Bigg Boss Telugu 6 Voting: నెంబర్ వన్ రేవంత్ కు పోటీగా మరో అమ్మాయి.. ఆమె మళ్ళీ లాస్ట్ లోనే..

బిగ్ బాస్ లో మళ్ళీ పరిస్థితిలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. బలమైన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఎలిమినేషన్ కు దగ్గరగా ఉన్నారు. ఇక వారిలో ఎవరు సేఫ్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ముందు హౌస్ లో నుంచి ఎవరు వెళ్ళిపోతారో సోషల్ మీడియా ఫాలోవర్స్ కు ఒక క్లారిటీ వచ్చేసింది. ఒక పేరు కూడా వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు ఓట్లు అందుకున్న వారిలో ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారు అనే వివరాల్లోకి వెళితే..

రేవంత్ కు పోటీగా..

రేవంత్ కు పోటీగా..


బిగ్ బాస్ మొదటి రెండు వారాల్లో కూడా రేవంత్ టాప్ లిస్టులో కొనసాగుతూ వచ్చాడు. అత్యధిక ఓట్లు అతనికే ఎక్కువగా వచ్చాయి. ఇక మూడో వారం కొంత తగ్గినప్పటికీ ఇప్పుడు నాలుగో వారంలో అతనే టాప్ లో కొనసాగుతున్నాడు. ఇక ఆ తర్వాత కీర్తి అతనికి పోటీగా నిలుస్తోంది. అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో ఆమె రెండవ స్థానంలో కొనసాగుతూ ఉండటం విశేషం. ఆమె తర్వాత శ్రీహన్ కొనసాగుతున్నాడు.

 ఇనయా సుల్తానా..

ఇనయా సుల్తానా..

నామినేషన్ లో ఉన్న వారిలో కొంతమంది గత వారం కంటే ఇప్పుడు ఎక్కువ స్థాయిలో ఓట్లు అందుకుంటు ఉండడం విశేషం. మరోసారి ఎలిమినేషన్ లో ఉన్న వారిలో ఇనయా సుల్తానా ఊహించని విధంగా రోజురోజుకు జనాల్లో మంచి ఆదరణ పెంచుకుంటుంది. ఇప్పుడు ఆమె నాలుగో స్థానంలో కొనసాగుతూ ఉండగా ఆ తర్వాత అర్జున్ ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు.

 అనవసరపు వాదనలతో..

అనవసరపు వాదనలతో..


ఇక 6 వ స్థానంలో గీతూ కొనసాగుతోంది ఆమె గతంలో ఓట్లు భారీ స్థాయిలోనే అందుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం అనవసరపు వాదనలతో జనాల్లో ఆదరణ తగ్గించుకుంటుంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఆమె తర్వాత ఏడవ స్థానంలో ఆర్ జె సూర్య చాలా తక్కువ ఓట్లతో కొనసాగుతున్నాడు. ఎనిమిదవ స్థానంలో రాజశేఖర్ తన ఓట్లు పెంచుకునేందుకు ఎదో ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

చివరి రెండు స్థానాల్లో

చివరి రెండు స్థానాల్లో

ఇక ఇప్పుడు చివరి రెండు స్థానాల్లో ఉన్న వారిలో ఆరోహి సుదీప ఇద్దరు కూడా కొనసాగుతూ ఉండడం విశేషం. అయితే గత వారం కంటే కూడా ఆరోహికి ఈసారి చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయి. అసలు ఆమె గత వారంలో అయితే కొన్నిసార్లు అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో రెండవ స్థానంలో కూడా సాగింది. ఇక ఆమె కంటే తక్కువగా సుదీపకు ఓట్లు పడుతున్నాయి. గత రెండు వారాల్లో అయితే సుదీప కనీసం టాప్ ఫైవ్ లో కూడా చేరుకున్నది లేదు.

 ఆమె ఎలిమినేషన్

ఆమె ఎలిమినేషన్

అత్యధిక ఓట్లు అందుకుంటున్న వారిలో ఈవారం రేవంత్ అయితే టాప్ పొజిషన్లో కొనసాగాడు. ఇక అందరికంటే చివరి స్థానంలో సుదీప కొనసాగుతోంది. అయితే ఈ వారం సుదీప వెళ్ళిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న ఆరోహి ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఆమె కంటే హౌస్ లో పెద్దగా ఆకట్టుకోలేని వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని కాకుండా ఆమెను ఎందుకు బయటకు పంపుతున్నారు అనే వాదన కూడా వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X