twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 5 కంటెస్టెంట్ల లిస్ట్ లీక్.. అదరగొట్టేలా సెలబ్రిటీల ఎంపిక.. హాట్ భామలు ఎవరంటే.. .

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సరికొత్త ఫార్మాట్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబువుతున్నది. సెట్ నిర్మాణం, సదుపాయాల ఏర్పాటు, సెలబ్రిటీల ఎంపిక, ఇతర అంశాలకు సంబంధించిన ఎంపిక చకచకా జరిగిపోతున్నాయి. అయితే కంటెస్టెంట్ల ఎంపికపై రకరకాల ఊహాగానాలు వెలుగు చూస్తున్నాయి. అయితే నిర్వాహకులు ఇప్పటి వరకు సంప్రదింపులు జరిపిన సమాచారం ప్రకారం ఈ షోలో ఎవరువరూ పాల్గొనబోతున్నారంటే...

    16 మంది కంటెస్టెంట్లతో 70 రోజులు

    16 మంది కంటెస్టెంట్లతో 70 రోజులు

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో తొలిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ముంబైకి సమీపంలోని లోనావాలాలో 2017 జూలై 16వ తేదీన ప్రారంభమైంది. 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోకు విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. 50 లక్షల పారితోషికాన్ని అందుకొని శివబాలాజీ తొలి విజేతగా నిలవడంతో ఈ సీజన్ 2017లో సెప్టెంబర్ 24వ తేదీన ముగిసింది. మొత్తం 70 రోజులపాటు ఈ షో కొనసాగింది.

    18 సెలబ్రిటీలతో రెండో సీజన్

    18 సెలబ్రిటీలతో రెండో సీజన్

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 రియాలిటీ షో విషయానికి వస్తే.. హోస్ట్‌గా ఎన్టీఆర్ తప్పుకోవడంతో నేచురల్ స్టార్ నానికి హోస్ట్‌గా వ్యవహరించారు. 2018 జూన్ 10వ తేదీన మొదలైన ఈ షో 2018 సెప్టెంబర్ 30న ముగిసింది. ఈ సీజన్‌లో మొత్తం 18 మంది పాల్గొన్నారు. కౌశల్ మండా విజేతగా నిలవడమే కాకుండా బిగ్ బాస్ చరిత్రలోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ షో 112 రోజులపాటు కొనసాగింది.

    నాగార్జున హోస్ట్‌గా.. రాహుల్ సిప్లిగంజ్ విజేతగా

    నాగార్జున హోస్ట్‌గా.. రాహుల్ సిప్లిగంజ్ విజేతగా

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 షో నుంచి హోస్ట్‌గా నాని తప్పుకోవడంతో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ షోలో 17 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. 2019 సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభమైన ఈ షో 105 రోజులపాటు కొనసాగింది. రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలువడంతో ఈ షో నవంబర్ 3వ తేదీన 2019లో ముగిసింది. ఈ షో మధ్యలో రెండు రోజులు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించడం తెలిసిందే.

    19 మందితో నాలుగో సీజన్

    19 మందితో నాలుగో సీజన్

    కరోనావైరస్ భయాందోళనల మధ్య బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షో సెప్టెంబర్ 2020న ప్రారంభమైంది. 105 రోజులు కొనసాగిన ఈ షో 2019 డిసెంబర్ 20 తేదీన ముగిసింది. అభిజిత్ దుడ్డాల విజేతగా నిలిచారు. ఈ షోలో మొత్తం 19 మంది పాల్గొన్నారు. అఖిల్ సార్థక్ రన్నరప్‌గా నిలిచారు. ఈ షోలో సమంత అక్కినేని రెండు రోజుల పాటు హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ ఫినాలే వేడుకలో చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

    సెప్టెంబర్ 5వ తేదీన బిగ్‌బాస్ తెలుగు 5

    సెప్టెంబర్ 5వ తేదీన బిగ్‌బాస్ తెలుగు 5

    ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అంతా సవ్యంగా సాగితే అదే రోజు ప్రారంభించి 105 రోజలు కొనసాగేలా చర్యలు తీసుకొంటున్నారు. డిసెంబర్ 19వ తేదీన ఫైనల్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే ఈ సారి కంటెస్టెంట్ల ఎంపిక క్రేజీగా సాగుతుందని, టాప్ అండ్ హాట్ సెలబ్రిటీలను షోలో భాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

    కంటెస్టెంట్ల లిస్ట్ లీక్ ఇదే నంటూ

    కంటెస్టెంట్ల లిస్ట్ లీక్ ఇదే నంటూ


    బిగ్‌బాస్ తెలుగు 5లో సినీ, టెలివిజన్ యాక్టర్ల కేటగిరిలో
    ఇషా చావ్లా
    యాంకర్ వర్షిణి
    యాంకర్ రవి
    నటి సురేఖవాణి
    టెలివిజన్ నటి నవ్య స్వామి
    యాంకర్ విష్ణుప్రియ
    యువ హీరో సిద్దార్థ్ వర్మ

    న్యూస్ ప్రజెంటర్ కేటగిరిలో టీవీ9 ప్రత్యూష

    Recommended Video

    Megastar Chiranjeevi, Vijayashanti బ్లాక్ బస్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ || Filmibeat Telugu
    కొరియోగ్రాఫర్ కేటగిరిలో శేఖర్ మాస్టర్

    కొరియోగ్రాఫర్ కేటగిరిలో శేఖర్ మాస్టర్

    సోషల్ మీడియా సెలబ్రిటీ కేటగిరిలో లోబో, టిక్ టాక్ దుర్గారావు పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా గాయకులు, మ్యూజిక్, టీవీ హోస్ట్, సోషల్ సర్వీస్ కేటగిరిల నుంచి కొందరితో ఇప్పటికే సంప్రదింపులు చేపట్టారు. కానీ ఇంకా ఎవరూ కూడా అధికారికంగా ఫైనల్ కాలేదని తెలుస్తున్నది. అంతేకాకుండా భార్యభర్తల జోడి కూడా పాల్గొనే అవకాశం ఉందనే మరో టాక్ వినిపిస్తున్నది.

    English summary
    Most Popular show Bigg Boss Telugu Season 5 on Telugu Television is getting ready with news format. Probable Contestants List Is Here!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X