For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: షోలో బరితెగించిన కంటెస్టెంట్.. ఆమెతో పాడు పనులు.. ఏకంగా డ్రెస్ లోపల చేయి పెట్టేసి మరీ!

  |

  తెలుగు బుల్లితెరపై ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ సరికొత్త కాన్సెప్టుతో ప్రసారం అవుతోన్న ఏకైక షో బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని సన్నివేశాలు, గొడవలు, టాస్కులు, కొట్లాటలు, ప్రేమకథలు, రొమాన్స్‌ ఇలా ఎన్నో రకాల పరిణామాలతో సాగే ఈ షోకు తెలుగు ప్రేక్షకులు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఈ కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదో సీజన్‌ను కూడా ప్రారంభించారు. ఇది ఆరంభంలో ఆసక్తికరంగా సాగినా గత వారం కాస్త చప్పబడింది. ఇలాంటి పరిస్థితుల్లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెడుతూ బిగ్ బాస్ నయా ప్లాన్స్ వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా హౌస్‌లోని ఓ కంటెస్టెంట్ బరితెగించి పాడుపనులు చేశాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  ఎన్నో అంచనాలు.. అదే రేంజ్‌ ఓపెనింగ్

  ఎన్నో అంచనాలు.. అదే రేంజ్‌ ఓపెనింగ్

  చాలా భాషల్లో బిగ్ బాస్ షో ప్రసారం అయినా తెలుగులో వచ్చే షోకు మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. సామాన్యులే కాదు.. దీనికి సెలెబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయారు. ఫలితంగా ఈ షోపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఐదో సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. దీన్ని కూడా కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సీజన్ అంచనాలకు తగ్గట్లుగానే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. అందుకే ఐదో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ కూడా అందుకుంది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  వాళ్లందరిలో ఆమెనే స్పెషల్ అట్రాక్షన్‌గా

  వాళ్లందరిలో ఆమెనే స్పెషల్ అట్రాక్షన్‌గా

  తాజా సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో ప్రియాంక సింగ్ అలియాస్ జబర్ధస్త్ సాయితేజ స్పెషల్ అట్రాక్షన్ అయిన విషయం తెలిసిందే. జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ మంచి గుర్తింపును అందుకున్న సాయితేజ.. జెండర్‌ను మార్చుకోవాలన్న కోరికతో ఆ తర్వాత సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు. ఆ సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి సమయంలో ప్రియాంక సింగ్‌కు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. దీంతో స్పెషల్ కంటెస్టెంట్‌గా పేరొందింది.

   స్పెషల్ కేటగిరీలో వచ్చి.. మంచి పేరుతో

  స్పెషల్ కేటగిరీలో వచ్చి.. మంచి పేరుతో

  ఐదో సీజన్‌లోకి 9 మంది మగ కంటెస్టెంట్లు, 9 మంది ఆడ కంటెస్టెంట్లు రాగా.. ప్రియాంక సింగ్ మాత్రం ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చింది. గతంలో తమన్నా కూడా ఇలాగే ప్రవేశించినా.. తన వివాదాస్పద తీరుతో విమర్శల పాలైంది. అయితే, ప్రియాంక మాత్రం హౌస్‌లోకి ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. చక్కని కట్టుబొట్టుతో ఆడవాళ్లే ఈర్శ పడేంత అందంగా తయారవడంతో పాటు హుందాగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి ఆమెకు భారీ స్థాయిలో సపోర్టు కూడా లభిస్తోంది.

  అందాలన్నీ చూపిస్తూ రెచ్చిపోయిన పవన్ హీరోయిన్: బట్టలు ఉన్నా లేనట్లే.. మరీ ఇంత దారుణంగానా!

  గతంలో కంటే దారుణమైన సంఘటనలు

  గతంలో కంటే దారుణమైన సంఘటనలు

  ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభం అయింది. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ ఐదింతలు ఎక్కువగా ఉంటుందని చెప్పిన నిర్వహకులు.. అందుకు అనుగుణంగానే ప్రేక్షకులకు మజాను పంచే కంటెంట్‌ను మాత్రమే ఎక్కువగా ప్రసారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హౌస్‌లో గొడవలు, కొట్లాటలు, రొమాన్స్, లవ్ ట్రాకులు, వివాదాలకు దారి తీసే అంశాలను హైలైట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు రకాల దారుణమైన సంఘటనలు జరిగాయి. అలాగే, గతంలో ఎన్నడూ చూడని కొన్ని సన్నివేశాలు కూడా కనిపిస్తున్నాయి.

  అతడు ప్రియాంక టీషర్ట్‌లో చేయి పెట్టాడు

  అతడు ప్రియాంక టీషర్ట్‌లో చేయి పెట్టాడు

  ఇటీవల ఓ ఎపిసోడ్‌లో ప్రియాంక మాట్లాడుతూ.. ‘నేను హాఫ్ ఫిట్ డ్రెస్ వేసుకున్నాను. అది నాకు కంఫర్ట్‌గా అనిపించలేదు. నాకు తెలుసు అది కాస్త ఇబ్బందిగానే ఉందని.. అందుకే నాకు వీలైనంత వరకూ కవర్ చేసుకుంటూనే ఉన్నాను. నేను ఎవరితోనో ఏదో మాట్లాడుతూ ఉంటే లోబో నాకు రెండు మూడు సార్లు సైగ చేశాడు. అప్పుడు సీన్ అర్థమై మరింత జాగ్రత్తగా ఉన్నాను. లోబో సడెన్‌గా వచ్చి లోపలికి చేయిపెట్టాడు. కానీ నేను దాన్ని చాలా ఫన్నీగా తీసుకున్నా. ఆ తర్వాత వెంటనే లోపలికి వెళ్లి డ్రెస్ మార్చుకున్నా' అని సంచలన ఆరోపణలు చేసింది.

  Bigg Boss: ఐదో సీజన్‌లో విజేత ‘అతడే'నా.. అలా బయటకు వచ్చిన మేటర్.. బిగ్ బాస్ తీరుపై అనుమానాలు

  బరితెగించిన కంటెస్టెంట్.. మళ్లీ పాడు పని

  బరితెగించిన కంటెస్టెంట్.. మళ్లీ పాడు పని

  బిగ్ బాస్ షోలోనే అత్యంత ముఖ్యమైన టాస్కుల్లో నామినేషన్స్ ఒకటి. ఒకరిని హౌస్‌లో ఉంచాలన్నా.. పంపించాలన్నా దీని మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే ఆరోజు ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. ప్రేక్షకులకు కనిపించని విషయాలు కూడా బయటకు వస్తుంటాయి. ఇందులో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ గొడవలు పడుతుంటారు. ఇందులో భాగంగానే తాజాగా జరిగిన నామినేషన్స్ టాస్కులో ప్రియాంక సింగ్.. లోబోపై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. దీంతో అతడు హౌస్‌లో బరితెగించి వ్యవహరిస్తున్నాడని పలువురు విమర్శలు చేస్తున్నారు.

  Heroine Shwetta Parashar About 'Alanti Sitralu' Movie
   ఏకంగా డ్రెస్ లోపల చేయి పెట్టేసి మరీ!

  ఏకంగా డ్రెస్ లోపల చేయి పెట్టేసి మరీ!

  నామినేషన్స్ టాస్కులో లోబోను నామినేట్ చేసింది ప్రియాంక సింగ్. ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ.. ‘గతంలో ఒకసారి డ్రెస్‌లో చేయి పెట్టావు. అప్పుడు నాకు అది నచ్చలేదు.. మళ్లీ అలా చేయకు అని చెప్పాను. అయినా కూడా నిన్న నువ్వు మళ్లీ నాతో అలాగే ప్రవర్తించావు. హగ్ చేసుకున్నట్లు చేసుకుని ఏకంగా డ్రెస్ లోపల చేయి పెట్టేశావు. అది నాకు అస్సలు నచ్చలేదు అన్నయ్య' అంటూ దారుణమైన ఘటనను బయట పెట్టేసింది. దీంతో లోబోపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, బిగ్ బాస్ మాత్రం ఆ సన్నివేశాలను చూపించకపోవడం గమనార్హం.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Recent Episode.. Priyanka Singh Reveal Lobo Real Character
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X