For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: పింకీకి దెబ్బ మీద దెబ్బ.. అంత మాట అనేసిన మానస్.. ఎంగేజ్‌మెంట్ వ్యవహారం బయటకు రావడంతో!

  |

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులోకి ఆలస్యంగా వచ్చినా.. అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. తద్వారా ఎన్నో రికార్డులను సైతం నమోదు చేస్తూ దూసుకుపోతోంది. ఇలా భారీ స్పందనతో నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఐదో దాన్ని కూడా విజయవంతంగా సాగిస్తోంది. ఇందులో చిత్ర విచిత్రమైన టాస్కులు మాత్రమే కాదు.. ఎన్నో రకాల ఎమోషన్స్ హైలైట్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ షోలోకి స్పెషల్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్.. మానస్‌తో చనువుగా ఉంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు అతడు భారీ షాకిచ్చాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  అంచనాలకు అనుగుణంగా సాగుతూ

  అంచనాలకు అనుగుణంగా సాగుతూ

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్‌కు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. అందుకే ఐదో సీజన్‌పై అంచనాలు అదే రేంజ్‌లో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే షో నిర్వహకులు ఈ సీజన్‌లో అన్నీ సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఫలితంగా ఇది ఆరంభం నుంచే ఆసక్తికంగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది.

  బైసెక్సువల్‌గా మారబోతున్న సమంత: విడాకులు తర్వాత సంచలన ప్రకటన.. తెలుగులో ఎవరూ చేయని విధంగా!

  అందం.. ఆటతో ఆకట్టుకుంటోందిగా

  అందం.. ఆటతో ఆకట్టుకుంటోందిగా


  ఐదో సీజన్‌లో ప్రియాంక సింగ్ ట్రాన్స్‌జెండర్‌గా ప్రవేశించిన విషయం తెలిసిందే. గతంలో తమన్నా కూడా ఇలాగే ప్రవేశించినా.. తన వివాదాస్పద తీరుతో విమర్శల పాలైంది. అయితే, పింకీ మాత్రం ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. చక్కని కట్టుబొట్టుతో ఆడవాళ్లే ఈర్శ పడేంత అందంగా తయారవుతూ సందడి చేస్తోంది.

  అతడిపై ప్రేమను చూపిస్తూ సందడి

  అతడిపై ప్రేమను చూపిస్తూ సందడి


  బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే ప్రియాంక సింగ్‌ ఫోకస్ అవుతోంది. మరీ ముఖ్యంగా ఆమె మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. ఎప్పుడూ అతడితోనే ఉండడం.. అతడికి సేవలు చేయడం.. అతడితో కలిసి ఆడడం వంటివి చేస్తోంది. దీంతో ఆమె అతడితో లవ్ ట్రాక్ నడుపుతుందంటున్నారు. ఈ వ్యవహారంతో పింకీపై విమర్శలు వస్తున్నాయి.

  Bigg Boss Elimination: లీకైన 12వ వారం అఫీషియల్ ఓటింగ్.. మారిన టాప్ పొజిషన్.. ఆ ఇద్దరిలో ఒకరు బయటకు!

  బిగ్ బాస్ హౌస్‌లోకి మానస్ తల్లి రాక

  బిగ్ బాస్ హౌస్‌లోకి మానస్ తల్లి రాక

  గురువారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి మానస్ తల్లి ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడమే కొడుకును హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత షణ్నూతో 'అరే ఏంట్రా ఇది' అనే డైలాగ్ కొట్టారు. అనంతరం కాజల్‌ టీ పెట్టిస్తానని అంటే నీకు వంట రాదుగా అంటూ పంచ్ వేశారు. శ్రీరామ్‌ను ఆంటీ అని పిలవొద్దని షాకిచ్చారు. ఇలా మొత్తానికి ఆమె షోలో హైలైట్ అయిపోయారు.

  జాగ్రత్తలు చెప్పి.. దాన్ని హైలైట్ చేసి

  జాగ్రత్తలు చెప్పి.. దాన్ని హైలైట్ చేసి


  బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నంత సేపు రచ్చ రచ్చ చేశారు మానస్ మదర్. అయితే, ఆ తర్వాత తన కొడుకుతో మనసు విప్పి మాట్లాడారు. 'నీ దృష్టంతా టాప్‌ 5లో చేరడంపైనే ఉండాలి. నిన్ను విన్నర్‌గా చూడాలనుకుంటున్నా. పక్కవాళ్లు డిస్టర్బ్‌ చేస్తున్నా డిస్టర్బ్‌ కాకుండా ఆడితే తప్పకుండా ఫినాలేకు చేరుకుంటావు' అంటూ ప్రియాంక గురించి పరోక్షంగా హెచ్చరించారామె.

  మళ్లీ రెచ్చిపోయిన అషు రెడ్డి: ఎద అందాలు మొత్తం కనిపించేలా.. వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకుంటారా!

  ఎంగేజ్‌మెంట్ చేస్తావా అని అతడిపై

  ఎంగేజ్‌మెంట్ చేస్తావా అని అతడిపై


  బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మానస్ తల్లి అందరిలో ఉత్సాహాన్ని మరింతగా పెంచేశారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్‌తో చక్కగా మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రియాంక హౌస్‌లోనే అందగత్తె అని చెప్పుకొచ్చారు. శ్రీరామ్ హ్యాండ్సమ్ అని అన్నారు. ఇక, మాటలో మాటగా యాంకర్ రవితో 'ప్రియాంక, మానస్‌కు ఎంగేజ్‌మెంట్ చేస్తావా' అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారు.

  Bigg Boss Telugu 5 : Siri తల్లి ఇచ్చిన వార్నింగ్ కి కంటతడి పెట్టుకున్న Shanmukh || Filmibeat Telugu
  ప్రియాంకకు మానస్ క్లాస్.. బాధగానే

  ప్రియాంకకు మానస్ క్లాస్.. బాధగానే

  మానస్ తల్లి వెళ్లిన తర్వాత పింకీ.. అతడితో మాట్లాడింది. అప్పుడు తనను ఎందుకు దూరం పెడుతున్నావని ప్రశ్నించింది. దీనికి మానస్ 'నీకు చెప్పినా అర్థం కాదు. నువ్వు ఎక్కువ ప్రేమ చూపిస్తావు. అంతే కావాలని కోరుకుంటావు. దాని వల్ల ప్రాబ్లమ్ అవుతుంది' అంటూ ఆశలు పెంచుకోవద్దని పరోక్షంగా ఆమెకు చెప్పాడు. దీంతో పింకీ బాధతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.

  English summary
  Bigg Boss Recently Started 5th Season. In Recent Episode.. Maanas Away from Priyanka Singh after His Mother Entry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X