Bigg Boss: షోలో అరాచకమైన సంఘటన.. హగ్ చేసుకుని ముద్దులు.. ఆ సమయంలోనూ రొమాన్స్ చేస్తారా!

బిగ్ బ్రదర్ అనే షో ఆధారంగా హిందీలోకి వచ్చిన షో బిగ్ బాస్. సరికొత్త కాన్సెప్టుతో నడిచే ఈ కార్యక్రమానికి ప్రేక్షకులు మంచి స్పందనను అందించారు. ఫలితంగా ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే పలు భాషల్లోకి సైతం పరిచయం అయింది. అలా ఐదేళ్ల క్రితం తెలుగులోకి కూడా వచ్చింది. ఇక్కడైతే ఎవరూ ఊహించని రీతిలో ఈ షోకు ఆదరణ లభించింది. దీంతో రికార్డు స్థాయిలో రేటింగ్‌లను రాబడడంతో పాటు ఏకంగా నాలుగు సీజన్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదోది కూడా అదే రీతిలో సాగుతోంది. ఇక, ఇందులో గతంలో కంటే ఎక్కువ రొమాన్స్ పండుతోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో శ్రీరామ చంద్ర.. హమీదాకు ముద్దులిచ్చేశాడు. సమయం, సందర్భం కాకపోయినా రొమాన్స్ మాత్రం పండింది. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

Recommended Video

Bigg Boss Telugu 5 : Priyanka Singh Emotional జర్నీ... అమ్మాయిగా మారితే తప్పా ? || Filmibeat Telugu

Photo Courtesy: Star మా and Disney+Hotstar

ఐదింతలు ఎక్కువే ఉండేలా రికార్డులు

ఐదింతలు ఎక్కువే ఉండేలా రికార్డులు

గతంలో బిగ్ బాస్ నాలుగు సీజన్లు కూడా రికార్డులు క్రియేట్ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో దాన్ని నిర్వహకులు వైభవంగా మొదలు పెట్టారు. ఇందులో పాత వాటిని మరిపించేలా సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 19 మంది కంటెస్టెంట్లను పంపించారు. అలాగే, ఆరంభం నుంచే సరికొత్త టాస్కులు, గొడవలు, కొట్లాటలు, రొమాన్స్ వంటి వాటితో మరింత మజాను పంచుతూ వెళ్తోంది. ఈ కారణంగానే ప్రారంభ ఎపిసోడ్‌కు ఏకంగా 18 రేటింగ్‌ను అందుకుని రికార్డు సృష్టించింది.

ఈ సారి అలా ఎవరు ఉంటారని ఆసక్తి

ఈ సారి అలా ఎవరు ఉంటారని ఆసక్తి

అన్ని భాషల్లో బిగ్ బాస్ సక్సెస్ అవడానికి అందులో వచ్చే లవ్ ట్రాకులు కూడా ప్రధాన కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే నిర్వహకులు ప్రతి సీజన్‌లోనూ కొందరిని జంటలుగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులకు ఇవి బాగా నచ్చుతున్నాయి. ఇప్పటికే ఇలా ఎంతో మంది బిగ్ బాస్ జోడీలు అనిపించుకున్నారు. తద్వారా భారీ స్థాయిలో పాపులర్ కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో ఐదో సీజన్‌లో ఎవరు జంటలుగా మారతారు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు అనుగుణంగానే నిర్వహకులు ప్లాన్లు చేస్తున్నారు.

 రెండుమూడు అనుకుంటే.. పండలేదు

రెండుమూడు అనుకుంటే.. పండలేదు

హౌస్‌లో చుట్టూ వందల కెమెరాలు ఉన్నా.. చాలా మంది తమలోని రొమాంటిక్ యాంగిల్‌ను బయటకు తీసి మరీ ప్రేమలను వ్యక్త పరచుకుంటూ ఉంటారు. ఇక, ఐదో సీజన్‌లో ఇప్పటికే పలువురిని జంటలుగా చూపించారు. అలాగే, రొమాంటిక్‌గా ఉండే టాస్కులు సైతం ఇస్తున్నారు. తద్వారా ప్రస్తుతానికి హౌస్‌లో రెండు మూడు జంటలు ఉన్నట్లు హైలైట్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే వాళ్లు తరచూ హగ్గులిస్తూ, కొంటెగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. కానీ, గతంలో మాదిరిగా ఈ సారి ఎక్కువ జంటలు కనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

వాళ్లిద్దరూ మాత్రం రెచ్చిపోతున్నారుగా

వాళ్లిద్దరూ మాత్రం రెచ్చిపోతున్నారుగా

ఐదో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లలో సింగర్ శ్రీరామ చంద్ర ఒకడు. అలాగే హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకుంటోన్న ఈ కుర్రాడు.. బోల్డ్ బ్యూటీ హమీదాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అలాగే, తరచూ రొమాంటిక్‌గా చూస్తూ మాట్లాడుతున్నాడు. అతడికి అనుగుణంగానే హమీదా కూడా ప్రతిస్పందిస్తోంది. హౌస్‌లో వీళ్లిద్దరూ కలిసి మసాజ్‌లు చేసుకున్నారు. అలాగే, ఇటీవలే ఈ జంట రొమాంటిక్ డ్యాన్స్‌తో అలరించింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ట్రాక్‌ నడుస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతూనే ఉంది.

అర్ధరాత్రి సమయంలో రొమాన్స్ చేస్తూ

అర్ధరాత్రి సమయంలో రొమాన్స్ చేస్తూ

బిగ్ బాస్ హౌస్‌లో హమీదా.. శ్రీరామ చంద్ర రోజు రోజుకూ తమ బంధాన్ని మరింతగా బలపర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే సమయం సందర్భం లేకుండా.. చుట్టూ ఎవరు ఉన్నా పట్టించుకోకుండా రొమాన్స్ చేసుకుంటున్నారు. ఇక, ఇటీవల అయితే వీళ్లిద్దరూ కలసి అర్ధరాత్రి సమయంలోనూ కాలక్షేపం చేయడంతో పాటు హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయారు. చుట్టూ కెమెరాలు ఉన్నాయన్న సంగతిని కూడా మర్చిపోయారు. అంతలా రొమాన్స్‌ను పండిస్తూ సాగిపోతున్నారు. ఇక, ఫ్లైయింగ్ కిస్‌లు, సైగలతో షోను ఈ జంట మరింతగా రక్తి కట్టిస్తోంది.

హగ్ చేసుకుని ముద్దులు పెట్టిన రామ్

హగ్ చేసుకుని ముద్దులు పెట్టిన రామ్

ప్రియాంక సింగ్ పుట్టినరోజు సందర్భంగా బిగ్ బాస్ ఆమెకు ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. ముందుగా ఆమె తండ్రితో చేసిన వీడియో బైట్‌ను చూపించిన నిర్వహకులు.. ఆ తర్వాత పింకీ తమ్ముడు పంపించిన పసుపు కుంకుమ.. చీర.. గాజులను అందించాడు. ఆ సమయంలో బిగ్ బాస్ హౌస్‌లో ఉద్వేగభరితం సన్నివేశాలు కనిపించాయి. అందరూ ఎమోషనల్ అయిపోయారు. ఆ సమయంలోనే హమీదా కూడా తన ఫ్యామిలీని గుర్తు చేసుకుంటూ ఏడ్చేసింది. అప్పుడామెను ఓదార్చాడు శ్రీరామ్. అప్పుడు కూడా హమీదాకు ముద్దులు పెట్టి అందరికీ షాక్ ఇచ్చేశాడు.

ఆ సమయంలో కూడా రొమాన్స్ చేస్తూ

ఆ సమయంలో కూడా రొమాన్స్ చేస్తూ

హమీదా తన వాళ్లను గుర్తు చేసుకుని ఏడుస్తోన్న సమయంలో శ్రీరామ్ ఆమెను కౌగిలించుకుని ఓదార్చే ప్రయత్నాలు చేశాడు. అలాంటి సమయంలోనూ ఆమెకు ముద్దుల మీద ముద్దులు ఇచ్చాడు. దీంతో అక్కడే ఉన్న సన్నీ, మానస్ వెంటనే వెనక్కి తిరిగి చూశారు. వాళ్ల తీరును చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో ఆ ఇద్దరికీ అర్థం కాలేదు. కాసేపటికి సన్నీ ఎప్పటిలా సరదాగా ఉంటూ ఆమెను నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో శ్రీరామ్.. 'మీ అన్నయ్య వచ్చాడు చూడు' అంటూ ఆటపట్టించాడు. మొత్తానికి పరిస్థితి ఎలా ఉన్నా వీళ్లు మాత్రం రొమాన్స్ పండించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X