Bigg Boss: పింకీ మానస్ రిలేషన్‌పై పెదవి విప్పిన సన్నీ.. తప్పుగా అనుకోవద్దు అంటూ అతడి ముందే!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని.. అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ.. నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోన్న ఏకైక షో బిగ్ బాస్. ఈ ఉత్సాహంతో నిర్వహకులు ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఏకంగా నాలుగు సీజన్లను పూర్తి చేసేశారు. ఈ క్రమంలోనే ఈ మధ్యనే ఐదో దాన్ని కూడా మొదలెట్టారు. ఇందులోకి చాలా మంది కంటెస్టెంట్లుగా వచ్చారు.. వారిలో ప్రత్యేకంగా నిలిచింది మాత్రం టాన్స్‌జెండర్ ప్రియాంక సింగే. ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ బరువైన బాధ్యతను తలకెత్తుకున్న ఆమె.. ఆటలో సత్తా చాటుతోంది. కానీ, మానస్‌తో వ్యవహరించే తీరుతో విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో వాళ్లిద్దరిపై సన్నీ పెదవి విప్పాడు. ఆ సంగతులు మీకోసం!

అన్నీ చూపిస్తూ.. మజాను పంచుతూ

అన్నీ చూపిస్తూ.. మజాను పంచుతూ


ఇండియాలోని చాలా భాషల్లో బిగ్ బాస్ షో ప్రసారం అయినా తెలుగులో వచ్చే షోకు మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. సామాన్యులే కాదు.. దీనికి సెలెబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయారు. ఫలితంగా ఈ షోపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఐదో సీజన్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో గతంలో కంటే కొత్త కంటెంట్ ఉండడంతో పాటు ఎన్నో రకాల ఎమోషన్స్ చూపిస్తున్నారు. దీంతో ఈ సీజన్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా మారుతూ మజాను పంచుతోంది. దీంతో రేటింగ్‌ను కూడా అందుకుంటోంది.

ఆమె మాత్రం స్పెషల్ కంటెస్టెంట్‌గా

ఆమె మాత్రం స్పెషల్ కంటెస్టెంట్‌గా

ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో ప్రియాంక సింగ్ అలియాస్ జబర్ధస్త్ సాయితేజ స్పెషల్ అట్రాక్షన్ అయిన విషయం తెలిసిందే. జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ మంచి గుర్తింపును అందుకున్న సాయితేజ.. జెండర్‌ను మార్చుకోవాలన్న కోరికతో ఆ తర్వాత సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు. ఆ సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి సమయంలో ప్రియాంక సింగ్‌కు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అలా ఆరంభంలోనే హైలైట్ అయింది.

మంచి పేరు తెచ్చుకున్న ప్రియాంక

మంచి పేరు తెచ్చుకున్న ప్రియాంక

ప్రియాంక సింగ్ బిగ్ బాస్ హౌస్‌లోకి ట్రాన్స్‌జెండర్‌గా ఎంట్రీ ఇచ్చింది. గతంలో తమన్నా సింహాద్రి కూడా ఇలాగే ప్రవేశించినా.. తన వివాదాస్పద తీరుతో విమర్శలను ఎదుర్కొంది. అయితే, పింకీ మాత్రం హౌస్‌లోకి ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. చక్కని కట్టుబొట్టుతో ఆడవాళ్లే ఈర్శ పడేంత అందంగా తయారవడంతో పాటు హుందాగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి ఆమెకు భారీ స్థాయిలో సపోర్టు కూడా లభిస్తోంది. ఈ కారణంగానే ఆమె ఇప్పటికే పలుమార్లు ఎలిమినేషన్‌ దాటేసింది.

అతడిపై ప్రేమను ఒలకబోస్తోందిగా

అతడిపై ప్రేమను ఒలకబోస్తోందిగా

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే ప్రియాంక పలు రకాలుగా ఫోకస్ అవుతోంది. ఆమె రూపం, ఆట తీరుకు చాలా మంది ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సైతం ఆమెకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈమె ఆరంభం నుంచే మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. దీంతో వీళ్ల వింత ట్రాక్ కూడా హైలైట్ అవుతూ ఉంది. దీన్ని బిగ్ బాస్ నిర్వహకులు మరింత ఫోకస్ చేస్తూ చూపిస్తున్నారు. ఫలితంగా వీళ్లిద్దరి ట్రాకును ప్రేక్షకులు ఇష్టపడడం లేదు. దీంతో ప్రియాంక సింగ్‌పై విమర్శలు వర్షం కురుస్తోంది.

అందరూ అలా.. మానస్ మాత్రమే

అందరూ అలా.. మానస్ మాత్రమే

బిగ్ బాస్ షోలో చూపించే లవ్ ట్రాకులు ఎంతగానో హైలైట్ అవుతుంటాయి. ప్రతి సీజన్‌లోనూ ఇలాంటివి ఎక్కువగా చూపిస్తున్నారు. ఈ సారి కూడా ఎవరు జంటలుగా మారతారోనన్న ఆసక్తి అందరిలో కనిపించింది. కానీ, ప్రియాంక సింగ్ వ్యవహారాన్ని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఆమె మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నించడంతో కంటెస్టెంట్లు ఆట పట్టిస్తున్నారు. అదే సమయంలో తెగ అల్లరి చేస్తున్నారు. ఇక, ఈ విషయంలో మానస్ మాత్రం ఎంతో సెటిల్డ్‌గా ఉంటున్నాడు. ప్రియాంకకు వీలైనంత స్పేష్ మాత్రమే ఇస్తూ హుందాగా వ్యవహరిస్తున్నాడు.

ఈ రిలేషన్‌పై పెదవి విప్పన సన్నీ

ఈ రిలేషన్‌పై పెదవి విప్పన సన్నీ

రోజులు గడుస్తోన్న కొద్దీ బిగ్ బాస్ హౌస్‌లో ప్రియాంక సింగ్ వ్యవహరించే తీరు శృతి మించిపోతోంది. ఎప్పుడూ మానస్‌తోనే ఉంటూ.. అతడి కోసమే ఆడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్రేక్షకులే కాదు.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు కూడా ఈ అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో వీజే సన్నీ 'నువ్వేమీ అనుకోనంటే ఓ మాట చెప్తా. పింకీ ఎప్పటికీ నీ జోన్‌లోనే ఉంటోంది. నీ ధ్యాసలో తన ఆట ఆడడం లేదు. అందరూ ఇలాగే అనుకుంటున్నారు. నీ ఆట నువ్వు ఆడు అని ఆమెకు చెప్పాను కూడా' అంటూ మానస్ ముందే పెదవి విప్పాడు.

Recommended Video

Naga Shaurya Making Fun | Varudu Kavalenu Team Interview
మానస్ రియాక్షన్.. చేయడం లేదు

మానస్ రియాక్షన్.. చేయడం లేదు

సన్నీ అన్న మాటలకు మానస్‌ కూల్‌గా సమాధానం ఇచ్చాడు. 'నువ్వు చెప్పడమే కాదు.. ఆమె ఎవరి మాటా వినదు. తాను చేయాలనుకుందే చేస్తుంది. నువ్వు చెప్పినప్పుడు కూడా సరే అన్నయ్య అంటుంది. కానీ ఆ వెంటనే పోరా బచ్చాగా అని లైట్‌ తీసుకుంటుంది. అయినా నేను ఆమె ఆటను అస్సలు డిస్టర్బ్ చేయడం లేదు. ఇప్పటికే లోబో, విశ్వ, రవిలు ఈ విషయం గురించి ఆమెకు చెప్పారంట. అయినా తనకు తెలియడం లేదు. అందుకే ఇలా బిహేవ్ చేస్తుంది' అంటూ క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి వీళ్లిద్దరి వ్యవహారం ప్రేక్షకులకే కాదు.. ఇంట్లో వాళ్లకూ వెగటు పుట్టిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X