For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: షోలో చెండాలమైన పని చేసిన హమీదా.. పర్సనల్ ఫొటోలను లీక్ చేసి ఝలక్ ఇచ్చిన ఫ్యాన్స్

  |

  తెలుగు బుల్లితెరపై ఛానెళ్లన్నీ పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ.. సరికొన్ని కాన్సెప్టును పరిచయం చేసిన ఏకైక షో బిగ్ బాస్. కొందరు సెలెబ్రిటీలను ఒక ఇంట్లో పెట్టి.. కొన్ని టాస్కులు ఇవ్వడం.. వాటిని సక్రమంగా ఆడి ప్రేక్షకుల మనసు గెలుచుని విజేతలుగా నిలవడానికి వాళ్లు చేసే ప్రయత్నాలే ఈ షో సారాంశం. ఆరంభం నుంచీ మజాను పంచుతోన్న ఈ షో విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదోది కూడా ప్రారంభం అయింది. దీనికి కూడా మొదటి నుంచే మంచి స్పందన వస్తోంది. ఇక, ఇందులో కంటెస్టెంట్‌గా వచ్చిన హమీదా స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పర్సనల్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  ఐదింతలు ఎక్కువ మజాను పంచాలని

  ఐదింతలు ఎక్కువ మజాను పంచాలని

  ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. పాత సీజన్లను మరిపించేలా దీనిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ సారి 19 మంది కంటెస్టెంట్లను పంపారు. అలాగే, ఆరంభం నుంచే సరికొత్త టాస్కుల పరిచయం చేస్తున్నారు దీనికితోడు గొడవలు, కొట్లాటలు వంటి వాటితో ఈ సీజన్ మరింత మజాను పంచుతోంది.

  హాట్ షోలో హద్దు దాటిన శ్రీముఖి: డ్రెస్ ఉన్నా లేనట్లే అందాల ఆరబోత.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

   అంతా ఆమె గురించే వెతకడంతో ఫేమ్

  అంతా ఆమె గురించే వెతకడంతో ఫేమ్

  ఈ సీజన్‌లో పలు విభాగాల్లో ఫేమస్ అయిన 19 మంది కంటెస్టెంట్లను తీసుకొచ్చారు. అందులో కొందరు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందులో ప్రముఖ నటి హమీదా ఖటూన్ ఒకరు. పలు సినిమాల్లో కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేదు. దీంతో ఈమె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో గూగుల్‌లో ఈ పేరు బాగా ట్రెండ్ అయింది.

  వ్యవహార శైలితో హైలైట్ అయిన భామ

  వ్యవహార శైలితో హైలైట్ అయిన భామ

  బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో హమీదా మీదే అందరి దృష్టి పడిపోయింది. అందుకు అనుగుణంగానే ఆమె వ్యవహరిస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా చిత్ర విచిత్రమైన డ్రెస్‌లు వేసుకోవడం.. స్మోకింగ్ చేయడం.. అబ్బాయిలతో చనువుగా ఉండడం వంటి వాటితో బాగా హైలైట్ అయింది. అదే సమయంలో చాలా మంది మనసులు దోచుకుని ఫాలోయింగ్ పెంచుకుంది.

  పబ్లిక్ ప్లేస్‌లో భర్తతో శ్రీయ సరసాలు: ఏకంగా పైకి లేపేసి మరీ.. దారుణమైన ఫోజుతో అందాల విందు

  అతడితో లవ్ ట్రాక్... రొమాన్స్ చేస్తూనే

  అతడితో లవ్ ట్రాక్... రొమాన్స్ చేస్తూనే

  బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత హమీదా ఖటూన్.. ఎక్కువగా శ్రీరామ చంద్రతో క్లోజ్‌గా ఉంటోంది. అతడు కూడా ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అలాగే, తరచూ రొమాంటిక్‌గా చూస్తూ మాట్లాడుతున్నాడు. అతడికి అనుగుణంగానే హమీదా కూడా ప్రతిస్పందిస్తోంది. ఇక, ఈ మధ్య మసాజ్‌లు, రొమాంటిక్ డ్యాన్సులు కూడా చేసి హాట్ టాపిక్ అయ్యారు.

   నామినేషన్స్ టాస్కులో ఊహించని పని

  నామినేషన్స్ టాస్కులో ఊహించని పని

  మూడో వారం నామినేషన్స్ టాస్కు కూడా పలు రకాల గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. ఇందులో హమీదా ఖటూన్.. ప్రియాంక సింగ్‌ను నామినేట్ చేసింది. దీనికి ఆమె చెప్పిన కారణం ఏంటంటే.. ‘నాకు ఫైర్ అంటే భయం అని ముందే చెప్పాను. అయినా కిచెన్‌లో ప్రియాంక నాకు భయం కలిగించేలా చేసింది' అంది. దీంతో ప్రియాంకతో పాటు అంతా షాక్‌కు గురైపోయారు.

  Bigg Boss: షోలో మరో దారుణ సంఘటన.. ప్రియాంకతో అతడు అసభ్య ప్రవర్తన.. టీషర్ట్ లోపల చేయి పెట్టి!

   చెండాలమైన పనులు చేస్తారు అంటూ

  చెండాలమైన పనులు చేస్తారు అంటూ

  హమీదా ఖటూన్ తనను నామినేట్ చేయడం.. దానికి ఫైర్ గురించి కారణం చెప్పడం.. ప్రియాంక సింగ్‌కు బాగా కోపాన్ని తెచ్చాయి. ఆ సమయంలో ‘రైస్ వండేటప్పుడు ప్రెజర్ పోవాలి. లేకపోతే అన్నం పాడైపోతుంది. అందుకోసం విజిల్ తీస్తాం. దాన్నే భయం అంటే ఎలా? అయినా నేనైతే కావాలని చేయలేదు. చెండాలపు పనులతో నామినేట్ చేస్తున్నారు' అంటూ ఫైర్ అయింది.

  Megastar Chiranjeevi Launches The Trailer Of Sai Dharam Tej’s Republic
   హమీదా ఫొటోలు లీక్ చేసి మరీ ట్రోల్స్

  హమీదా ఫొటోలు లీక్ చేసి మరీ ట్రోల్స్

  ఫైర్ అంటే భయం అని ప్రియాంక సింగ్‌ను నామినేట్ చేసిన హమీదాను నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆమె స్మోకింగ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ‘సిగరెట్ వెలిగిస్తే భయం లేదు.. గ్యాస్ దగ్గర లైటర్ వెలిగిస్తే భయమా' అంటూ ప్రియాంక ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. దీంతో హమీదా పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. Netizens Trolls on Contestant Hamida Khatoon about Smoking.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X