twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6 Voting: టాప్ లో ఉన్నవారు ఒక్కసారిగా డౌన్.. రిస్క్ లో పడిన సూర్య!

    |

    బిగ్ బాస్ ప్రతి వారం కూడా నామినేషన్స్ లో ఏదో ఒక ట్విస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. అలాగే వీలైనంతవరకు ఎక్కువ మందిని నామినేషన్ లో టెన్షన్ పెట్టేస్తున్నారు. అలా అయితే కంటెస్టెంట్స్ మరింత తీవ్రంగా పోటీ పడతారు అనే ఆలోచనతోనే బిగ్ బాస్ ఇలా చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇక ఈవారం నామినేషన్స్ లో ఉన్నవారు ఓట్లు అందుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఇక మొత్తంగా ఈ వారం 13 మంది నామినేషన్స్ లో ఉండగా ఎవరెవరు అందులో ఎక్కువ స్థాయిలో ఓట్లు అందుకుంటున్నారు అనే వివరాల్లోకి వెళితే..

    టాప్ 2లో మళ్ళీ ఆ ఇద్దరే

    టాప్ 2లో మళ్ళీ ఆ ఇద్దరే

    ఈ వారం కూడా ఎప్పటిలాగే మళ్ళీ రేవంత్ అందరికంటే కాస్త ఎక్కువ స్థాయిలో ఓట్లు అందుకుంటూ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. గత వారం అతను పొరపాట్లు చేసినప్పటికీ కూడా ఓట్లు మాత్రం తగ్గలేదు. ఇక అందరికంటే ఇంకాస్త ఎక్కువగా ఓట్లు అందుకున్న లిస్టులో శ్రీహన్ కూడా రెండవ స్థానంలోనే కొనసాగుతున్నాడు. వీరిద్దరూ కూడా నిత్యం టాప్ 2 పొజిషన్లో వారి స్థానాలను బలంగా మార్చుకుంటున్నారు.

    టాప్ 5లో మార్పులు

    టాప్ 5లో మార్పులు

    ఇక టాప్ 5 లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఈసారి ఊహించని విధంగా మేరీనా అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో మూడో స్థానంలో నిలవడం విశేషం. ఆమె గత వారం దాదాపు చివరి స్థానంలోనే కొనసాగింది. కానీ ఈసారి మూడవ స్థానంలోకి చేరుకొని గీతూ బలమైన పోటీ ఇచ్చింది. అయితే నెగిటివ్ కామెంట్స్ అందుకుంటున్నప్పటికీ కూడా ఆమెకు ఓట్లు మాత్రం బాగానే పడుతున్నాయి. ఈ వారం గీతూ నాలుగో స్థానంలో నిలిచింది.

    కీర్తి, ఇనయా

    కీర్తి, ఇనయా

    ఇక ఐదవ స్థానంలో కీర్తి ఉండడం విశేషం. గత వారం ఆమె ఏడవ స్థానంలో ఉండగా మళ్లీ ఈ వారం మెల్లమెల్లగా తన ఓట్ల సంఖ్యను పెంచుకుంటూ వచ్చింది. కీర్తి ఈసారి ఐదవ స్థానంలో ఉండగా ఆ తర్వాత ఆరవ స్థానంలో ఇనయా సుల్తానా కొనసాగుతోంది. ఇనాయ సుల్తానాకు కూడా ఈమధ్య కొంత ఓట్లు పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఆమె ఏడవ స్థానంలో కొనసాగుతోంది.

     ఆదిత్య కూడా డౌన్

    ఆదిత్య కూడా డౌన్

    ఇక రోహిత్ గతవారం ఓట్లు బాగానే అందుకున్నప్పటికీ ఈసారి అతను కెప్టెన్సీ టాస్క్ లో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఎనిమిదవ స్థానంకే పరిమితం కావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆదిత్య అయితే ప్రతిసారి తన ఓట్లను తగ్గించుకుంటున్నాడు. ఈ వారం అయితే అతనికి పెద్దగా ఓట్లు పడలేదు. దీంతో ఇప్పుడు ఈ లిస్టులో అతను తొమ్మిదవ స్థానానికి పడిపోయాడు. ఇక వాసంతి అయితే అందరికంటే ఎక్కువ ఓట్లు అందుకున్న లిస్టులో 10వ స్థానంలో కొనసాగుతోంది.

    రిస్క్ లో సూర్య?

    రిస్క్ లో సూర్య?

    ఇక చివరి మూడు స్థానాలను గమనిస్తే రాజశేఖర్ కు ఓట్లు కూడా బాగా తగ్గాయి. గతవారం 5వ స్థానంలో కూడా పోటీ ఇచ్చాడు. కానీ ఈసారి పూర్తిస్థాయిలో ఓట్లు తగ్గిపోతూ వచ్చాయి. శ్రీ సత్యకు కూడా ఈ వారం పెద్దగా ఓట్లు పడలేదు. ఇక చివరి 13వ స్థానంలో సూర్యకు అందరికంటే అతి తక్కువ స్థాయిలో ఓట్లు పడినట్లుగా తెలుస్తోంది. ఇక అతను ఈ వారం రిస్క్ లో పడినట్లే అనే టాక్ కూడా వస్తుంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

    English summary
    Bigg Boss Telugu season 6 latest voting results October 27th updates
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X