Bigg Boss: సిరికి ఘోర అవమానం.. తల్లిని కూడా దారుణంగా.. బాయ్‌ఫ్రెండ్ అలా.. కాబోయే వాడు ఇలా!
తెలుగులో కనీవినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్‌ను అందుకుంటూ ఇక్కడే కాదు.. దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఆ ఉత్సాహంతోనే సీజన్ల మీద సీజన్లను కూడా పూర్తి చేసుకుంటోంది. ఇక, ఈ షో ద్వారా ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. దీంతో ఇందులోకి వచ్చేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇలా ఈ సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వాళ్లలో సీరియల్ నటి, సోషల్ మీడియా స్టార్ సిరి హన్మంత్ ఒకరు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆమె తన జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను పంచుకుంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!
Photo Courtesy: Star మా and Disney+Hotstar

ఎంటర్‌టైన్‌మెంట్ ఏమాత్రం తగ్గకుండా
తెలుగులో బిగ్ బాస్ సూపర్ హిట్ అవడంతో ఐదో సీజన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ హైలైట్‌గా ఉండబోతున్నాయని నిర్వహకులు చెప్పారు. వాళ్లు ముందుగా చెప్పినట్లుగానే ఇందులో ఐదింతల ఎక్కువ ఎమోషన్స్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫైటింగ్స్‌ను చూపిస్తూ ఈ సీజన్‌ను కూడా నిర్వహకులు ఆసక్తికరంగా నడుపుతున్నారు.

19 మంది ఎంట్రీ... లేడీస్‌లో ఫేవరెట్‌గా
ఐదో సీజన్‌కు ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంపిక అయ్యారు. అందులో సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఇక, ఇంత మందిలో సీరియల్ నటి, సోషల్ మీడియా సెలెబ్రిటీ సిరి హన్మంత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలో నిలిచింది. దీనికి కారణం ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉండడమే.

ఆరంభంలోనే స్పీడుగా.. విమర్శల వల్ల
ఆడవాళ్లలో టైటిల్ ఫేవరెట్‌గా బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన సిరి హన్మంత్.. ఆరంభంలోనే సత్తా చాటింది. మొదటి వారంలోనే ఇంటికి కెప్టెన్‌గా ఎంపికైన ఆమె.. తన ఆటతీరు ఎలా ఉంటుందో అందరికీ చాటి చెప్పుకుంది. అయితే, ఆ తర్వాత గేమ్‌లో బాగా స్లో అవడంతో పాటు తరచూ గొడవల్లో నిలుస్తోంది. దీంతో విమర్శలను ఎదుర్కొంటూ చెడ్డపేరు తెచ్చుకుంది.

అతడితో చనువుగా.. దారుణ కామెంట్స్
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సిరి హన్మంత్.. షణ్ముఖ్ జస్వంత్‌తో ఎంతో చనువుగా ఉంటోంది. బయట కూడా వీళ్లిద్దరూ స్నేహితులు కావడంతో.. హౌస్‌లోనూ జంటగానే కనిపిస్తున్నారు. ఎప్పుడూ పక్క పక్కనే ఉంటూ విమర్శల పాలవుతున్నారు. దీంతో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సైతం వీళ్లపై దారుణమైన కామెంట్లు చేస్తూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

షన్నూ, జెస్సీతో గొడవలతో హాట్ టాపిక్
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సిరి హన్మంత్, జస్వంత్ పడాల, షణ్ముఖ్ జస్వంత్‌తోనే ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో వీళ్లను త్రిమూర్తులు అని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అలాంటిది రెండు రోజుల క్రితం ఆమెతో షన్నూ గొడవ పడ్డాడు. అప్పటి నుంచి సరిగా తినకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగానే ఉంటూ తెగ బాధ పడిపోతోంది.

తల్లి ఏమైనా పద్దతిగా ఉందా అన్నారు
ఇంటి సభ్యులందరూ తమ తమ జీవితాల్లో ఎదురైన అడ్డంకుల గురించి చెప్పాలంటూ బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా సిరి మాట్లాడుతూ.. 'నేను ఒకరిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. అది నిశ్చితార్థం దగ్గర ఆగిపోయింది. అలాగే, ఓ వ్యక్తిని ప్రేమించాను.. తను చనిపోయాడు. దీంతో తల్లి పద్దతిగా ఉందా? కూతురు ఉండడానికి' అని కొందరు కామెంట్లు చేశారు.

అప్పుడే డిసైడ్ అయ్యా.. అలాగే పెరిగా
తనను చాలా మంది అవమానించారని చెప్పిన సిరి 'నన్ను అన్నవాళ్లందరి నోళ్లు మూయించాలని అప్పుడే డిసైడ్ అయ్యాను. ఇంట్లో చెప్పా పెట్టకుండా హైదరాబాద్ వచ్చి కెరియర్ ప్రారంభించాను. ఇప్పుడీ స్టేజ్‌లో ఉన్నాను. వాళ్లందరికీ ఒక్కటే చెప్పాలి. నేను కూడా పద్దతిగానే పెరిగాను. మా అమ్మ పద్దతిగానే పెంచింది' అంటూ ఎమోషనల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











