే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో మంచి రేటింగ్‌ను రాబడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఎపిసోడ్‌లో హమీదా.. అక్కినేని నాగార్జున ముందు వింత కోరికను ఉంచింది. ఆ వివరాలు మీకోసం!

వాటికి మించేలా చూపించాలని ప్లాన్

వాటికి మించేలా చూపించాలని ప్లాన్

భారీ అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. పాత సీజన్లను మరిపించేలా దీనిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ సారి 19 మంది కంటెస్టెంట్లను పంపారు. అలాగే, ఆరంభం నుంచే సరికొత్త టాస్కుల పరిచయం చేస్తున్నారు దీనికితోడు గొడవలు, కొట్లాటలు వంటి వాటితో ఈ సీజన్ మరింత మజాను అందిస్తోంది.

ఆరంభంలోనే హమీదా ఫుల్ పాపులర్

ఆరంభంలోనే హమీదా ఫుల్ పాపులర్

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఫేమస్ అయిన 19 మంది కంటెస్టెంట్లను తీసుకొచ్చారు. అందులో కొందరు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందులో ప్రముఖ నటి హమీదా ఖటూన్ ఒకరు. పలు సినిమాల్లో కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేదు. దీంతో ఎంట్రీ ఇచ్చిన సమయంలో గూగుల్‌లో ఈ పేరు బాగా ట్రెండ్ అవడంతో పాపులర్ అయింది.

అలాంటి పనులతో ఫేమస్ అయింది

అలాంటి పనులతో ఫేమస్ అయింది

బిగ్ బాస్ సీజన్‌లో చాలా మంది కంటెస్టెంట్లు ఉన్నా హమీదా మీదే అందరి దృష్టి పడిపోయింది. అందుకు అనుగుణంగానే ఆమె వ్యవహరిస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా చిత్ర విచిత్రమైన డ్రెస్‌లు వేసుకోవడం.. స్మోకింగ్ చేయడం.. అబ్బాయిలతో చనువుగా ఉండడం వంటి వాటితో బాగా హైలైట్ అయింది. అదే సమయంలో చాలా మందికి ఈ బ్యూటీ క్రష్‌గానూ మారిపోయింది.

అతడితో లవ్ ట్రాక్ నడిపిస్తోన్న భామ

అతడితో లవ్ ట్రాక్ నడిపిస్తోన్న భామ


ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత హమీదా ఖటూన్.. ఎక్కువగా శ్రీరామ చంద్రతో క్లోజ్‌గా ఉంటోంది. అతడు కూడా ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అలాగే, తరచూ రొమాంటిక్‌గా చూస్తూ మాట్లాడుతున్నాడు. అతడికి అనుగుణంగానే హమీదా కూడా ప్రతిస్పందిస్తోంది. ఇక, ఈ మధ్య మసాజ్‌లు, రొమాంటిక్ డ్యాన్సులు కూడా చేసి హైలైట్ అయిపోతోంది.

మిడ్‌నైట్ రొమాన్స్‌తో హాట్ టాపిక్‌గా

మిడ్‌నైట్ రొమాన్స్‌తో హాట్ టాపిక్‌గా

శ్రీరామ చంద్రతో హమీదా ఖటూన్ ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలు రోజురోజుకూ బలపడుతున్నాయి. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ తెగ రొమాన్స్ చేస్తున్నారు. గత వారంలోనైతే ఏకంగా మిడ్‌నైట్ టైమ్‌లో రెచ్చిపోయి రచ్చ చేశారు. ప్లైయింగ్ కిస్‌లు, హగ్గులు ఇచ్చుకుంటూ అనుమానాలు పెంచేశారు. దీంతో వీళ్లిద్దరూ బిగ్ బాస్ కపుల్ అని అంతా అనుకుంటున్నారు.

నాగార్జునను అలా కోరుకున్న హమీదా

నాగార్జునను అలా కోరుకున్న హమీదా

తాజాగా జరిగిన ఎపిసోడ్ ఆద్యంతం ఫన్నీగా సాగింది. సండే ఫన్‌డేగా మార్చేసే హోస్ట్ నాగార్జున హౌస్‌మేట్స్ అందరితో పలు రకాల ఆటలు ఆడించి మెప్పించాడు. ఇక, ఇందులో ఓ టీమ్‌కు హమీదా కెప్టెన్‌గానూ వ్యవహరించింది. అలా ఆదివారం ఎపిసోడ్‌లో హైలైట్ అయింది. ఇక, చివర్లో ఆమె అక్కినేని నాగార్జునను ఓ గిఫ్ట్ కావాలని వింత కోరిక కోరి ఏకంగా ఆయనకే షాకిచ్చింది.

Recommended Video

Naga Chaitanya Samantha Divorce, ఆమెపై దుష్ప్రచారం వద్దు | #ChaySam || Filmibeat Telugu
కనిపించవు అంటూనే ఒప్పుకున్నాడు

కనిపించవు అంటూనే ఒప్పుకున్నాడు

ఎలిమినేషన్ తర్వాత వెళ్లిపోతోన్న సమయంలో హమీదా.. నాగార్జునను పిలిచి 'సార్.. నిన్న మీరు వేసుకున్న షర్ట్ చాలా బాగుంది. దాన్ని నాకోసం గిఫ్టుగా పంపించండి' అంటూ కోరింది. దీనికి నాగ్ కాసేపు నవ్వుకుని 'ఏంటమ్మా.. అది వేస్తే అసలు నువ్వు కనిపిస్తావా? సరేలే నువ్వు అడిగావు కాబట్టి పంపిస్తాను' అంటూ ఒప్పుకున్నాడు. మరి అది ఎప్పుడు వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X