twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6 Voting: ఊహించినట్లే వాళ్ళు ముగ్గురు చివరలోనే.. టాప్ లో ఉన్నది ఎవరంటే?

    |

    బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ రేటింగ్స్ మళ్లీ తగ్గినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్స్ పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఒక విషయం వైరల్ అవుతోంది. షోకు రేటింగ్ చాలా వరకు తగ్గుతున్నట్లుగా అనుమానాలు వస్తున్నాయి. ఇక మళ్ళీ పుంజుకునే విధంగా బిగ్ బాస్ సరికొత్త ట్విస్ట్ లు అయితే ఇస్తున్నాడు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఓట్లు దక్కించుకునేందుకు బాగానే పోటీపడుతున్నారు. ప్రస్తుతం ఎలిమినేషన్ లో 13 మంది ఉన్నారు. ఇక అక్టోబర్ 20 వరకు కంటెస్టెంట్స్ ఏ స్థాయిలో ఓట్లు అందుకున్నారు అలాగే అత్యధిక ఓట్లు అందుకున్న వారి స్థానాలను గమనిస్తే..

    మొదటి రెండు స్థానాల్లో

    మొదటి రెండు స్థానాల్లో

    ఎప్పటిలానే మొదటి స్థానంలో రేవంత్ కొనసాగుతున్నాడు. అతనికి ప్రతివారం కూడా అందరికంటే ఎక్కువ స్థాయిలో ఓట్లు దక్కుతున్నాయి. అప్పుడప్పుడు అతనికి గీతూ నుంచి కొంత పోటీ ఎదురవుతున్నప్పటికీ కూడా ఈ వారం మాత్రం రేవంత్ డామినేషన్ గట్టిగానే ఉన్నట్లు అనిపిస్తోంది. ఇక అతని తర్వాత శ్రీహాన్ ఎప్పటిలోనే రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. కానీ అతనికి ఈ రెండు మూడు రోజుల్లో కొన్ని ఓట్లు అయితే తగ్గుతున్నట్లు అనిపిస్తోంది.

    టాప్ 5లో

    టాప్ 5లో

    అత్యధిక ఓట్లు అందుకున్న లిస్టులో అయితే ఊహించని విధంగా అర్జున్ మూడవ స్థానంలోకి రావడం విశేషం. కొంతమంది అతనికి పోటీగా ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక శాతం ఓటుతోనే అతను తన స్థానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అతని తర్వాత ఆదిత్య 4వ స్థానంలోకి వచ్చేసాడు. మొన్నటి వరకు ఆదిత్య కు చాలా తక్కువ స్థాయిలో ఓట్లు వచ్చాయి. ఇక ఆదిరెడ్డి కూడా టాప్ 5 లో ఉండేందుకు పోటీ పడుతున్నాడు. అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో ఇప్పుడు అతను 5వ స్థానంలో ఉన్నాడు.

    ఫైమా, కీర్తి

    ఫైమా, కీర్తి

    ఫైమా కూడా ఓట్లు ఎక్కువ స్థాయిలో అందుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. కొన్నిసార్లు ఆమె టాప్ 5 లో కూడా బలమైన పోటీ ఇస్తాంది. ఇక ఈసారి అత్యధిక ఓట్లు అందుకున్న లిస్టులో 6వ స్థానంలో నిలిచింది. ఆమె తర్వాత ఏడవ స్థానంలో కీర్తి కొనసాగుతోంది. కీర్తి గతవారం కూడా టాప్ ఫైవ్ లో నిలిచింది. కానీ ఈసారి మాత్రం ఆమె అనుకున్నంత స్థాయిలో ఇప్పించడం లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

    ఆమె మళ్ళీ డౌన్

    ఆమె మళ్ళీ డౌన్

    ఇక 8వ స్థానంలో అయితే మెరీనా నిలిచింది. ఆమె తన భర్త కంటే కొన్నిసార్లు ఎక్కువ స్థాయిలోనే ఓట్లు దక్కించుకుంటుంది. ఇక తర్వాత ఆమె భర్త రోహిత్ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. అత్యధిక ఓట్లు అందుకుంటున్న లిస్టులో అయితే రోహిత్ తన స్థాయిని పెద్దగా పెంచుకోవడం లేదు. ఇక రోహిత్ తర్వాత 10వ స్థానంలో వాసంతి కొనసాగుతోంది. ఆమె గత రెండు వారాల క్రితం టాప్ ఫైవ్ లో నిలిచినప్పటికీ ఇప్పుడు మళ్లీ ఒకసారి డౌన్ అయిపోయింది.

    చివరి మూడు స్థానాల్లో..

    చివరి మూడు స్థానాల్లో..

    ఇక అత్యధిక ఓట్లు అందుకున్న లిస్టులో చివరి మూడు స్థానాల్లో కొనసాగుతున్న వారి వివరాల్లోకి వెళితే.. ఇనయా సుల్తానా 11వ స్థానంలో కొనసాగుతోంది. శ్రీ సత్య గతంలో టాప్ 5 లో పోటీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ చేసిన పొరపాట్ల కారణంగా జనాలు ఆమెకు పెద్దగా ఓట్లు వేయడం లేదు అని అర్థమవుతుంది. ఇక చివరి 13వ స్థానంలో అయితే రాజశేఖర్ కొనసాగుతున్నాడు. అతను ఇప్పటివరకు అయితే టాప్ కంటెస్టెంట్స్ కి పోటీ ఇచ్చింది లేదు. మరి ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి అతను తప్పించుకుంటాడో లేదో చూడాలి.

    English summary
    Bigg Boss Telugu season 6 latest voting results October 20th updates,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X