BiggBoss Telugu 7 Probable List:బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్​ వచ్చేసింది...ఏరోజు టెలికాస్ట్ కానుందంటే?

మొదట హిందీలో ప్రసారం అయిన బిగ్ బాస్.. ఆ తర్వాత రీజనల్ భాషలకు చేరింది. అయితే తెలుగులో మొదట ఎన్టీఆర్ హెస్టుగా నిర్వహించిన ఈ షో.. సక్సెస్ కావడంతో.. తర్వాత సీజన్స్ కూడా ప్లాన్ చేశారు. అలా ఈ బిగ్ బాస్ ఆరు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఓటీటీ వర్షన్ కూడా పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్... ఇప్పుడు ఏడో సీజన్ తో అలరించేందుకు ముందుకు రాబోతుంది. ఇక ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్టు వచ్చేసింది. దానితో పాటు.. ఏరోజున టెలికాస్ట్ కానుందో వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తెలుగులో అత్యంత ఆదరణ పొందిన షోలలో బిగ్ బాస్ ఒకటి. బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 త్వరలో ప్రసారం కానుంది. ఇక ఈ నేపథ్యంలో రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయితే గత ఆరు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా నడిపిన నిర్వాహకులు ఈసారి మాత్రం ఇంకా కాస్త ఎక్కువ రేంజ్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. నాగ్ కూడా ఈసారి న్యూ ఛాలెంజస్, న్యూ గేమ్ అంటూ ప్రచారం చేస్తున్నారు.

Bigg Boss Telugu Season 7

ఇటీవల రిలీజ్ అయిన బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో చూస్తే.. నిజంగానే ఈ సీజన్ ఊహకు అందకుండా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రోమోలోనే.. చెమటలు పట్టించే ట్విస్టులు చూపించి... ఆసక్తిని పెంచేశారు. గత ఆరో సీజన్ లో విమర్శలు రావడంతో.. ఈ సీజన్ పై గట్టిగా ఫోకస్ పెట్టి పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రోమోలో నాగ్ చెప్పే ఉల్టా పుల్టా అనే డైలాగ్ తో.. ఈసారి కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss Telugu Season 7

ఇక ఈ సీజన్ కోసం.. కంటెస్టెంట్స్ ను కూడా కొత్త వారిని కాకుండా బాగా పేరున్న వారిని తీసుకున్నారని తెలుస్తోంది. గత సీజన్స్ లో... కంటెస్టెంట్స్ జనాలకు తెలియదు. అసలు వీరు ఫేమస్ అవడానికి బిగ్ బాస్ షో కు వస్తున్నారు అనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఈసారి బాగా పాపులర్ వ్యక్తులనే బిగ్ బాస్ సెలెక్ట్ చేసిందట. వారు అయితే షో జనాల్లోకి బాగా వెళ్తుందని తెలుస్తోంది. ఇక ఈ షో లో పాల్గొనే బిగ్ బాస్ ఫుల్ కంటెస్టెంట్స్ లిస్టు ఇదే అని కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్స్ లిస్టు ఇదే అని వైరల్ అవుతుంది. అందులో మొగలి రేకులు సీరియల్ ద్వారా పాపులర్ అయిన సాగర్, జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్, శోభా శెట్టి, విష్ణు ప్రియ, వైష్ణవి చైతన్య, సురేఖ వాణి, సురేఖ వాణి కూతురు సుప్రిత, నవ్య స్వామి, ఈటీవీ ప్రభాకర్, సింగర్ మోహన భోగరాజు, దుర్గారావు దంపతులు, దీపిక పిల్లి, సురేష్ కొండేటి వంటి కంటెస్టెంట్లను బిగ్ బాస్ టీం ఫైనల్ చేసిందట.

Bigg Boss Telugu Season 7

ఇక ఈ షో ఈసారి కొత్తగా ఉండబోతుందని అంటున్నారు. ఇక ఈ బిగ్ బాస్ షో మరో రెండు వారాల్లో బుల్లితెరపై ప్రసారం గ్రాండ్ గా కానుందట. ఈ షో కోసం ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ షో సెప్టెంబర్ 1,2 తేదీల్లో షూటింగ్ జరుపుకుని.. సెప్టెంబరు 3వ తేదీన అంటే ఆదివారం రోజున టెలికాస్ట్ కానుందని తెలుస్తోంది. ఇక బుల్లి తెర ప్రేక్షకులు బీ రెడీ.. బిగ్ బాస్ మిమ్మల్ని టెన్షన్ పెట్టేందుకు వచ్చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X