Bigg Boss 7 Telugu: వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉల్టా పుల్టా.. హౌస్‌లోకి వెళ్తున్న వారి జాబితా ఇదే!
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సెప్టెంబర్ 3వ తేదీన గ్రాండ్ గా ప్రారంభం అయింది. అయితే ఈ షోలో మామూలుగా 20 మంది ఎంటర్ అవ్వాలి. కానీ ఈసారి ఉల్టా పుల్టా అంటూ కేవలం 14మంది ఎంటర్ అయ్యారు. ఇక ఇప్పటికే ఈ షో నుంచి నలుగురు ఎలిమినేట్ అయిపోయారు. ఇక మిగిలింది కేవలం 10 మంది మాత్రమే ఎంటర్ అయ్యారు. ఇక వారితో మిగతా షో నడిపించడం కష్టమే. ఇక వచ్చే వారం బిగ్ బాస్ 2.ఓ గ్రాండ్ లాంఛ్ కానుంది. ఇక ఈ గ్రాండ్ లాంఛ్ లో వచ్చే జాబితా ఉల్టా పుల్టా అయింది. ఆ వివరాల్లోకి వెళితే...
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్తా పుల్టా రోజుకో ట్విస్టు ఇస్తూ ఆసక్తిగా సాగుతోంది. ఇక ఈ సీజన్ లో 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఇక వీరిలో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్ ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలింది కేవల 10మంది కంటెస్టెంట్స్. అందులో శివాజీ, ఆట సందీప్, శోభా శెట్టి, అమర్ దీప్, శుభ శ్రీ, యావర్, ప్రశాంత్, ప్రియాంక, గౌతమ్, టేస్టి తేజ ఇప్పుడు ప్రసెంట్ హౌజ్ లో ఉన్నారు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో మిగిలింది 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే. ఇక వీరితో మరో పది వారాలు పూర్తి చేయడం కష్టం. ఎందుకంటే పది వారాల్లో ఒక్కక్కకరు ఎలిమినేట్ అవ్వగా లాస్ట్ కు మిగిలేది ఒక్కరు కూడా ఉండరు. ఇక వచ్చే వారం కచ్చితంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 2 పాయింట్ ఓ కచ్చితంగా ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పటికే రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ 2.ఓ.. షూటింగ్ అక్టోబర్ 7న జరగనుంది. ఇక ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ వస్తున్నట్లు పేర్లు వచ్చాయి. అయితే వారి పేర్లు మొత్తం ఉల్టా పుల్టా అయినట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా నిఖిలు వస్తున్నట్లు ప్రచారం జరిగింది. మరి ఈ సారి నిఖిలు రావడం లేదని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ 2.ఓ లో ఇప్పటి వరకు ఆరుగురు కంటెస్టెంట్స్ ఫిక్స్ అయినట్లు.. బిగ్ బాస్ నిర్వాహకుల సమాచారం.

వారిలో సీరియల్ నటుడు అంబటి అర్జున్ ఒకరు ఫిక్స్ అయ్యారు. ఈయన పేరు మొదటి నుంచి వినిపిస్తున్నదే. ఇక రెండోది అంజలి పవన్. ఈయన కూడా సీరియల్ నటుడే. మూడో కంటెస్టెంట్ నయని పావని. నాలుగో కంటెస్టెంట్.. భోలే షవాలి, ఐదో కంటెస్టెంట్.. పూజా మూర్తి. ఆరో కంటెస్టెంట్.. కెవ్యూ కార్తిక్. ఇక ఈ ఆరుగురు పక్కా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ బిగ్ బాస్ 2.ఓ లాంఛ్ షూటింగ్ అక్టోబర్ 7న జరగ్గా.. గ్రాండ్ లాంచ్ మాత్రం అక్టోబర్ 8న ప్రసారం కానుంది. ఇక వీరికి మరికొంత మంది యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక వీరు ఇప్పటికే బిగ్ బాస్ షో చూస్తున్నారు. మరి హౌజ్ లోకి వెళ్లాక వీరు ఎలాంటి స్ట్రాటజీలతో ఆడుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











