For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6 Voting: ఆ కంటెస్టెంట్స్ కు ఒక్కసారిగా తగ్గిన ఓట్లు.. చివరలో ఉన్నది ఎవరంటే?

    |

    బిగ్ బాస్ షో లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. గత రెండు వారాలు అయితే కాస్త నెమ్మదిగా కొనసాగిన బిగ్ బాస్ ఈసారి మాత్రం ఒక్కసారిగా ఊపందుకుంది. రేటింగ్స్ కూడా గత వారం నుంచి పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈసారి హౌస్ లో నుంచి వెళ్లిపోయే కంటెస్టెంట్స్ లిస్టు కూడా గట్టిగానే వైరల్ అయింది. ఊహించిన విధంగా బిగ్ బాస్ ఒకరిని బయటికి పంపే ఆలోచనలో ఉన్నారు. ఇక ఇప్పుడు నామినేషన్స్ లో కొనసాగిన వారిలో ఎవరు ఎక్కువ స్థాయిలో ఓట్లు అందుకున్నారు అనే వివరాల్లోకి వెళితే..

    మూడవ వారం

    మూడవ వారం

    ఇక మూడో వారంలో అయితే నామినేషన్స్ లో మొత్తం పదిమంది కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో ఎవరు ఇంటి నుంచి వెళ్ళిపోతారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ఓట్ల వివరాల్లోకి వెళితే డేంజర్ జోన్ లో ఉన్న ఇద్దరు ముగ్గురు పేర్లు అయితే బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఎవరో ఒకరు వెళ్లిపోవచ్చు అని కూడా గత రెండు మూడు రోజులుగా కథనాలు వెలువడుతున్నాయి.

    టాప్ లో ఇద్దరు

    టాప్ లో ఇద్దరు

    శనివారం వరకు అందిన సమాచారం ప్రకారం అత్యధిక ఓట్లు అందుకున్న లిస్టులో మొదటి స్థానంలో రేవంత్ కొనసాగుతున్నాడు. గత వారం కూడా అతనికి అత్యధిక ఓట్లు వచ్చాయి. ఇక అతని తర్వాత మళ్లీ ఎప్పటిలనే శ్రీహన్ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల అతనికి ఓట్ల సంఖ్య కూడా పెరుగుతుంది.

    రెండు వారాలుగా ఆమె..

    రెండు వారాలుగా ఆమె..

    ఇక మరొకవైపు టాప్ 3 కంటెస్టెంట్ గా గత రెండు వారాలుగా కొనసాగుతున్న ఏకైక కంటెస్టెంట్ గీతూ రాయల్ ఆమెపై కొన్ని నెగటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ కూడా ఓ వర్గం వారి నుంచి మాత్రం భారీ స్థాయిలోనే సపోర్ట్ అయితే అందుకుంటుంది. దీంతో ఆమెకు ఓట్లు కూడా గట్టిగానే పడుతున్నాయి. ఇక నాలుగవ స్థానంలో ఆదిత్య కొనసాగుతున్నాడు.

    వాళ్ళు ముగ్గురు

    వాళ్ళు ముగ్గురు

    ఇక ఇనయా సుల్తానా ఇటీవల కొన్ని పరిణామాల కారణంగా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఏదేమైనప్పటికీ తన నిర్ణయాన్ని బలంగా చెబుతున్న ఈ కంటెస్టెంట్ ఇప్పుడు ఐదవ స్థానంలో కొనసాగుతోంది. ఆమె తర్వాత వాసంతి కొనసాగుతుండగా చంటి ఏడవ స్థానంలో ఉన్నాడు. అతనికి ఇటీవల మళ్ళీ ఓట్లు చాలా వరకు తగ్గిపోయాయి.

     చివరలో..

    చివరలో..

    ఇక చివరి ముగ్గురు కంటెస్టెంట్లలో ఆరోహి ఏడో స్థానంలో కొనసాగుతుండగా ఆమె తరువాత నేహా తొమ్మిదవ స్థానంలో కొనసాగుతోంది. ఇక సుదీప పదవ స్థానంలో అతి తక్కువ ఓట్ల అందుకున్న కంటెస్టెంట్. ఈ ముగ్గురిలో ఎవరు హౌస్ లో నుంచి వెళ్ళిపోతారు అనేది గత వారం నుంచి హాట్ టాపిక్ గా మారుతుంది.

     ఆమె ఎలిమినేట్?

    ఆమె ఎలిమినేట్?

    అయితే మొన్నటి వరకు కూడా వాసంతి లేదా సుదీప ఇద్దరిలో ఎవరో ఒకరు హౌస్ లో నుంచి వెళ్లిపోవచ్చు అని టాక్ అయితే వచ్చింది. ముఖ్యంగా సుదీప కు అత్యధిక తక్కువగా ఓట్లు వస్తూ ఉండటంతో ఆమెను ఎలిమినేట్ చేయవచ్చు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా నేహాను పంపించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇస్తాడో లేదో చూడాలి.

    English summary
    Bigg Boss Telugu 6 week 3 voting results latest updates
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X