Bigg Boss: షోలో మరో దారుణ సంఘటన.. ప్రియాంకతో అతడు అసభ్య ప్రవర్తన.. టీషర్ట్ లోపల చేయి పెట్టి!

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా ఇండియాలోకి పరిచయం అయిన షోనే బిగ్ బాస్. హిందీలో ఎప్పుడో ప్రారంభం అయిన దీనికి ప్రేక్షకుల మంచి స్పందనను అందించారు. దీంతో ఇది సూపర్ హిట్ అవడంతో పాటు ఏకంగా 14 సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. హిందీలో వచ్చిన స్పందనను చూసి మిగిలిన భాషల్లోనూ ఈ షోను పరిచయం చేశారు. అలా ఐదేళ్ల క్రితమే తెలుగులోకి కూడా ఇది వచ్చింది. ఎన్నో అనుమానాల మధ్య వచ్చిన ఈ షో.. ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా భారీ స్పందనను అందుకుంది. ఫలితంగా నాలుగు సీజన్లను రికార్డు స్థాయి రేటింగ్‌తో సక్సెస్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఐదోది కూడా ఇటీవలే మొదలైంది. ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ షోలో దారుణ సంఘటన జరిగింది. ప్రియాంక సింగ్ దాన్ని రివీల్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 భారీ స్థాయిలో వచ్చి.. దానికి తగ్గట్లుగానే

భారీ స్థాయిలో వచ్చి.. దానికి తగ్గట్లుగానే

దేశంలోని మిగిలిన భాషలతో పోల్చితే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్‌కు మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. సామాన్యులే కాదు.. దీనికి సెలెబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయారు. ఫలితంగా ఈ షోపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఐదో సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. దీన్ని కూడా కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సీజన్ అంచనాలకు తగ్గట్లుగానే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. అందుకే ఐదో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ కూడా సొంతమైంది.

 ఈ సారి స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రియాంక

ఈ సారి స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రియాంక

ఐదో సీజన్‌లోకి ఈ సారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో ప్రియాంక సింగ్ అలియాస్ జబర్ధస్త్ సాయితేజ స్పెషల్ అట్రాక్షన్ అయిన విషయం తెలిసిందే. జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ మంచి గుర్తింపును అందుకున్న సాయితేజ.. జెండర్‌ను మార్చుకోవాలన్న కోరికతో ఆ తర్వాత సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు. ఆ సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి సమయంలో ప్రియాంక సింగ్‌కు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. దీంతో స్పెషల్ కంటెస్టెంట్‌గా వచ్చింది.

 ఒక వర్గానికి ప్రాతినిధ్యం... హుందాగానే

ఒక వర్గానికి ప్రాతినిధ్యం... హుందాగానే

ఈ సారి సీజన్‌లోకి 9 మంది మగ కంటెస్టెంట్లు, 9 మంది ఆడ కంటెస్టెంట్లు రాగా.. ప్రియాంక సింగ్ మాత్రం ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చింది. గతంలో తమన్నా కూడా ఇలాగే ప్రవేశించినా.. తన వివాదాస్పద తీరుతో విమర్శల పాలైంది. అయితే, ప్రియాంక మాత్రం హౌస్‌లోకి ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. చక్కని కట్టుబొట్టుతో ఆడవాళ్లే కుళ్లుకునేంత అందంగా తయారవడంతో పాటు హుందాగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి ఆమెకు భారీ స్థాయిలో మద్దతు కూడా లభిస్తూ వస్తోంది.

మెగా ఫ్యామిలీతో పాటు వాళ్ల మద్దతుతో

మెగా ఫ్యామిలీతో పాటు వాళ్ల మద్దతుతో

ఈ రియాలిటీ షోపై సామాన్య ప్రేక్షకుల్లోనే కాకుండా.. సెలెబ్రిటీల్లోనూ ఆసక్తి బాగా ఉంటోంది. అలా ఈ షోను ఫాలో అయ్యే వారిలో మెగా బ్రదర్ నాగబాబు ఒకరు. ప్రతి సీజన్‌నూ చూసిన ఆయన.. పలువురు కంటెస్టెంట్లకు మద్దతు కూడా ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతోన్న ఐదో సీజన్‌లో ప్రియాంక సింగ్‌కు నాగబాబు మద్దతు ప్రకటించారు. జబర్ధస్త్ సాయి తన బిడ్డలాంటి వాడని చెప్పారు. గెలిపించకపోయినా.. హౌస్‌లో ఉండేలా చూడమని ప్రేక్షకులను కోరారు. ఆయనతో పాటు బుల్లితెరపై ఉన్న పలువురు సెలెబ్రిటీలు కూడా సపోర్ట్ చేస్తున్నారు.

ఈ సీజన్‌లో దారుణమైన సంఘటనలు

ఈ సీజన్‌లో దారుణమైన సంఘటనలు

బిగ్ బాస్ ఐదో సీజన్ ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయింది. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ ఐదింతలు ఎక్కువగా ఉంటుందని చెప్పిన నిర్వహకులు.. ప్రేక్షకులకు మజాను పంచే కంటెంట్‌ను మాత్రమే ప్రసారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హౌస్‌లో గొడవలు, కొట్లాటలు, రొమాన్స్, లవ్ ట్రాకులు, వివాదాలకు దారి తీసే అంశాలను మాత్రమే ఎక్కువగా చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు రకాల దారుణమైన సంఘటనలు జరిగాయి. ఇప్పుడు అలాంటిదే మరొకటి జరిగిందట. ఈ విషయాన్ని ప్రియాంక సింగ్ తాజా ఎపిసోడ్‌లో బయట పెట్టేసింది.

ప్రియాంక టీషర్ట్‌లో చేయి పెట్టేశాడంట

ప్రియాంక టీషర్ట్‌లో చేయి పెట్టేశాడంట

తాజా ఎపిసోడ్‌లో ప్రియాంక మాట్లాడుతూ.. 'నేను నిన్న సాయంత్ర హాఫ్ ఫిట్ డ్రెస్ వేసుకున్నాను. అది నాకు కంఫర్ట్‌గా అనిపించలేదు. నాకు తెలుసు అది కాస్త ఇబ్బందిగానే ఉందని.. అందుకే నాకు వీలైనంత వరకూ కవర్ చేసుకుంటూనే ఉన్నాను. నేను ఎవరితోనో ఏదో మాట్లాడుతూ ఉంటే లోబో నాకు రెండు మూడు సార్లు సైగ చేశాడు. అప్పుడు సీన్ అర్థమై మరింత జాగ్రత్తగా ఉన్నాను. లోబో సడెన్‌గా వచ్చి లోపలికి చేయిపెట్టాడు. కానీ నేను దాన్ని చాలా ఫన్నీగా తీసుకున్నా. ఆ తర్వాత వెంటనే లోపలికి వెళ్లి డ్రెస్ మార్చుకున్నా' అని సంచలన ఆరోపణలు చేసింది.

Recommended Video

Love Story Pre Release Event | Ap Govt కి చిరు విన్నపాలు!!
 ఎలా ఊరుకున్నావ్ అంటూ ఆడవాళ్లు

ఎలా ఊరుకున్నావ్ అంటూ ఆడవాళ్లు

ప్రియాంక ఈ విషయాన్ని కాజల్, సిరికి చెప్పింది. దీంతో 'ఇంత పని చేస్తే ఎలా ఊరుకున్నావ్? వెంటనే సీరియస్ అవ్వాలి కదా. నాకు ఇబ్బంది అనిపించింది.. లోబో ఇలా చేయొద్దని చెప్పాలి కదా. నీ కోసం నువ్ స్టాండ్ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు. నువ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండి ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి' అని చెప్పింది కాజల్. ఆ తర్వాత సిరి ఈ విషయాన్ని రవికి చెప్తానని అంటుంది. కానీ, దీన్ని ఇంతటితో వదలేయమని ప్రియాంక కోరుతుంది. ఈ డిస్కర్షన్ జరిగిన కొద్ది సేపటికే లోబో వచ్చి ఆమెను హగ్ చేసుకుంటాడు. దీంతో ఈ గొడవ సర్ధుమణిగినట్లైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X