For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: హమీదా నామినేషన్స్‌లోకే రాదు.. వాళ్లిద్దరి మధ్య సీక్రెట్ ఒప్పందం బట్టబయలు

  |

  దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ కార్యక్రమానికి అన్ని చోట్ల కంటే తెలుగులో ఎక్కువగా ఆదరణ దక్కుతోంది. ఫలితంగా ఇది మన దగ్గర భారీ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. దీంతో ఏకంగా నాలుగు సీజన్లు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదోది ప్రారంభం అయింది. ఇది కూడా ఆరంభం నుంచే మంచి స్పందనను అందుకుంటూ సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోలో ఓ ఆసక్తికరమై సంఘటన కనిపించింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  భారీగా ప్లాన్.. అంచనాలకు తగ్గట్లుగానే

  భారీగా ప్లాన్.. అంచనాలకు తగ్గట్లుగానే

  ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన బిగ్ బాస్ నాలుగు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో.. ఐదో దానిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని నిర్వహకులు సరికొత్త హంగులతో ప్రారంభించారు. అలాగే, ఆరంభం నుంచే జనాలను ఆకర్షించే కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వివాదాలను హైలైట్ చేస్తుండడంతో దీనికి రెస్పాన్స్ వస్తోంది.

  బెడ్‌పై అర్ధనగ్నంగా ఇలియానా రచ్చ: వామ్మో అదొక్కటి అడ్డు లేకుంటే అంతే సంగతులు

  లవ్ ట్రాకులపై ఫోకస్.. వాళ్లిద్దరూ జోడీ

  లవ్ ట్రాకులపై ఫోకస్.. వాళ్లిద్దరూ జోడీ


  తెలుగు ప్రేక్షకులు మిగిలిన షోలను కాదని బిగ్ బాస్‌ను ఇష్టపడడానికి అందులో కనిపించే లవ్ ట్రాకులు కూడా ప్రధాన కారణం అనే చెప్పాలి. అందుకే నిర్వహకులు ప్రతి సీజన్‌లోనూ కొందరిని జంటలుగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులకు ఇవి బాగా నచ్చుతున్నాయి. ఇక, ఐదో సీజన్‌లో సింగర్ శ్రీరామ చంద్ర, హమీదా మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు చూపిస్తున్నారు.

  రొమాన్స్ చేస్తూ.. అలా ఉంటున్నారుగా

  రొమాన్స్ చేస్తూ.. అలా ఉంటున్నారుగా


  శ్రీరామ చంద్ర బోల్డ్ బ్యూటీ హమీదాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. అతడు ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అలాగే, తరచూ రొమాంటిక్‌గా చూస్తూ మాట్లాడుతున్నాడు. అతడికి హమీదా కూడా ప్రతిస్పందిస్తోంది. ఇక, ఇటీవలే వీళ్లిద్దరూ కలిసి మసాజ్‌లు చేసుకున్నారు. అలాగే, ఇటీవలే ఈ జంట రొమాంటిక్ డ్యాన్స్‌తో అలరించింది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  కెప్టెన్సీ టాస్కు కోసం ఇద్దరూ జంటగా

  కెప్టెన్సీ టాస్కు కోసం ఇద్దరూ జంటగా


  ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీ పడే వారి కోసం బరువు తగ్గే టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి కంటెస్టెంట్లను జంటలుగా ఉండమని బిగ్ బాస్ చెప్పాడు. అందుకు అనుగుణంగానే శ్రీరామ చంద్ర, హమీదా ఒక జోడీగా మారారు. గేమ్‌లో భాగంగానే బరువు తగ్గేందుకు వీళ్లిద్దరూ ఎంతగానో శ్రమించారు. అలాగే, టాస్కును కూడా చక్కగా పూర్తి చేశారు. దీంతో ఈ జంట హైలైట్ అయింది.

  ముగిసిన టాస్క్... బరువులు చూడమని

  ముగిసిన టాస్క్... బరువులు చూడమని


  గురువారం రాత్రి ప్రసారం అయ్యే బిగ్ బాస్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో కొద్ది సేపటి క్రితం విడుదలైంది. ఇందులో... ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్కు ముగిసిందని చెప్పారు. ఇక, ఆరంభంలో మాదిరి మరోసారి బరువులు చూసి.. ఎవరు ఎక్కువ తగ్గారో చెప్పమని బిగ్ బాస్ ఆదేశించాడు. అలా తగ్గిన వాళ్ల నుంచి ముగ్గురిని కెప్టెన్సీ పోటీకి ఎంపిక చేసుకోమని సూచించాడు.

  అందాలన్నీ చూపిస్తూ రెచ్చిపోయిన పవన్ హీరోయిన్: బట్టలు ఉన్నా లేనట్లే.. మరీ ఇంత దారుణంగానా!

  నువ్వు నామినేషన్స్‌లోకే రావు అంటూ

  నువ్వు నామినేషన్స్‌లోకే రావు అంటూ


  తాజాగా విడుదలైన ప్రోమోలో శ్రీరామ చంద్ర, హమీదా కెప్టెన్సీ పోటీకి ఎంపికైనట్లు అర్థమైంది. దీంతో పోటీలో ఎవరు ఉండాలి అన్న దానిపై వీళ్లిద్దరి మధ్య చర్చ జరిగింది. ఆ సమయంలో శ్రీరామ్ ‘నువ్వు కచ్చితంగా నామినేషన్స్‌కు రావు. కాబట్టి ఈ సారి నేనే కెప్టెన్సీ కోసం పోటీ పడతాను' అని చెప్పాడు. దీనికి హమీదా కూడా సుముఖంగానే స్పందించినట్లు కనిపించింది.

  Bigg Boss Telugu 5, Episode 19 Highlights || Filmibeat Telugu
  వాళ్లు టాస్.. వీళ్లిద్దరూ సీక్రెట్ ఒప్పందం

  వాళ్లు టాస్.. వీళ్లిద్దరూ సీక్రెట్ ఒప్పందం


  ఇదే పోటీలో ఆనీ, శ్వేతా కూడా గెలిచినట్లు చూపించారు. దీంతో వీళ్లిద్దరూ పిల్లోను టాస్ వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలాగే, మరో జంట సన్నీ, మానస్‌లు అయితే.. శ్రీరామ్ హమీదా గురించి చర్చించుకున్నారు. వాళ్లిద్దరిలో ఎవరు వస్తానంటే అప్పుడలా డిసైడ్ అవుదామంటూ ఒప్పందం చేసుకున్నారు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ కొంత ఆసక్తికరంగానే సాగేలా ఉంది.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Upcoming Episode.. Sreerama Chandra Deal With Hamida for Captaincy Task.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X