For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss: అమ్మాయిగా మారింది అతడి వల్లే.. పెళ్లి చేసుకుంటానని చివరికి ఆ పని: ప్రియాంక సీక్రెట్ లీక్

    |

    మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ షోకు మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందన్న విషయం తెలిసిందే. హిందీలో ఎప్పుడో మొదలైన ఈ షో.. ఆ తర్వాత చాలా భాషల్లోకి వచ్చింది. కానీ, ఆలస్యంగా వచ్చినా మన దగ్గర దీనికి రికార్డు స్థాయిలో రేటింగ్ వస్తోంది. ప్రతి సీజన్‌ ఒక దానికి మించి ఒకటి సూపర్ హిట్ అవుతున్నాయి. అందుకే ఏకంగా నాలుగింటిని పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదో సీజన్ కూడా ప్రారంభం అయింది. దీనికి కూడా మంచి ఆరంభమే దక్కింది. ఇక, ఈ సారి కంటెస్టెంట్లుగా వచ్చిన వారిలో ప్రత్యేకంగా నిలిచింది మాత్రం ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగే. అంతకు ముందే తెలుగు వాళ్లకు పరిచయం అయినా.. జెండర్ మార్చుకున్న తర్వాత పెద్దగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇందులో అవకాశం అందుకుని సత్తా చాటుతోందామె. ఇక, తాజాగా తన సీక్రెట్‌ను లీక్ చేసింది ప్రియాంక. ఆ వివరాలు మీకోసం!

    Photo Courtesy: Star మా and Disney+Hotstar

    అంచనాలతో మొదలై.. అదరగొట్టింది

    అంచనాలతో మొదలై.. అదరగొట్టింది

    తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ షోకు ఎవరూ ఊహించని రీతిలో రెస్పాన్స్ దక్కుతోంది. దీనికి సామాన్యులే కాదు.. సెలెబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయారు. ఫలితంగా ఈ షోపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఐదో సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. దీన్ని కూడా కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సీజన్ అంచనాలకు తగ్గట్లుగానే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. అందుకే ఐదో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ కూడా సొంతమై మరోసారి రికార్డు నమోదయింది.

    Bigg Boss: బయటపడిన రవి బండారం.. లహరి విషయంలో ప్రియ అన్నది నిజమే.. షాకిస్తోన్న వీడియో

    స్పెషల్ అట్రాక్షన్ అయిన ప్రియాంక

    స్పెషల్ అట్రాక్షన్ అయిన ప్రియాంక

    గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో ప్రియాంక సింగ్ అలియాస్ జబర్ధస్త్ సాయితేజ స్పెషల్ అట్రాక్షన్ అయిన విషయం తెలిసిందే. జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ మంచి గుర్తింపును అందుకున్న సాయితేజ.. జెండర్‌ను మార్చుకోవాలన్న కోరికతో ఆ తర్వాత సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు. ఆ తర్వాత అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి సమయంలో ప్రియాంక సింగ్‌కు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. దీంతో స్పెషల్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.

    చక్కగా ఆడుతూ.. మెప్పు పొందుతూనే

    చక్కగా ఆడుతూ.. మెప్పు పొందుతూనే

    ఐదో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన వారిలో 9 మంది మగ కంటెస్టెంట్లు, 9 మంది ఆడ కంటెస్టెంట్లు.. ప్రియాంక సింగ్ మాత్రం ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో ఉన్నారు. గతంలో తమన్నా కూడా ఇలాగే ప్రవేశించినా.. తన వివాదాస్పద తీరుతో విమర్శల పాలైంది. అయితే, ప్రియాంక మాత్రం హౌస్‌లోకి ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. చక్కని కట్టుబొట్టుతో ఆడవాళ్లే కుళ్లుకునేంత అందంగా తయారవడంతో పాటు హుందాగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి ఆమెకు భారీ స్థాయిలో మద్దతు కూడా దక్కుతోంది.

    ‘జానకి కలగనలేదు' హీరో చనిపోయాడంటూ వార్త: అసలు మేటర్ రివీల్ చేస్తూ.. ఆరియానా సంచలన వ్యాఖ్యలు

    ప్రముఖులతో పాటు ప్రేక్షకుల అండ

    ప్రముఖులతో పాటు ప్రేక్షకుల అండ

    బిగ్ బాస్ షోపై సామాన్య ప్రేక్షకుల్లోనే కాకుండా.. సెలెబ్రిటీల్లోనూ ఆసక్తి బాగా ఉంటోంది. అలా ఈ షోను ఫాలో అయ్యే వారిలో మెగా బ్రదర్ నాగబాబు ఒకరు. ప్రతి సీజన్‌నూ చూసిన ఆయన.. పలువురు కంటెస్టెంట్లకు మద్దతు కూడా ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతోన్న ఐదో సీజన్‌లో ప్రియాంక సింగ్‌కు నాగబాబు మద్దతు ప్రకటించారు. జబర్ధస్త్ సాయి తన బిడ్డలాంటి వాడని చెప్పారు. గెలిపించకపోయినా.. హౌస్‌లో ఉండేలా చూడమని ప్రేక్షకులను కోరారు. ఆయనతో పాటు బుల్లితెరపై ఉన్న పలువురు సెలెబ్రిటీలు కూడా అండగా నిలుస్తున్నారు.

    ప్రేమకథ గురించి చెప్పిన ప్రియాంక

    ప్రేమకథ గురించి చెప్పిన ప్రియాంక

    రెండు రోజుల పాటు కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్.. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్‌తో బిగ్ బాస్ ఇంట్లో సందడి వాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలో నిన్నటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు అందరూ తమ తమ మొదటి ప్రేమకథ గురించి చెప్పాలని బాస్ ఆదేశించాడు. అందుకు అనుగుణంగానే అందరూ వాళ్ల వాళ్ల కథలను చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ కూడా తన ఫస్ట్ లవ్ గురించి చెప్పేసింది. ఆమె ప్రేమించిన అబ్బాయి పేరు రవి. మగాడిగా ఉన్న సమయంలోనే అతడితో ప్రేమలో పడిపోయింట. అయితే, చివర్లో ఆమెకు షాక్ తగిలింది.

    Bigg Boss: షోలో చెండాలమైన పని చేసిన హమీదా.. పర్సనల్ ఫొటోలను లీక్ చేసి ఝలక్ ఇచ్చిన ఫ్యాన్స్

     జెండర్ మార్చుకుని.. పెళ్లి చేసుకోమని

    జెండర్ మార్చుకుని.. పెళ్లి చేసుకోమని

    ప్రియాంక తన ప్రేమకథను వివరిస్తూ.. ‘ఓ ఫంక్షన్‌లో రవి కలిశాడు. అప్పటి నుంచి అతడితో మాట్లాడుతూ మాట్లాడుతూ బాగా క్లోజ్ అయిపోయా. అలా దాదాపు ఆరేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నాం. కానీ, ఎప్పుడూ తనంటే ఇష్టమని చెప్పలేదు. ఇక, నేను నా జెండర్‌ను మార్చుకున్నాను. ఈ విషయం అతడికి తెలీదు. చాలా రోజుల పాటు అతడికి కనిపించలేదు. కొద్ది రోజులకు ధైర్యంగా ఆ అబ్బాయిని కలిశాను. ఆ సమయంలోనే నువ్వంటే ఇష్టం.. మనం పెళ్లి చేసుకుందాం అని అడిగాను. దానికి అతడు ఒప్పుకున్నాడు. దీంతో ఎంతో సంతోషించా' అంటూ చెప్పుకొచ్చింది.

     పెళ్లి చేసుకుంటానని ఆ పని చేశాడు

    పెళ్లి చేసుకుంటానని ఆ పని చేశాడు

    ప్రియాంక చెబుతూ ‘రవి ఓ రోజు నా దగ్గరకు వచ్చి.. నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు పెళ్లి చేసుకుంటా అన్నాడు. అప్పుడు కూడా నేను నో చెప్పలేదు. ఆ తర్వాత మరి నన్ను కూడా పెళ్లి చేసుకుంటా అన్నావ్ కదా అని అడిగా. అప్పుడు తను నువ్ ఏమైనా అమ్మాయివా? నీకు పిల్లలు పుడతారా? పెళ్లి ఏంటి పెళ్లి అని చిరాకు పడ్డాడు. నీకు తెలుసో తెలియదో అబ్బాయ్.. నేను చాలా హాస్పటల్స్ తిరిగాను.. తల్లిని కావడం కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టా. సడెన్‌గా నువ్ వదిలేస్తే ఎలా? అని అతని కాళ్లపై పడ్డాను. అయినా వినకుండా వెళ్లిపోయాడు' అని ఏడ్చేసింది.

    MAA Elections: ప్యానెల్‌ను ప్రకటించిన మంచు విష్ణు.. ఆ సినీ జంటకు రెండు పదవులు.. సంపూ కూడా!

    Alanti Sitralu - 4 Stories 4 Dimensions | Swetha Parashar, Yash Puri
     అదే మాట అంటూ బాధ పెట్టేశాడు

    అదే మాట అంటూ బాధ పెట్టేశాడు

    తన లవ్ స్టోరీ ఎలా ఎండ్ అయిందో చెబుతూ.. ‘ఒకరోజు ఇంటికి రా అని మెసేజ్ పెట్టా. అప్పుడు నేను నాకు పది రోజులుగా నిద్రలేదు.. అనుక్షణం నువ్వే గుర్తొస్తున్నావ్ అని చెప్పా. దీనికి నీకు చెప్పాను కదా.. నాకు పెళ్లి అని మళ్లీ నువ్ ఇలా మాట్లాడుతున్నావ్ అసలు నువ్ ఎవరో తెలుసా? అని నన్ను గుచ్చి గుచ్చి చిన్నప్పటి నుంచి నన్ను ఏమాట అని నన్ను ఏడిపించేవారో అదే మాటని పదే పదే అన్నాడు. తనలా ఎవరూ నన్ను ఆ మాటతో బాధపెట్టలేదు. సరే నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు' అంటూ ముగించింది ప్రియాంక

    English summary
    Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Recent Episode.. Priyanka Singh Revealed her Sad Love Story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X