twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6 Voting: సైలెంట్ గా టాప్ పొజిషన్ లోకి ఆ కంటెస్టెంట్.. బాలదిత్యా డౌన్!

    |

    బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఓటింగ్ విషయంలో ఎప్పటికప్పుడు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు నెంబర్ వన్ స్థానంలో ఉన్న వారు కూడా ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ చివరి స్థానంలోకి పడిపోతున్నారు. అందుకు కారణం హౌస్ లో నెలకొన్న పరిస్థితులే అని చెప్పవచ్చు. తొందరపడి ఏమాత్రం పొరపాటు చేసినా కూడా ప్రేక్షకులు వారికి మద్దతు ఇవ్వడం లేదు. ఇక అక్టోబర్ 11 వరకు కంటెస్టెంట్స్ ఏ స్థాయిలో ఓట్లు అందుకున్నారు అలాగే అత్యధిక ఓట్లు అందుకున్న వారి స్థానాలను గమనిస్తే..

    మొదటి స్థానంలో

    మొదటి స్థానంలో

    బిగ్ బాస్ తెలుగులో ప్రతివారం నామినేషన్ లో ఉన్నవారు ఓట్ల కోసం ఎక్కువగా ఆరాటపడుతుంటారు. అయితే గత వారం వరకు కూడా రేవంత్ మొదటి స్థానంలో కొనసాగుతూ వచ్చాడు. ఆడియెన్స్ సపోర్ట్ అందరికంటే ఎక్కువగా అతనికే ఉంది. అయితే ఇప్పుడు అతను కెప్టెన్ అయ్యాడు కాబట్టి నామినేషన్ నుంచి తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు శ్రీహన్ మొదటి స్థానంలో ఉండడం విశేషం.

     రెండవ స్థానంలో

    రెండవ స్థానంలో

    ఇక రెండవ స్థానంలో ఎవరు ఊహించిన విధంగా ఆదిరెడ్డి కొనసాగుతున్నాడు. అతను గతవారం ఆడిన మైండ్ గేమ్ కూడా చాలా ఉపయోగపడింది. అనవసరంగా నామినేషన్ చేశారని ప్రేక్షకుల నుంచి కూడా అసహనం వ్యక్తం అవుతుంది. ఇక అతను అత్యధిక ఓట్లు అందుకుంటున్న వారిలో రెండవ స్థానంలో నిలిచి శ్రీహాన్ కు కూడా బలమైన పోటీనే ఇస్తున్నాడు. ఇక అతని తర్వాత మూడవ స్థానంలో కీర్తి కొనసాగుతోంది.

    గీతు, రాజ్

    గీతు, రాజ్

    ఇక అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో గీతూ మెల్లగా తన స్థానాన్ని కోల్పోతోంది. ఆమెకు ఈ వారం కొంత ఓట్లు తగ్గుతున్నట్లు అనిపిస్తోంది. ఇక ఇప్పుడు గీతూ ఈ లిస్టులో నాలుగవ స్థానంలో నిలిచింది. ఆమె తర్వాత ఐదవ స్థానంలో రాజ్ నిలిచారు. ఒక విధంగా అతనికి కూడా మంచి ఓట్లు దక్కుతున్నాయి. కానీ టాస్కులలో అతను మరింతగా బలపడితే మద్దతు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

    శ్రీసత్య, మరియనా

    శ్రీసత్య, మరియనా

    ఇక 6వ స్థానంలో శ్రీ సత్య కొనసాగుతోంది. అర్జున్ తో ఆమె ఒక విభిన్నమైన లవ్ ట్రాక్ తో బాగానే క్రేజ్ అందుకుంటుంది. కానీ కొన్నిసార్లు అనవసరంగా నోటి దురుసు కారణంగా విమర్శలు కూడా మూటగట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఆమె అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో 6వ స్థానంలో నిలిచింది. ఆమె తర్వాత మరియనా ఏడవ స్థానంలో నిలిచింది. ఈమెకు ఈ మధ్య ఓట్లు పెద్దగా ఏమీ రావడం లేదు.

    చివరలో ఆ ఇద్దరు

    చివరలో ఆ ఇద్దరు

    ఇక అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో చివరి రెండు స్థానాల్లో బాలాదిత్యా, సుదీప కొనసాగుతున్నారు. ముఖ్యంగా బాలాదిత్య గతంలో అయితే మంచి ఓట్లను అందుకొని టాప్ పొజిషన్ లో కొనసాగుతూ వచ్చాడు. కానీ ఈసారి అతను చేసిన కొన్ని పొరపాట్లతో చివరి స్థానంలోకి పడిపోయాడు. ఇక సుదిప ఎప్పటిలానే చివరి స్థానంలో కొనసాగుతోంది. ఆమెకు అందరికంటే తక్కువ ఓట్లు పడుతున్నాయి. మరి ఈ వారం అయినా ఎలిమినేషన్ లో ఆమె బయటకు వెళ్లి పోతుందో లేదో చూడాలి.

    English summary
    Bigg Boss Telugu season 6 latest voting results October 11th updates
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X