BiggBoss Telugu 7 Final List: కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ లీక్ చేసిన ఆదిరెడ్డి.. ఎవరెవరు ఉన్నారంటే?
తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ షో వచ్చేస్తోంది. సెప్టెంబర్ 3 వ తేదీన గ్రాండ్ గా ఈ షో ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే ఈ షో ప్రోమో రిలీజ్ అయి.. ఆకట్టుకుంటుంది. ఈసారి కూడా హోస్టుగా నాగార్జున చేయనున్నారు. అయితే ఈషోలో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్టును లీక్ చేశారు గత సీజన్ ఆదిరెడ్డి. ఇక ఈ లిస్టులో ఎవరెవరూ ఉన్నారంటే...
తెలుగులో ప్రత్యేక ఆదరణ పొందిన షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ రియాలిటీ షో ఆరు సీజన్స్ పూర్తి చేసుకోగా.. 7 వ సీజన్ సెప్టెంబర్ 3 వతేదీన ప్రారంభం కానుంది. ఇక ఈ షోలో కంటెస్టెంట్స్ లిస్టును.. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ ఆదిరెడ్డి లీక్ చేశాడు. తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా వారి వివరాలను వెల్లడించారు. ఇక ఇందులో ఎవరెవరు ఉన్నారు.. ఎంతమంది సెలబ్రెటీలు ఉన్నారు చూద్దాం.

ఈ లిస్టులో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు అమర్ దీప్ చౌదరి. ఈయన జానకీ కలగనలేదు సీరియల్ లో మొన్నటి వరకు అలరించారు. ఇక ఈ సీరియల్ ఇటీవల ముగింపు పడింది. 2016లోనే పరిణయం అనే షార్ట్ ఫిల్మ్‌తో నటనా జీవితాన్ని ప్రారంభించిన అమర్ దీప్... ఉయ్యాల జంపాలా సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. మరి ఆయన సీరియల్ నటి తేజస్వనితో వస్తారు అనే వార్తలు రాగా... ఇప్పుడు ఈయన ఒక్కరే వస్తారని తెలుస్తోంది.
అనీల్ గీల.. ప్రముఖ యూట్యూబర్. అనీల్ గీల ఎక్కువగా గంగవ్వతో కనిపిస్తూ ఉంటాడు. దీని వల్లే ఆయన బిగ్ బాస్ కళ్లలో పడి.. ఎంటర్ అవబోతున్నాడు. యాంకర్ ప్రత్యూష. టీవీ 9లో యాంకర్ గా కొనసాగింది. ఈమెతో పాటు... అంజలీ పవన్ రాబోతుంది. ఈమె పలు సీరియల్స్ లో నటించడమే కాకుండా... లెజెండ్, ఒక లైలా కోసం సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈవిడ భర్తతో కలిసి నీతోనే డాన్స్ షో లో చేస్తున్నారు.
ఆటా సందీప్ (డ్యాన్స్ మాస్టర్), ప్రియాంక జైన్ ( జానకీ కలగనలేదు సీరియల్ ఆర్టిస్టు) రీసెంట్ గా నీతోనే డాన్స్ అనే షోలో తన బాయ్ ఫ్రెండ్ శివాతో పార్టిసిపేట్ చేసింది. పూజా మూర్తి (సీరియల్ నటి) , రియాజ్(కమెడియన్) , ప్రిన్స్ యావర్ (మోడల్), శీతల్ గౌతమన్ ( య్యూటుబర్, వెబ్ సీరిస్ నటి), మహేష్ ఆచంట (కమెడియన్), శోభ శెట్టి (కార్తిక దీపం మౌనిత), దామిని బాట్ల( సింగర్), సాగర్( మొగలి రేకులు ఫేం), బుల్లెట్ భాస్కర్( జబర్దస్త్ కమెడియన్) వంటి వారు ఉన్నారు.

ఇక వీరితో పాటు... పల్లవి ప్రశాంత్ (యువ రైతు), షకీలా ( నటి), తేజ (టేస్టీ తేజ యూట్యూబర్), జబర్దస్త్ నరేష్, గౌతం కృష్ణ (డాక్టర్ కం ఆకాశ వీధిలో హీరో), జబర్దస్త్ కెవ్వు కార్తిక్, హీరో అబ్బాస్, బోలే షావలి (మ్యూజిక్ డైరెక్టర్), హీరోయిన్ ఫర్జానా ( తెలుగు, తమిళ సినిమాల హీరోయిన్), శుభశ్రీ రాయగురు (అమిగోస్ ఫేం), యాక్టర్ క్రాంతి ( నెంబర్ వన్ సీరియల్ ఫేం) వంటి వారు రాబోతున్నట్లు ఆదిరెడ్డి చెప్పుకొచ్చారు.
ఇక ఈ 24 మంది కంటెస్టెంట్స్ లో 19 లేదా 20 మంది సెప్టెంబర్ మూడో తేదీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అడుగుపెట్టే అవకాశం ఉందని చెప్పారు. మిగతా వాళ్లలో కొంతమంది వైల్డ్ కార్డులుగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











