Bigg Boss: ప్రియాంక సింగ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన మానస్.. నీచమైన కామెంట్స్.. ముఖం ముందే అలా అనడంతో!

బిగ్ బాస్.. రియాలిటీ ఆధారంగా నడుస్తూ కంటెస్టెంట్లలోని అన్ని ఎమోషన్స్‌ను బయటకు తీసే ఏకైక షో. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు, కొట్లాటలు, ప్రేమ కహానీలు, రొమాంటిక్ సన్నివేశాలు ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరిస్తోందీ షో. మిగిలిన భాషల్లో ఎప్పుడో మొదలైనా.. తెలుగులో మాత్రం ఐదేళ్ల క్రితమే వచ్చింది. లేటుగా పరిచయం అయినా భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించగలిగింది. దీంతో తెలుగు బిగ్ బాస్‌ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఐదో సీజన్ కూడా అదే రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఇక, ఇందులో స్పెషల్ అట్రాక్షన్ అయిన ప్రియాంక సింగ్‌‌కు తాజాగా ఓ కోలుకోలేని షాక్ తగిలింది. ఆ వివరాలు మీకోసం!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 బిగ్ బాస్ అంటే లవ్ ట్రాకులు అనేలా

బిగ్ బాస్ అంటే లవ్ ట్రాకులు అనేలా

అన్ని భాషల్లో బిగ్ బాస్ షో సూపర్ డూపర్ హిట్ అవడానికి అందులో కనిపించే లవ్ ట్రాకులు కూడా ప్రాధాన కారణం అని చెప్పొచ్చు. బయట అస్సలు పరిచయం లేని కంటెస్టెంట్లు హౌస్‌లో మాత్రం ప్రేమాయణాలు నడుపుతున్నట్లు కనిపిస్తారు. వీటికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో షో నిర్వహకులు సైతం లవ్ ట్రాకులనే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు.

చాలా జంటలు.. వాళ్లంతా ఫుల్ ఫేమస్

చాలా జంటలు.. వాళ్లంతా ఫుల్ ఫేమస్

తెలుగులో బిగ్ బాస్ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. వీటన్నింటిలోనూ లవ్ ట్రాకులు కనిపించాయి. మొదటి సీజన్‌లో ప్రిన్స్.. దీక్షా పంత్, రెండో సీజన్‌లో తేజస్వీ మదివాడ.. సామ్రాట్, మూడో సీజన్‌లో రాహుల్ సిప్లీగంజ్.. పునర్నవి భూపాలం, నాలుగో సీజన్‌లో అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ సహా ఎంతో మంది ప్రేమికులుగా పేరు తెచ్చుకుని విపరీతంగా ఫేమస్ అయ్యారు.

ఐదో సీజన్‌లో వాళ్లిద్దరూ రచ్చ చేస్తూనే

ఐదో సీజన్‌లో వాళ్లిద్దరూ రచ్చ చేస్తూనే

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కూడా ఆరంభంలోనే లవ్ ట్రాకులు కనిపించాయి. మరీ ముఖ్యంగా ఇందులో హమీదా ఖటూన్, సింగర్ శ్రీరామ చంద్ర మధ్య ప్రేమాయణం ఓ రేంజ్‌లో సాగుతోంది. వీళ్లిద్దరూ సమయం సందర్భం లేకుండా రొమాన్స్ చేస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నారు. అదే సమయంలో రొమాంటిక్‌గా మాట్లాడుకుంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు.

ప్రియాంక సింగ్ వింత లవ్ ట్రాక్ కూడా

ప్రియాంక సింగ్ వింత లవ్ ట్రాక్ కూడా

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్‌ మొదటి రోజు నుంచే ఫోకస్ అవుతోంది. ఆమె రూపం, ఆట తీరుకు చాలా మంది ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సైతం ఆమెకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈమె ఆరంభం నుంచే మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. దీంతో వీళ్ల వింత ట్రాక్ కూడా హైలైట్ అవుతోంది.

వాళ్లతో పాటు వీళ్లిద్దరి గురించి చర్చలు

వాళ్లతో పాటు వీళ్లిద్దరి గురించి చర్చలు

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ప్రియ ఇంటికి కొత్త కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ క్రమంలోనే రేషన్‌ మేనేజర్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై చర్చలు జరిగాయి. ఆ సమయంలో శ్రీరామ్.. హమీదా గురించి ఆనీ మాస్టర్ విమర్శలు చేసింది. వాళ్లిద్దరూ రొమాన్స్ చేసుకోడానికే టైమ్ కేటాయిస్తున్నారని అంది. అలాగే, ప్రియాంక.. మానస్‌కు మాత్రమే సేవలు చేస్తుందని కామెంట్ చేసింది.

ప్రియాంక సింగ్‌కు షాక్ ఇచ్చిన మానస్

ప్రియాంక సింగ్‌కు షాక్ ఇచ్చిన మానస్

ఆనీ మాస్టర్ తన గురించి, ప్రియాంక గురించి అన్న మాటలు మానస్ చెవిన పడ్డాయి. దీంతో దానిపై ప్రియతో అతడు ఈ విషయంపై చర్చిస్తూ కనిపించాడు. సరిగ్గా అప్పుడే పింకీ అన్న కలుపుకుంటూ అతడికి తినిపించేందుకు వచ్చింది. అప్పుడు మానస్ 'ఇకపై నా పనులు నేను చేసుకుంటా.. నువ్వేమీ నా పనులు చేయొద్దు' అంటూ ఆమె ముఖం మీదనే చెప్పేశాడు.

కోపంతో పింకీ కన్నీరు.. వాళ్లంతా వెళ్లినా

కోపంతో పింకీ కన్నీరు.. వాళ్లంతా వెళ్లినా

మానస్ ఉన్నట్లుండి అలా ప్రవర్తించడానికి కారణం.. తమ గురించి ఎవరో ఏదో అనుకోవడమే అని ప్రియాంక సింగ్‌కు అర్థం అయింది. దీంతో వాళ్లను మనసులో తిట్టుకుంటూ ఒంటరిగా కూర్చుని తెగ ఏడ్చేసింది. అంతేకాదు, తర్వాత వాళ్ల సంగతి చెబుతానంటూ అనుకుంది. ఆ సమయంలో షణ్ముఖ్, సిరి, జెస్సీలు వెళ్లి ప్రియాంకను ఓదార్చే ప్రయత్నం చేసినా ఆగలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X