Bigg Boss: షొలో అర్ధరాత్రి వాళ్లిద్దరి రొమాన్స్.. పెదాలను తాకుతూ కొంటెగా.. అక్కడ కూడా కిస్ చేయమంటూ!

బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఇది దాదాపు ఐదేళ్లుగా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందనను అందుకుని సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగిపోతోంది. తద్వారా టెలివిజన్ హిస్టరీలో ఉన్న ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. ఈ షో ఇంతలా విజయవంతం అవడానికి అందులో చూపించే కంటెంటే ప్రధాన కారణం అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా హౌస్‌లో జరిగే రొమాంటిక్ కథలకు ప్రేక్షకుల ఫిదా అవుతున్నారు. దీంతో నిర్వహకులు కూడా అలాంటివే ఎక్కువగా చూపిస్తున్నారు. ఐదో సీజన్‌లోనూ ఇప్పుడిప్పుడే లవ్ ట్రాకులు బలపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజా ఎపిసోడ్‌లో ఇద్దరు కంటెస్టెంట్లు అర్ధరాత్రి రొమాన్స్ చేశారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

ఐదింతలు ఎక్కువ.. దానికి తగ్గట్లుగానే

ఐదింతలు ఎక్కువ.. దానికి తగ్గట్లుగానే

బిగ్ బాస్ నాలుగు సీజన్లు రికార్డులు క్రియేట్ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్‌ను నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నారు. అందుకు అనుగుణంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 19 మంది కంటెస్టెంట్లను పంపించారు. అలాగే, ఆరంభం నుంచే సరికొత్త టాస్కులు, గొడవలు, కొట్లాటలు వంటి వాటితో మరింత మజాను పంచుతూ వెళ్తోంది. ఈ కారణంగానే ప్రారంభ ఎపిసోడ్‌కు ఏకంగా 18 రేటింగ్ వచ్చి రికార్డు నమోదైంది.

లవ్ ట్రాకుల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

లవ్ ట్రాకుల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

ప్రేక్షకులు మిగిలిన షోలను కాదని బిగ్ బాస్‌ను ఇష్టపడడానికి అందులో కనిపించే లవ్ ట్రాకులు కూడా ప్రధాన కారణం అనే చెప్పాలి. అందుకే నిర్వహకులు ప్రతి సీజన్‌లోనూ కొందరిని జంటలుగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులకు ఇవి బాగా నచ్చుతున్నాయి. ఇప్పటికే ఇలా ఎంతో మంది బిగ్ బాస్ జోడీలు అనిపించుకున్నారు. తద్వారా భారీ స్థాయిలో పాపులర్ కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో ఐదో సీజన్‌లో ఎవరు జంటలుగా మారతారు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు అనుగుణంగానే కొందరిని హైలైట్ చేస్తున్నారు.

అంతా అనుకున్నట్లుగానే చేస్తున్నారు

అంతా అనుకున్నట్లుగానే చేస్తున్నారు

బిగ్ బాస్‌లో చుట్టూ వందల కెమెరాలు ఉన్నా.. చాలా మంది రొమాంటిక్‌గా కనిపిస్తూ తమ తమ ప్రేమలను వ్యక్త పరచుకుంటూ ఉండడం ప్రేక్షకులకు కావాల్సినంత మజాను పంచుతోంది. ఇక, ఐదో సీజన్‌లో ఇప్పటికే పలువురిని జంటలుగా చూపిస్తున్నారు. అలాగే, రొమాంటిక్‌గా ఉండే టాస్కులు సైతం ఇస్తున్నారు. తద్వారా ప్రస్తుతానికి హౌస్‌లో రెండు మూడు జంటలు ఉన్నట్లు హైలైట్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే వాళ్లు తరచూ హగ్గులిస్తూ, కొంటెగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. దీంతో ఈ ఐదో సీజన్ మరింత ఆసక్తికరంగా సాగుతూ వస్తోంది.

ఆ జంట బాగా హైలైట్.. రొమాన్స్ చేస్తూ

ఆ జంట బాగా హైలైట్.. రొమాన్స్ చేస్తూ

తాజా సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మేల్ కంటెస్టెంట్లలో సింగర్ శ్రీరామ చంద్ర ఒకడు. హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకుంటోన్న ఈ కుర్రాడు.. బోల్డ్ బ్యూటీ హమీదాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అలాగే, తరచూ రొమాంటిక్‌గా చూస్తూ మాట్లాడుతున్నాడు. అతడికి అనుగుణంగానే హమీదా కూడా ప్రతిస్పందిస్తోంది. ఇక, ఇటీవలే వీళ్లిద్దరూ కలిసి మసాజ్‌లు చేసుకున్నారు. అలాగే, ఇటీవలే ఈ జంట రొమాంటిక్ డ్యాన్స్‌తో అలరించింది. దీంతో వీళ్లిద్దరూ ట్రాక్‌ బలమైందని అర్థమైంది.

ఒక దగ్గర ముద్దు పెడితే మరొకటి కూడా

ఒక దగ్గర ముద్దు పెడితే మరొకటి కూడా

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో హమీదా తన లవ్ ట్రాకును దాదాపుగా కన్ఫార్మ్ చేసేసింది. ఎదుటి వాళ్ల పర్సనల్ విషయాలను గుచ్చి గుచ్చి అడుగుతూ చిరాకు తెప్పించే కాజల్‌తో ఆమె మనసు విప్పి మాట్లాడింది. 'శ్రీరామ్ నైట్ టైమ్‌లో తన కప్ కడుగుతున్నాడు. ఆ సమయంలోనే నేను నా కప్‌ను అక్కడ పెట్టి వెళ్లాను. మళ్లీ వచ్చేసరికి నా కప్‌ కూడా కడుగుతున్నాడు. ఎందుకిలా చేశావ్ అంటే పర్లేదు అన్నాడు. అప్పుడు నేను హగ్ చేసుకుని భుజంపై ముద్దు పెట్టాను. దీంతో అతడు వెంటనే మరో భుజం చూపించి అక్కడ కూడా కిస్ చేయమన్నాడు' అని చెప్పి సిగ్గు పడింది.

మిడ్‌నైట్ రొమాంటిక్‌గా.. మన రిలేషన్

మిడ్‌నైట్ రొమాంటిక్‌గా.. మన రిలేషన్

బిగ్ బాస్ హౌస్‌లో అందరూ పడుకున్న తర్వాత అంటే సుమారు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో శ్రీరామ చంద్ర, హమీదా మధ్య పర్సనల్ విషయాలపై చర్చ జరిగింది. అప్పుడు తమ బంధం గురించి ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీరామ్ 'నీకు మానస్‌కు ఫ్రెండ్‌షిప్ అనే రిలేషన్ ఉంది.. కానీ మనిద్దరి మధ్య ఎలాంటిది ఉందో అర్థం కావట్లేదు. మనం బ్రదర్ అండ్ సిస్టరా.. ఫ్రెండ్సా.. అంతకు మించా ఏమీ అర్థం కావట్లేదు' అన్నాడు. అప్పుడు హమీదా 'కొన్ని సార్లు అర్థం అవుతావు.. కొన్ని సార్లు కావు' అంటూ బదులిచ్చింది.

Recommended Video

Mahesh Babu Is The Brand Ambassador For Big C
 పెదాలను తాకుతూ కొంటెగా చేసింది

పెదాలను తాకుతూ కొంటెగా చేసింది

శ్రీరామ్ బిగ్ బాస్ పంపిన ఎదో స్వీట్‌ను ఆస్వాదిస్తూ ఆరగిస్తున్నాడు. ఆ సమయంలో హమీద తన మనసులోని ప్రేమను చెప్పేందుకు ప్రయత్నించినట్టు అనిపించింది. 'నేను సన్నీతో, మానస్‌తో, నీతో మాట్లాడే తీరులో తేడా కనిపించడం లేదా? అంతా ఒకటే అని నీకు అనిపిస్తుందా?' అంటూ ప్రశ్నించింది. దీనికి శ్రీరామ్ 'నాకు తెలియదు.. అంతలా గమనించను' అంటూ బదులిచ్చాడు. సరిగ్గా ఆ సమయంలోనే అతడికి పెదాలపై ఆ స్వీట్ ఆగిపోయింది. దీంతో హమీదా కొంచెం అడ్వాన్స్ అయి దాన్ని తన చేతులతో తీసింది. ఇది మొత్తం రొమాంటిక్‌గా సాగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X