For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: ప్రియాంక, సన్నీపై మానస్ సంచలన వ్యాఖ్యలు.. అందుకే క్లోజ్ అయ్యారు.. అలా మోసం చేస్తుందంటూ!

  |

  ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఐదేళ్లుగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. దీనికి ఇక్కడి ప్రేక్షకులు భారీ అంటే భారీ స్థాయిలో స్పందనను అందించారు. దీంతో ఇది ఆరంభంలోనే మంచి టీఆర్పీని అందుకుని రికార్డులు క్రియేట్ చేసింది. అదే ఉత్సాహంతో నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు నడుస్తోన్న ఐదో సీజన్ కూడా అంతే రెస్పాన్స్‌తో సాగుతోంది. ఇక, ఇందులోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి హైలైట్ అవుతోంది ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్. మంచి ఆటను ఆడుతున్నా.. ఓ కంటెస్టెంట్‌తో వ్యవహరిస్తోన్న తీరుతో విమర్శలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఆమెపై మానస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివరాల్లోకి వెళ్తే....

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar

   కొంచెం సక్సెస్.. కొంచెం ఫెయిల్

  కొంచెం సక్సెస్.. కొంచెం ఫెయిల్

  దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగు బుల్లితెరపై వచ్చే బిగ్ బాస్‌కు మాత్రమే భారీ రేటింగ్ వస్తుంది. దీంతో ఐదో సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే ఐదింతల ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు నిర్వహకులు ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 19 మంది కంటెస్టెంట్లను దింపడంతో పాటు ఆరంభంలోనే గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా మజాను పంచారు. వీటికి మంచి స్పందన వస్తుండడంతో ఈ ఉత్సాహంతోనే షోను మరింత రంజుగా మార్చేలా టాస్కులు రూపొందిస్తున్నారు.

  బైసెక్సువల్‌గా మారబోతున్న సమంత: విడాకులు తర్వాత సంచలన ప్రకటన.. తెలుగులో ఎవరూ చేయని విధంగా!

   అప్పుడే మంచి పేరు తెచ్చుకుని

  అప్పుడే మంచి పేరు తెచ్చుకుని

  ఈ సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా.. అందులో ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ మాత్రమే బాగా హైలైట్ అయింది. దీనికి కారణం ఆమె ఎంతో అందంగా కనిపించడంతో పాటు ముక్కుసూటిగా మాట్లాడుతుండడమే. అంతేకాదు, పింకీ మాత్రం హౌస్‌లోకి ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. చక్కని కట్టుబొట్టుతో హుందాగా వ్యవహరించేది. దీంతో ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి ఆమెకు భారీ స్థాయిలో సపోర్టు కూడా లభిస్తోంది. ఈ కారణంగానే ఆమె ఇప్పటికే పలుమార్లు ఎలిమినేషన్‌ తప్పించుకుంది.

  అతడితో చనువుగా ఉండడంతో

  అతడితో చనువుగా ఉండడంతో

  బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే ప్రియాంక పలు రకాలుగా ఫోకస్ అవుతోంది. ఆమె రూపం, ఆట తీరుకు చాలా మంది ఫిదా అవుతున్నారు. కానీ, ఈమె ఆరంభం నుంచే మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. ఎప్పుడూ అతడి పక్కనే ఉంటూ.. అతడికి సేవలు చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది. దీంతో వీళ్ల వింత ట్రాక్ నడుస్తుందన్న ప్రచారం మొదలైంది. దీన్ని బిగ్ బాస్ నిర్వహకులు మరింత ఫోకస్ చేస్తూ చూపిస్తున్నారు. ఫలితంగా వీళ్లిద్దరి ట్రాకును ప్రేక్షకులు ఇష్టపడడం లేదు. దీంతో ప్రియాంక సింగ్‌పై భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  Bigg Boss Elimination: లీకైన 12వ వారం అఫీషియల్ ఓటింగ్.. మారిన టాప్ పొజిషన్.. ఆ ఇద్దరిలో ఒకరు బయటకు!

  మానస్ తల్లి మాటలతో దూరంగా

  మానస్ తల్లి మాటలతో దూరంగా

  గురువారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి మానస్ తల్లి ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడమే కొడుకును హగ్ చేసుకున్నారు. తర్వాత అందరు కంటెస్టెంట్లతో మాట్లాడుతూ ఉన్నంత సేపు రచ్చ రచ్చ చేశారు. అయితే, ఆ తర్వాత తన కొడుకుతో మనసు విప్పి మాట్లాడారు. 'నీ దృష్టంతా టాప్‌ 5లో చేరడంపైనే ఉండాలి. నిన్ను విన్నర్‌గా చూడాలనుకుంటున్నా. పక్కవాళ్లు డిస్టర్బ్‌ చేస్తున్నా డిస్టర్బ్‌ కాకుండా ఆడితే తప్పకుండా ఫినాలేకు చేరుకుంటావు' అంటూ ప్రియాంక గురించి పరోక్షంగా హెచ్చరించారామె. దీంతో మానస్.. పింకీని దూరం పెట్టడానికి ట్రై చేస్తున్నాడు.

  ప్రియాంక చెల్లి రాక... సారీ చెప్పి

  ప్రియాంక చెల్లి రాక... సారీ చెప్పి

  శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో ప్రియాంక సింగ్ కోసం ఆమె సోదరి మధు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రావడం రావడమే వీళ్లిద్దరూ హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో పింకీ నాన్న ఎందుకు రాలేదని ప్రశ్నించగా.. హెల్త్ బాలేక రాలేదని చెప్పిందామె. అనంతరం మధు 'నాన్న తల దించుకునే పని చేయనన్నావు. ఆ మాట నిలెబట్టుకోమని ఆయన మరీమరీ చెప్పాడు. గేమ్‌ మీద మాత్రమే ఫోకస్‌ పెట్టు. ఇంకేదీ పట్టించుకోకు' అని మానస్ ట్రాక్‌పై పరోక్షంగా హెచ్చరించింది. ఆ తర్వాత మానస్‌కు మధు పదే పదే సారీ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

  మళ్లీ రెచ్చిపోయిన అషు రెడ్డి: ఎద అందాలు మొత్తం కనిపించేలా.. వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకుంటారా!

  ప్రియాంకపై మానస్ కామెంట్స్

  ప్రియాంకపై మానస్ కామెంట్స్

  మొన్నటి ఎపిసోడ్‌లో ప్రియాంకను పిలిచి 'నీకు చెప్పినా అర్థం కాదు. నువ్వు ఎక్కువ ప్రేమ చూపిస్తావు. అంతే కావాలని కోరుకుంటావు. దాని వల్ల ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే నీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా' అంటూ తన బాధను వ్యక్త పరిచే ప్రయత్నాలు చేశాడు మానస్. అయితే, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో మాత్రం పింకీ మీద ఉన్న కోపం మొత్తాన్ని బయట పెట్టేశాడు. కాజల్‌తో మాట్లాడుతోన్న సమయంలో 'పింకీ చాలా అబద్ధాలు చెబుతుంది. అది నాకు అస్సలు నచ్చడం లేదు. ఆ విషయం తనకు చెప్పలేను కదా' అంటూ కామెంట్స్ చేసేశాడు.

  Bigg Boss Telugu 5 : Siri తల్లి ఇచ్చిన వార్నింగ్ కి కంటతడి పెట్టుకున్న Shanmukh || Filmibeat Telugu
   సన్నీ, పింకీ రిలేషన్‌పై ఘాటుగా

  సన్నీ, పింకీ రిలేషన్‌పై ఘాటుగా

  కొన్ని రోజులుగా సన్నీ, ప్రియాంక సింగ్ క్లోజ్‌గా ఉంటున్నారు. ఈ విషయంపై మానస్.. కాజల్ దగ్గర ఓపెన్ అయ్యాడు. 'ఈ మధ్య పింకీ.. సన్నీని వదలడం లేదు చూస్తున్నావా? అలా ఎందుకు చేస్తుందో నాకు ఓ ఐడియా వచ్చింది. సన్నీ దగ్గర ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఉండటం వల్లే పింకీ అతడికి క్లోజ్‌ అవుతుందేమో అని డౌట్ వస్తుంది. అంతేకాదు, పింకీ తనను వదిలి వెళ్లిపోయిన బాయ్‌ఫ్రెండ్‌ ప్లేస్‌లో నన్ను రీప్లేస్‌ చేద్దామని చూస్తోంది. అయితే అది కుదరదని, నేను అలాంటివాడిని కాదని చెప్పాను. మనం ఫ్రెండ్స్‌ మాత్రమే అని చెప్పాను' అని చెప్పుకొచ్చాడు.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. In Recent Episode.. Maanas Did Sensational Comments on Priyanka Singh and Sunny Relation.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X