twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జునని టార్గెట్ చేసిన సన్నీ ఫ్యాన్స్.. వరస్ట్ హోస్ట్ అంటూ.. దారుణంగా ట్రోలింగ్?

    |

    బిగ్‌బాస్‌ తెలుగు 5 ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే బిగ్బాస్ సీజన్ ఫైవ్ లో పది వారాల పూర్తిగా పదిమంది హౌస్మేట్స్ కూడా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఇప్పుడు హోస్ట్ నాగార్జునపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం ఎపిసోడ్‌లో ఆయన ఇచ్చిన తీర్పులు, సన్నీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం నేపథ్యంలో నాగ్‌ ను టార్గెట్ చేస్తున్నారు సన్నీ ఫ్యాన్స్. ఆ వివరాల్లోకి వెళితే

    మూడు ఎఫ్ ఐ ఆర్ లు

    మూడు ఎఫ్ ఐ ఆర్ లు

    గత వారం హౌస్ లో జరిగిన కొన్ని కారణాల నేపథ్యంలో షణ్ముఖ్‌, సన్నీ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. శనివారం నాడు దోషి ఎవరో తేల్చాలని నిర్ణయించే ఎఫ్‌ఐఆర్‌ టాస్క్ లో ఎక్కువగా మూడు ఎఫ్‌ఐఆర్‌లు సన్నీ మీదనే నమోదయ్యాయి. దీంతో అతన్ని నేరస్తుడిగా నిర్ణయిస్తూ సన్నీ మెడలో గిల్టీ బోర్డ్ వేశారు నాగార్జున. కానీ సన్నీని దోషిగా తేల్చడం.మీద సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్సీ టాస్క్ లో జరిగిన వ్యవహారంలో రవి, షణ్ముఖ్‌, సిరి.. సన్నీని నేరస్తుడిగా ముద్ర వేశారు.

    పెద్ద చర్చ

    పెద్ద చర్చ

    టాస్క్ లో సన్నీ మాట్లాడిన వ్యాఖ్యలను ఎత్తిచూపుతూ అతన్నే దోషిగా నిర్ణయించారు. అక్కడ తన తప్పేం లేదని, వాళ్లు రెచ్చగొడితేనే తాను అలా రియాక్ట్ అయ్యాయని, తన జోలికి రాకపోతే తాను ఎవరి జోలికి వెళ్లను అని స్పష్టంగా చెబుతున్నా సరే సిరితో వాగ్వాదం సమయంలో తంతా, అప్పడం అయిపోతావు, ఆడవాళ్లని అడ్డుపెట్టుకుని ఆడుతున్నారనే వ్యాఖ్యలను రవి, సిరి, షణ్ముఖ్‌ సహా అనీ మాస్టర్‌ తప్పు పట్టారు. ఈ విషయంలోనే శనివారం ఎపిసోడ్‌లో మరోసారి సభ్యులకు పెద్ద చర్చ జరిగింది.

    సన్నీదే తప్పు

    సన్నీదే తప్పు

    ఆ పదాలు సన్నీ నుంచి వచ్చిన నేపథ్యంలో హోస్ట్ నాగార్జున కూడా సన్నీదే తప్పు అని నిర్ణయించాడు. అయితే అక్కడ ఏం జరిగింది, సన్నీ ఏం అన్నాడు అనేది క్లారిటీ రావడం కోసం వీడియో కూడా నాగ్‌ చూపించి దాని తర్వాత కూడా తంతా అనే పదాన్ని .. ఫస్ట్ సిరినే అన్నావు అని, ఆ తర్వాత మాట మార్చావు అని తేల్చారు. మరో వైపు అప్పడం అని, అప్పడాన్ని అమ్ముతా అనే పదాలు కూడా తప్పు అని, అమ్మాయిని పట్టుకుని అలా అనొచ్చా అంటూ రవి, షణ్ముఖ్‌తోపాటు నాగార్జున కూడా విరుచుకు పడ్డారు.

     నాగార్జునను టార్గెట్ చేసి

    నాగార్జునను టార్గెట్ చేసి

    ఈ విషయం మీద సన్నీ ఫ్యాన్స్ నాగార్జునను టార్గెట్ చేస్తున్నారు. వీడియోల్లోనూ స్పష్టంగా సన్నీ అన్న మాటల ఉద్దేశం కన్పిస్తుందని, సన్నీ రెచ్చగొడితేనే రియాక్ట్ అయ్యాడని, తంతా అన్నది బ్రిక్స్ నే అని, అప్పడం అయిపోతావనే అన్నది తనని పట్టుకున్నందుకే, అప్పడం అమ్ముతా అన్నది కూడా సిరి అమ్ముకో పో అంటేనే అని, అందులో సన్నీ తప్పేం లేదని, వాళ్లు రెచ్చగొడితేనే రియాక్ట్ అయ్యాడని అంటున్నారు. ఈ విషయంలో నాగార్జున న్యూట్రల్ గా ఉండి న్యాయం చెప్పాల్సింది పోయి, సన్నీని దోషిగా తేల్చడం కరెక్ట్ కాదని, షణ్ముఖ్‌, సిరిలకు సపోర్ట్ చేస్తూ సన్నీని తప్పుపట్టడం సరికాదని చెబుతూ నాగార్జునని ఇప్పుడు ట్రోల్‌ చేస్తున్నారు.

    Recommended Video

    Actor Harshavardhan Funny Interview With Raja Vikramarka Crew
     హోస్ట్ గా అన్ ఫిట్

    హోస్ట్ గా అన్ ఫిట్

    ముఖ్యంగా ఈ బిగ్‌బాస్‌ షోకి నాగార్జున హోస్ట్ గా అన్‌ఫిట్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సరైన తీర్పు ఇవ్వడంలో నాగార్జున విఫలమయ్యాడని, వరస్ట్ హోస్ట్ నాగార్జున అంటూ ట్రెండ్ చేశారు. ఇలాంటి పక్షపాతం లేకుండా ఉండాల్సిన నాగ్‌ షణ్ముఖ్‌, సిరిలనే సపోర్ట్ చేస్తున్నారంటూ సన్నీ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇదే విషయాన్ని టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.

    English summary
    VJ Sunny fans targets host Nagarjuna for taking biased decisions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X