Bigg Boss Telugu 5: ఆ కంటెస్టెంట్‌కు కోలుకోలేని షాక్.. సీజన్ మొత్తం డేంజర్‌ జోన్‌లోనే!

తెలుగులో ఇప్పటి వరకూ ఎన్నో రకాల కార్యక్రమాలు పరిచయం అయ్యాయి. కానీ, వాటిలో చాలా వరకు ఉనికి లేకుండానే వెళ్లిపోయాయి. అయితే, కొన్ని షోలు మాత్రమే ప్రేక్షకుల ఆదరణను అందుకుని సూపర్ డూపర్ సక్సెస్‌ అయ్యాయి. అలాంటి వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పరిచయం అయిన బిగ్ బాస్ ఒకటి. అసలేమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ షోకు మన ఆడియెన్స్ అస్సలు ఊహించని రీతిలో రెస్పాన్స్‌ను అందించారు. దీంతో ఇది బిగ్గెస్ట్ హిట్ అయింది. ఈ కారణంగానే ఏకంగా నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదో సీజన్ కూడా ఆరంభం అయింది. మొదటి వారమే ఇది అందరి దృష్టినీ ఆకర్షించే విధంగా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ షోలో ఊహించని సంఘటన జరిగింది. దీంతో ఓ కంటెస్టెంట్‌ సీజన్ మొత్తం డేంజర్‌ జోన్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలు మీకోసం!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

వాటిని మరిపించేలా ఐదో సీజన్

వాటిని మరిపించేలా ఐదో సీజన్

ఇండియాలో బిగ్ బాస్ షో చాలా భాషల్లో ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. అయితే, తెలుగులో వచ్చే దానికి మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. అందుకే ఈ షో నాలుగు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. అది కూడా నేషనల్ లెవెల్ భారీ రేటింగ్‌తో. ఫలితంగా మన షోకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. అదే సమయంలో దీనిపై అంచనాలు కూడా ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఐదో దాన్ని కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా ఇందులో సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నారు.

రికార్డు స్థాయిలో ఎంట్రీ ఇచ్చారు

రికార్డు స్థాయిలో ఎంట్రీ ఇచ్చారు

సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సారథ్యంలో బిగ్ బాస్ ఐదో సీజన్ ఇటీవలే ప్రారంభం అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వారిలో సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, జబర్ధస్త్ ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, ఆర్జే కాజల్, లోబో, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వలు బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఒకేసారి ఇంత మంది షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో సరికొత్త రికార్డు నమోదైంది.

శక్తి చూపరా డింభక టాస్క్ స్టార్స్

శక్తి చూపరా డింభక టాస్క్ స్టార్స్

కెప్టెన్సీ పోటీదారుల కోసం ఈ వారం బిగ్ బాస్ 'శక్తి చూపరా డింభక' అనే టాస్కును ఇచ్చాడు. అందుకు అనుగుణంగానే హౌస్‌లో కొత్తగా ఏర్పటు చేసిన పవర్ రూమ్ గురించి వివరించాడు. అందులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం వస్తే అది గొప్పదనంగా భావించాలని, అలాగే ఇది కెప్టెన్సీ కోసం పోటీ పడే అవకాశాలను మెరుగుపరుస్తుందని చెప్పాడు. ఆ తర్వాత ఉరుముల శబ్ధం వినిపించగానే కంటెస్టెంట్లు అందరూ.. ఆ రూమ్ బయట ఉన్న స్కానింగ్ డివైజ్‌పై చేయి పెట్టాలని, ముందుగా ఎవరు పెడతారో వాళ్లకు పవర్ రూమ్‌లోకి వెళ్లే అవకాశం లభిస్తుందని చెప్పాడు.

ముగ్గురికి ఆ టాస్కులు ఇచ్చాడు

ముగ్గురికి ఆ టాస్కులు ఇచ్చాడు

ఈ టాస్కులో భాగంగా మొదటి శబ్ధం రాగానే యాక్టర్ విశ్వ గెలవడంతో లోపలికి వెళ్లాడు. ఆ సమయంలో అతడు కోరుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్‌ ఒంటి మీద ఉన్న బట్టలతో సహా మొత్తం ఇచ్చేయాలని బిగ్ బాస్ చెబుతాడు. దీంతో అతడు రవి, ప్రియకు ఆ టాస్క్ ఇచ్చాడు. ఆ తర్వాత మానస్ ఇందులో గెలవగా.. ఒకరు నైట్ అంతా నిద్ర పోకూడదని టాస్క్ ఇస్తాడు. దీంతో ఇది కాజల్‌కు ఇస్తాడతను. అనంతరం సిరి హన్మంత్ గెలవగా.. ఒకరు ఓనర్, మరొకరు సర్వెంట్‌గా ఉండాలన్న టాస్క్ ఇస్తే.. ఆమె షణ్ముఖ్‌ను ఓనర్‌గా, లోబోను సర్వెంట్‌గా ఉండమని చెబుతుంది.

 హమీదా విన్.. ఊహించని టాస్క్

హమీదా విన్.. ఊహించని టాస్క్

ఇప్పటికే ముగ్గురు పవర్ రూమ్ యాక్సెస్‌ను అందుకోగా.. గురువారం జరిగిన ఎపిసోడ్‌లో మరొకరికి ఆ అవకాశం ఉంటుందని ముందే చూపించారు. ఇక, అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండగా ఉరుముల శబ్దం వచ్చింది. దీంతో అక్కడే ఉన్న హమీదా స్కానర్ మీద అందరి కంటే ముందే చేయి పెడుతుంది. దీంతో ఆమె ఈ టాస్కులో గెలుస్తుంది. లోపలికి వెళ్లే అవకాశం రావడంతో ఆమె పవర్ రూమ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు బిగ్ బాస్ ఆమెకు 'మీరు ఎవరినైతే ఎంపిక చేసుకుంటారో.. వాళ్లు ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ అవ్వలేరు' అని చెబుతాడు.

ఆ కంటెస్టెంట్‌కు కోలుకోలేని షాక్

ఆ కంటెస్టెంట్‌కు కోలుకోలేని షాక్

బిగ్ బాస్ చెప్పిన టాస్క్ విన్న వెంటనే హమీదా షాక్ అవుతుంది. దీంతో ఎవరిని చేయాలని చాలా సేపు ఆలోచిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రియను ఎంపిక చేసుకుంటుంది. ఈ విషయం బిగ్ బాస్‌కు చెబుతుంది. దీంతో ఆమెను బయటకు వెళ్లి విషయం చెప్పమని అంటాడు. అప్పుడు బయటకు వచ్చిన హమీదాను అందరూ ఏమైందని అడుగుతారు. అప్పుడామె లోపల జరిగిన విషయం చెబుతుంది. దీంతో అక్కడే ఉన్న ప్రియతో పాటు అందరు కంటెస్టెంట్లు ఒక్కసారిగా షాక్ అవడంతో పాటు నోరెళ్లబెట్టేస్తారు.

Recommended Video

#BiggBossTelugu5 లో Lobo Shannu కాంబో పీక్స్.. Abhijit ని కాపీ కొట్టేదెవరు ! || Filmibeat Telugu
 ప్రియ రియాక్షన్‌కు అంతా ఫిదా

ప్రియ రియాక్షన్‌కు అంతా ఫిదా

హమీదా తనను సీజన్ మొత్తానికి కెప్టెన్ కాకుండా షాకిచ్చినా ప్రియ మాత్రం ఎంతో స్పోర్టివ్‌గా తీసుకున్నారు. ఆ సమయంలో 'ఆల్రెడీ నేను టాస్కులో ఉన్నా కదా.. సరేలే అది నీ ఇష్టం' అంటూ అందరి ముందే ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని చెప్పారామె. ఆ తర్వాత బిగ్ బాస్‌కు కూడా థాంక్స్ చెప్పారు. ఇది జరిగిన తర్వాత సన్నీ ప్రియతో మాట్లాడుతూ.. 'మీరు బాధపడటం లేదా' అని ప్రశ్నించాడు. దీనికామె 'బాధ ఎందుకు ఉండదు కానీ.. నేను ఫైటర్‌ని కాబట్టి పెద్దగా ఫీల్ కాలేదు' అని చెప్పారు. దీంతో ఆమెను అక్కడున్న వాళ్లంతా ప్రశంసించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X