Bigg Boss: మానస్‌ను కాదని మరొకరితో పింకీ సరసాలు.. పెళ్లి చేసుకోకున్నా అతడితో సెటిలైపోతా అంటూ!

అంచనాలను పక్కన పెడితే.. ఎన్నో అనుమానాల నడుమ తెలుగులోకి పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మద్దతును కూడగట్టుకుని సూపర్ హిట్ షోగా మారిపోయింది బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టే అయినా ఇక్కడి ప్రేక్షకులు దీనికి ఊహించని రీతిలో స్పందన అందించారు. ఫలితంగా ఇది దేశంలోనే నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఐదో సీజన్‌కు సైతం భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఇక, ఇందులో స్పెషల్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్ షోలో ఓ కంటెస్టెంట్‌తో వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

అంచనాలకు అనుగుణంగానే ఆసక్తిగా

అంచనాలకు అనుగుణంగానే ఆసక్తిగా

చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా తెలుగులో వచ్చే బిగ్ బాస్‌కు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. అందుకే ఐదో సీజన్‌పై అంచనాలు అదే రేంజ్‌లో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే షో నిర్వహకులు ఈ సీజన్‌లో అన్నీ సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఫలితంగా ఇది ఆరంభం నుంచే ఆసక్తికంగా సాగుతూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది.

ఐదో సీజన్‌లో స్పెషల్ కంటెస్టెంట్‌గా

ఐదో సీజన్‌లో స్పెషల్ కంటెస్టెంట్‌గా

ఈ సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ప్రియాంక సింగ్ అలియాస్ జబర్ధస్త్ సాయితేజ స్పెషల్ అట్రాక్షన్ అయింది. జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ మంచి గుర్తింపును అందుకున్న సాయితేజ.. జెండర్‌ను మార్చుకుని అమ్మాయిలా మారిపోయాడు. అనంతరం ఎన్నో కష్టాలు అనుభవించాక బిగ్ బాస్ ఆఫర్‌ను అందుకుందామె.

అప్పుడే మంచి పేరు తెచ్చుకుందిగా

అప్పుడే మంచి పేరు తెచ్చుకుందిగా


ప్రియాంక సింగ్ బిగ్ బాస్‌లోకి ట్రాన్స్‌జెండర్‌గా ఎంట్రీ ఇచ్చింది. గతంలో తమన్నా కూడా ఇలాగే ప్రవేశించినా.. తన వివాదాస్పద తీరుతో విమర్శల పాలైంది. అయితే, పింకీ మాత్రం హౌస్‌లోకి ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. చక్కని కట్టుబొట్టుతో కనిపిస్తూ మంచి పేరుతో పాటు మద్దతును కూడా భారీగా సంపాదించుకుంది.

పింకీ లవ్ ట్రాక్ విషయంలో మాత్రం

పింకీ లవ్ ట్రాక్ విషయంలో మాత్రం

ప్రియాంక సింగ్‌ ఆరంభం నుంచే మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. దీంతో వీళ్ల వింత ట్రాక్ కూడా హైలైట్ అవుతూ ఉంది. దీన్ని బిగ్ బాస్ నిర్వహకులు మరింత ఫోకస్ చేస్తూ చూపిస్తున్నారు. ఫలితంగా ఈ విషయం ప్రేక్షకులు తప్పుబడుతున్నారు. దీంతో ప్రియాంక సింగ్‌పై విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ ఆమె మాత్రం తరచూ అతడితోనే కనిపిస్తోంది.

మరింతగా క్లోజ్.. అలాంటి పనులతో

మరింతగా క్లోజ్.. అలాంటి పనులతో


బిగ్ బాస్ హౌస్‌లో ప్రియాంక సింగ్ మానస్ కోసం పరితపిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, అతడు మాత్రం ఎంతో సెటిల్డ్‌గా ఉంటున్నాడు. ప్రియాంకకు వీలైనంత స్పేస్ మాత్రమే ఇస్తున్నాడు. కానీ, ఈమె మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ఇలా ఉంటూనే అన్నం తినిపించుకోవడం.. రొమాంటిక్‌గా మాట్లాడుకోవడం వంటివి చేస్తూ ప్రేక్షకుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు.

ఆ ఇటలీ వాడు వద్దు.. అతడే ముద్దు

ఆ ఇటలీ వాడు వద్దు.. అతడే ముద్దు

నామినేషన్స్ టాస్కులో ప్రియాంక సింగ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తాను చెప్పిన కంటెస్టెంట్‌ను నామినేట్ చేయలేదన్న కోపంతో పెద్ద గొడవే చేసింది. ఆ తర్వాత ఎపిసోడ్‌లో మానస్ ఆమెను బుజ్జగించి గోరు ముద్దలు తినిపించాడు. దీంతో కూల్ అయిపోయింది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో పింకీ.. మానస్‌ను కాదని శ్రీరామ చంద్రతో రొమాంటిక్‌గా మాట్లాడి షాకిచ్చింది.

Recommended Video

Romantic Trailer | Prabhas Praises Akash Puri And Ketika Sharma
పెళ్లి, ఎంగేజ్‌మెంట్ వద్దంటూ అలా

పెళ్లి, ఎంగేజ్‌మెంట్ వద్దంటూ అలా

శ్రీరామ్, ప్రియ మాట్లాడుతుండగా.. అక్కడకు వెళ్లింది ప్రియాంక. ఆ సమయంలో అతడిని గట్టిగా హగ్ చేసుకుని 'నాకు పెళ్లి, ఎంగేజ్‌మెంట్ వద్దు. ఆ ఇటలీ వాడు కూడా వద్దు. శ్రీరామ్ గారితో సెటిల్ అయిపోతా. ఈ జీవితానికి ఇంకేం కావాలి' అంటూ రొమాంటిక్‌గా మాట్లాడింది. అప్పుడు శ్రీరామ్ 'ఫ్లట్ చేయడంలో పింకీ నన్నే మించిపోయిందిగా' అంటూ నవ్వుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X