For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6 Voting: ఇనయా బౌన్స్ బ్యాక్.. మళ్ళీ ఫస్ట్ లో అతడే.. రాయల్ బేబీ డౌన్

    |

    బిగ్ బాస్ తెలుగు షో 6వ సీజన్ మొదలైనప్పుడు చాలా నీరసంగా అనిపించింది. రెండోవారంకు వచ్చేసరికి కూడా ఆడియన్స్ పెద్దగా అట్రాక్ట్ అనిపించే విధంగా కంటెస్టెంట్స్ అయితే కనిపించలేదు. ఇక మూడో వారం ఎప్పుడైతే నాగర్జున కోటింగ్ ఇచ్చారో అప్పటినుంచి కూడా కంటెస్టెంట్స్ అందరూ కూడా ట్రాక్ లోకి వచ్చేసారు. దీంతో ఇప్పుడు వీక్షకుల సంఖ్య కూడా పెరిగింది. ఇక కంటెస్టెంట్స్ కు ఓట్లు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం వరకు వచ్చిన ఓట్ల వివరాలు ఏ విధంగా ఉన్నాయి. ఎవరు టాప్ లో ఉన్నారు? అనే వివరాల్లోకి వెళితే..

    మళ్ళీ మొదటికి వచ్చిన రేవంత్

    మళ్ళీ మొదటికి వచ్చిన రేవంత్

    రేవంత్ అయితే టాప్ లిస్టులో కొనసాగుతున్నాడు. అతనికి గతవారం ఓట్ల సంఖ్య తగ్గినప్పటికీ ఇప్పుడు మాత్రం టాస్క్ లలో చాలా బలంగా పోరాడుతూ మళ్ళీ తన నెంబర్ వన్ ర్యాంకును సంపాదించుకున్నాడు. ఇప్పుడు అందరికంటే ఎక్కువగా అతనికి ఓట్లు పడుతున్నాయి. ఆ తర్వాత ఊహించని విధంగా రెండవ స్థానంలో కీర్తి ఉండడం విశేషం.

    ఇనయా బౌన్స్ బ్యాక్

    ఇనయా బౌన్స్ బ్యాక్

    రేవంత్ తర్వాత ఎప్పుడూ కూడా అత్యధిక ఓట్లు అందుకుంటున్న వారిలో శ్రీహన్ అయితే రెండవ స్థానంలో ఉంటున్నాడు. కానీ ఈ వారం అతని రేంజ్ మూడవ స్థానానికి పరిమితం కావడం విశేషం. ఇక ఆఖరి స్థానంలో గత రెండు వారాలు కొనసాగిన ఇనయా సుల్తానా ఈ వారం ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది. దీంతో అత్యధిక ఓట్లు అందుకుంటున్న వారిలో ఆమె ఇప్పుడు నాలుగో స్థానంలో ఉంది.

    తగ్గిన ఓట్లు

    తగ్గిన ఓట్లు

    ఇక అర్జున్ కూడా ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల్లో మద్దతును పెంచుకుంటున్నాడు. అతనికి కూడా ఓట్లు పెరగడంతో ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాడు. అయితే ఊహించని విధంగా ఆర్జె సూర్య మాత్రం మళ్ళీ ప్రేక్షకుల్లో ఓట్లు తగ్గించుకుంటున్నాడు. ఇప్పుడు అతను 6వ స్థానంలో ఉండడం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.

    గీతూ రాయల్ - రాజ్

    గీతూ రాయల్ - రాజ్

    గీతూ రాయల్ ప్రతివారం కూడా తనే హైలెట్ అయ్యే విధంగా ఏదో ఒక గొడవతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. కానీ ఆమె అనవసరంగా నోరు పారేసుకుంటుంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఈసారి అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో ఆమె ఏడవ స్థానంలో కొనసాగుతుండగా ఆమె తరువాత ఎనిమిదవ స్థానంలో రాజశేఖర్ కొనసాగుతున్నాడు.

    చివరలో..

    చివరలో..

    సుదీప ఏదో ఒక విధంగా జనాల ఫోకస్ తనపై పడే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరితో కూడా ఇటీవల చాలా గట్టిగానే మాట్లాడుతూ కనిపించింది. కానీ జనాల మద్దతు మాత్రం ఆమెకు ఎక్కువగా పెరగడం లేదని అనిపిస్తోంది. దీంతో ఇప్పుడు అందరికంటే తక్కువ స్థాయిలో ఓట్లు అందుకుంటూ తొమ్మిదవ స్థానంలోకి పడిపోయింది. ఇక ఆమె తర్వాత చివరి స్థానంలో అంటే పదవ స్థానంలో అతి తక్కువ ఓట్లు అందుకున్న కంటెస్టెంట్ గా ఈవారం ఆరోహి నిలిచింది.

    English summary
    Bigg Boss Telugu season 6 latest voting results 30th september updates
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X