ఆశలు గల్లంతు.. కరోనా దెబ్బకు వెనక్కి బిగ్ బాస్.. ఈసారి ఏ నెలలో అంటే?

తెలుగు బిగ్ బాస్ ఫాన్స్ కి కరోనా చేదు వార్త తీసుకువచ్చింది. నిజానికి గత ఏడాది కరోనా కారణంగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ చాలా ఆలస్యంగా మొదలైంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు ఈ ఏడాది ముందుగానే బిగ్ బాస్ లాంచ్ చేయాలని భావించారు. అందుకే షెడ్యూల్ ప్రకారం జూన్ నెల నుంచి ఈ షో మొదలు పెట్టాలని భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ఈ షో జూన్ నెలలో మొదలు కావడం అనేది అసాధ్యం అని తెలుస్తోంది.

Recommended Video

Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu

మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ షో ఆగస్టు నెలకు వాయిదా పడినట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఈ షో వాయిదాకి ముఖ్య కారణంగా చెబుతున్నారు. నిజానికి ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ సహా చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. తెలంగాణలో లాక్ డౌన్ విధించము అని ప్రభుత్వం చెబుతున్నా సరే ఇప్పటికే దాదాపు సినిమా షూటింగగులు నిలిచిపోయాయి. టీవీ సీరియల్ షూటింగ్ లు జరుగుతున్నా ఇతర రియాలిటీ షోల షూటింగ్ నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో రావాల్సిన ఎవరు మీలో కోటీశ్వరులు షో కూడా ఈ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది.

Bigg Boss Telugu season 5 to be postponed to this month

ఇక ఈ ఐదవ సీజన్ కి కూడా మూడు, నాలుగు సీజన్స్ కి హోస్ట్ గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ షోకు అంత ఆదరణ నాగార్జున తీసుకువచ్చారని నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే ఈ సీజన్ కూడా ఆయన హోస్ట్ గా నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మొదటి సీజన్లో శివబాలాజీ విన్నర్ గా నిలువగా రెండో సీజన్లో మంద కౌశల్ విన్నర్ గా నిలిచారు. మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్, నాలుగో సీజన్ లో అభిజిత్ విన్నర్ గా నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X