For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ కంటెస్టెంట్‌కు నాగబాబు సపోర్ట్: బిడ్డ లాంటి వాడంటూ కామెంట్.. అభిజీత్ గెలిచినట్లే తను కూడా!

  |

  తెలుగు బుల్లితెరపై కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులు క్రియేట్ చేస్తూ.. దాదాపు ఐదేళ్లుగా హవాను చూపిస్తోన్న షో బిగ్ బాస్. గతంలో ఈ తరహా షో ఎప్పుడూ రాకున్నా.. కొత్త కాన్సెప్టుతో వచ్చేదే అయినా మన ప్రేక్షకుల దీనికి ఆశించిన దాని కంటే ఎక్కువే రెస్పాన్స్‌ను అందించారు. అందుకే ఇది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదో సీజన్ కూడా మొదలైంది. దీంతో ఈ షోను అభిమానించే వాళ్లంతా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు నచ్చిన కంటెస్టెంట్లకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తన అభిమాన కంటెస్టెంట్ గురించి వెల్లడించారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  ఎన్నో అంచనాలతో వచ్చిన ఐదో సీజన్

  ఎన్నో అంచనాలతో వచ్చిన ఐదో సీజన్

  మిగిలిన భాషలతో పోల్చితే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్‌కు మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. సామాన్యులే కాదు.. దీనికి సెలెబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయారు. ఫలితంగా ఈ షోపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఐదో సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. దీన్ని కూడా కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

  Bigg Boss Telugu 5: ఆమె కాళ్లు పట్టుకుని ఏడ్చిన జస్వంత్.. మళ్లీ నోరు జారి అంత మాట అనడంతో!

  ఒకేసారి అంత మంది... స్పెషల్ ఒక్కరే

  ఒకేసారి అంత మంది... స్పెషల్ ఒక్కరే

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లో సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, ఆర్జే కాజల్, లోబో, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో 9 మంది ఆడవాళ్లు, 9 మంది మగవాళ్లు ఉండగా.. ఒక ట్రాన్స్‌జెండర్ ప్రియాంక కూడా వచ్చింది.

   ఆదర్శంగా ఉంటూ... అందరి దృష్టిలో

  ఆదర్శంగా ఉంటూ... అందరి దృష్టిలో

  జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ మంచి గుర్తింపును అందుకున్న సాయితేజ.. జెండర్‌ను మార్చుకోవాలన్న కోరికతో ఆ తర్వాత సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు. ఆ సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. ఇలాంటి సమయంలో ప్రియాంక సింగ్‌కు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న సమయంలోనే ఎంతో ఆదర్శవంతంగా మాట్లాడి అందరి దృష్టిలో పడిపోయింది.

  సుమ షోలో సంచలన సంఘటన: నిజంగా తిట్టుకున్న జబర్ధస్త్ భామలు.. కెమెరాలు ఉన్నా కిందపడి మరీ!

   ప్రియాంకకు సపోర్ట్ చేస్తున్న నాగబాబు

  ప్రియాంకకు సపోర్ట్ చేస్తున్న నాగబాబు

  బిగ్ బాస్ షోపై సామాన్య ప్రేక్షకుల్లోనే కాకుండా.. సెలెబ్రిటీల్లోనూ ఆసక్తి బాగా ఉంటోంది. అలా ఈ షోను ఫాలో అయ్యే వారిలో మెగా బ్రదర్ నాగబాబు ఒకరు. ప్రతి సీజన్‌నూ చూసిన ఆయన.. పలువురు కంటెస్టెంట్లకు మద్దతు కూడా ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతోన్న ఐదో సీజన్‌లో ప్రియాంక సింగ్‌కు నాగబాబు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేసి పలు విషయాలు వెల్లడించారు.

   అప్పుడే సపోర్ట్ చేశాను అంటూ చెప్పి

  అప్పుడే సపోర్ట్ చేశాను అంటూ చెప్పి

  ప్రియాంక సింగ్ గురించి నాగబాబు మాట్లాడుతూ.. ‘సాయితేజకు పైకి అబ్బాయిలా ఉన్నా.. లోపల అమ్మాయిల ఫీలింగ్స్ ఉండేవి. అందుకే సర్జరీ చేయించుకున్నాడు. ఆ సమయంలో ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ.. ఎంతో ధైర్యం చేశాడని అనిపించింది. అందుకే అతడికి సపోర్ట్ చేశా. జబర్ధస్త్‌లో మానేసిన తర్వాత అదిరిందికి తీసుకున్నా. దాని తర్వాత సొంతంగా వీడియోలు చేస్తూ ఎదుగుతున్నాడు' అని చెప్పారాయన.

  Bigg Boss 5 Promo: హమీదాతో శ్రీరామ్ రొమాంటిక్‌గా.. నీకు ఆ ఫీలింగ్స్ లేవా అని ఆమె అడగ్గానే!

  వాళ్లంతా తెలుసు.. తను గెలవాలంటూ

  వాళ్లంతా తెలుసు.. తను గెలవాలంటూ

  ఇక, ఐదో సీజన్‌లో తనకు చాలా మంది తెలుసన్న నాగబాబు.. ప్రియాంక గెలిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘ఈ సీజన్‌లో యాంకర్ రవి, షణ్ముఖ్, శ్రీరాం, ఆనీ మాస్టర్, నటి ప్రియ, నటరాజ్ మాస్టర్ ఇలా చాలా మంది తెలిసిన వాళ్లే ఉన్నారు. కానీ, ప్రియాంక గెలిస్తే చూడాలని ఉంది. కెమెరా ముందు ఎలా ఉన్నాడో.. బయట కూడా అలానే ఉంటాడు. తను గెలిచినా గెలవకపోయినా నేను మాత్రం సపోర్ట్ చేస్తున్నా' అంటూ చెప్పారు.

  బిడ్డ లాంటి వాడు.. తను గెలిస్తే వాళ్లే

  బిడ్డ లాంటి వాడు.. తను గెలిస్తే వాళ్లే

  ఇప్పుడున్న వారిలో ప్రియాంక సింగ్ ఎంతో స్పెషల్ అంటూ చెప్పిన నాగబాబు ‘ట్రాన్స్ జెండర్స్‌ కూడా ఈ సమాజంలో ఓ వర్గం వారే. వారికి ప్రతినిధిగా సాయి రావడం ఎంతో సంతోషంగా ఉంది. వెకిలి నవ్వు, ప్రవర్తన వంటివి ఉండవు. తను గెలిస్తే ఒక కమ్యూనిటీ గెలిచినట్లు అవుతుంది. అందుకే అందరూ తనకు మద్దతిచ్చి గెలవకపోయినా హౌస్‌లో ఉండేలా చేయండి' అంటూ ప్రేక్షకులను కోరారాయన.

  Bigg Boss Telugu 5: ఆమెను టార్గెట్ చేసిన అభిజీత్ ఫ్యాన్స్.. ఆ వీడియోలు షేర్ చేసి మరీ దారుణంగా!

  Maha Samudram Movie Team On 'Cheppake Cheppake' Song
  అప్పుడు అభిజీత్ గెలిచినట్లే ఇప్పుడు

  అప్పుడు అభిజీత్ గెలిచినట్లే ఇప్పుడు

  మెగా బ్రదర్ నాగబాబు గత సీజన్‌లో అభిజీత్‌కు మద్దతు తెలిపారు. అతడి గురించి కూడా వీడియోలు చేయడం.. పోస్టులు పెట్టడం వంటివి చేశారు. అందుకు అనుగుణంగానే నాలుగో సీజన్‌లో ఈ యంగ్ హీరో విజేతగా నిలిచాడు. ఈ నేపథ్యంలో నాగబాబు ఇప్పుడు ప్రియాంకకు మద్దతు తెలిపారు. దీంతో తను కూడా విజేతగా నిలుస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఇక, మెగా అభిమానులంతా ప్రియాంకకు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In This Season.. Mega Brother Nagababu Supports Special Contestan Priyanka Singh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X