Bigg Boss: పర్సనల్ విషయాలపై లేడీస్ పచ్చి మాటలు.. వాడుకుని వదిలేయ్ అంటూ ఆమెతో దారుణంగా!

తెలుగు బుల్లితెరపై ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ సరికొత్త కాన్సెప్టును పరిచయం చేసిన ఏకైక షో బిగ్ బాస్. కొంత మంది ప్రముఖులను ఓ ఇంట్లో ఉంచి.. వాళ్లతో గేమ్స్ ఆడించడం అనే విధానంతో ఇది ప్రసారం అవుతోంది. ఇక, ఇందులో ప్రేక్షకుల మనసులు దోచుకుని విజేతగా నిలవడం కోసం కంటెస్టెంట్లు పోటీ పడుతుంటారు. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. తెలుగు ప్రేక్షకులు దీనికి అపూర్వ మద్దతును అందించారు. దీంతో ఈ షో ఏకంగా నాలుగు సీజన్లను ఒక దానికి మించి ఒకటి పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదో సీజన్ కూడా ప్రారంభం అయింది. ఇది మొదలైన కొద్ది రోజులకే ఆసక్తిని పెంచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో లేడీ కంటెస్టెంట్ల మధ్య పర్సనల్ విషయాలపై చర్చ జరిగింది. ఈ సమయంలో వాళ్లు పచ్చిగా మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్

ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్

మొదటి నాలుగు సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నారు. అందుకు అనుగుణంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 19 మంది కంటెస్టెంట్లను పంపించారు. అలాగే, ఆరంభం నుంచే సరికొత్త టాస్కులతో షో ఆసక్తికరంగా సాగుతోంది. దీనికితోడు గొడవలు, కొట్లాటలు వంటి వాటితో మరింత మజాను పంచుతోందీ సీజన్.

లవ్ ట్రాకులపై రాని స్పష్టత... హైలైట్

లవ్ ట్రాకులపై రాని స్పష్టత... హైలైట్

అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ షోకు ఆదరణ దక్కుతుందంటే అందులో కనిపించే లవ్ ట్రాకులు కూడా ప్రధాన కారణం అనే చెప్పాలి. అందుకే నిర్వహకులు ప్రతి సీజన్‌లోనూ కొందరిని జంటలుగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులకు ఇవి బాగా నచ్చుతున్నాయి. ఇప్పటికే ఇలా ఎంతో మంది బిగ్ బాస్ జోడీలు అనిపించుకున్నారు. తద్వారా భారీ స్థాయిలో పాపులర్ కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో ఐదో సీజన్‌లో ఎవరు జంటలుగా మారతారు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు అనుగుణంగానే కొందరిని హైలైట్ చేస్తున్నారు.

ఎపిసోడ్‌కు ఒకరిని ఫోకస్ చేస్తున్నారు

ఎపిసోడ్‌కు ఒకరిని ఫోకస్ చేస్తున్నారు

బిగ్ బాస్‌ను ఆస్వాదించే ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం లవ్ స్టోరీలనే ఇష్టపడుతున్నారు. అందుకే ఐదో సీజన్‌లో కూడా కొన్ని జంటలుగా మార్చాలని నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురిని జంటలుగా చూపిస్తూ ప్రోమోలు కూడా వదిలారు. అలాగే, రొమాంటిక్‌గా ఉండే టాస్కులు సైతం ఇస్తున్నారు. తద్వారా ప్రస్తుతానికి హౌస్‌లో రెండు మూడు జంటలు ఉన్నట్లు చూపిస్తున్నారు. అందుకు అనుగుణంగానే వాళ్లు తరచూ రొమాంటిక్‌గా చూసుకుంటూ.. హగ్గులు ఇచ్చుకుంటూ కనిపిస్తున్నారు. దీంతో షోపై ఆసక్తి పెరుగుతూ వస్తోంది.

 అప్పుడే కనెక్ట్ చేస్తూ.. వేరేగా జరిగింది

అప్పుడే కనెక్ట్ చేస్తూ.. వేరేగా జరిగింది

బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా అందులో హమీదా మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అయింది. తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేని ఈ అమ్మడు.. హౌస్‌లో గ్లామర్ షోతో పాటు ఎంతో బోల్డుగా ఉంటూ రచ్చ చేస్తోంది. వాస్తవానికి ఈమె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలోనే అక్కినేని నాగార్జున మేల్ కంటెస్టెంట్లకు సంబంధించిన కొన్ని కళ్లను చూపించి ఏది కావాలని అడిగాడు. దీనికి ఒక పిక్చర్‌ను ఆమె సెలెక్ట్ చేసుకుంది. అవి ప్రముఖ మోడల్ జస్వంత్‌వి. లోపల వీళ్లిద్దరూ కలుస్తారని అంతా అనుకున్నారు. కానీ, అలా మాత్రం జరగలేదు.

 వాళ్లిద్దరి మధ్య ట్రాక్... ప్లాన్ ప్రకారమే

వాళ్లిద్దరి మధ్య ట్రాక్... ప్లాన్ ప్రకారమే

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మేల్ కంటెస్టెంట్లలో సింగర్ శ్రీరామ చంద్ర ఒకడు. హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకుంటోన్న ఈ కుర్రాడు.. బోల్డ్ బ్యూటీ హమీదాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అలాగే, తరచూ రొమాంటిక్‌గా చూస్తూ మాట్లాడుతున్నాడు. అతడికి అనుగుణంగానే హమీదా కూడా ప్రతిస్పందిస్తోంది. ఇక, ఇటీవలే వీళ్లిద్దరూ కలిసి మసాజ్‌లు చేసుకున్నారు. అలాగే, తాజా ఎపిసోడ్‌లో ఈ జంట రొమాంటిక్ డ్యాన్స్‌తో ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్లకు భారీ షాకిచ్చింది.

 పర్సనల్ విషయాలపై లేడీస్ చర్చ

పర్సనల్ విషయాలపై లేడీస్ చర్చ

బిగ్ బాస్ కంటెస్టెంట్లలో ఆర్జే కాజల్ ప్రతి ఒక్కరి పర్సనల్ విషయాలను తెలుసుకోడానికి ప్రయత్నాలు జరుపుతూనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా మందిని వాళ్ల మనసులో ఉన్న కంటెస్టెంట్ల గురించి చెప్పమని కోరింది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆనీ మాస్టర్, ఉమాదేవితో కలిసి ఆమె హమీదా గురించి చర్చలు జరిపింది. ఆ సమయంలో 'నిన్ను శ్రీరామ్, సన్నీ కూడా ఇష్టపడుతున్నారు' అని వాళ్లు హమీదా చెప్పారు. అప్పుడామె మాత్రం వాళ్లిద్దరి గురించి తన అభిప్రాయాలను ఆ ముగ్గురు కంటెస్టెంట్లతో పంచుకుంది. ఇది హైలైట్ చేసి చూపించారు.

Recommended Video

Street Light Movie Trailer Launch By Senior Actor Vinod Kumar
వాడిని వాడుకుని వదిలేయ్ అంటూ

వాడిని వాడుకుని వదిలేయ్ అంటూ

శ్రీరామ్, సన్ని గురించి చర్చ జరుగుతోన్న సమయంలో హమీదా 'శ్రీరామ్ హ్యాండ్సమ్ పర్సన్. నాతో బాగుంటాడు. సన్నీ మాత్రం అలా కాదు' అని అంటుంది. కానీ, వాళ్లు మాత్రం 'సన్నీ కూడా నీకు ట్రై చేస్తున్నాడు' అని చెబుతారు. ఆ సమయంలో హమీదా 'శ్రీరామ్ మాత్రమే నాతో క్లోజ్. తన గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి' అని అంటుంది. అప్పుడు ఉమాదేవి కలుగజేసుకుని 'హమీదా ఒక్కటి చెప్పనా.. శ్రీరామ్‌ను కొన్ని రోజులు వాడుకో.. అంటే హౌస్‌లో క్లోజ్‌గా ఉండు. ఆ తర్వాత పోరా దొబ్బెయ్ అను' అని సలహా ఇస్తుంది. కానీ, ఆమె మాత్రం ఇది పట్టించుకోదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X