బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. కంటెస్టెంట్​ల లిస్ట్​ ఇదే... సెలబ్రిటీలు ఎవరున్నారంటే?

తెలుగులో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. త్వరలోనే తెలుగులో సీజన్ 7 షురూ అవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ షోకు సంబంధించి రోజుకో వార్త ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతన్న సంగతి తెలిసిదే. తాజాగా ఈ ఏడో సీజన్​లో ఎవరెవరు పాల్గొననున్నారు? రానున్న సెలబ్రిటీలు ఎవరు? సహా పలు విషయాలపై జోరుగా చర్చ సాగుతోంది. పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చాయి. వివరాళ్లోకి వెళితే..

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్​గా వచ్చిన మొదటి సీజన్ బిగ్​ బాస్​.. తెలుగులో ప్రేక్షకుల మనసు దోచుకున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్​ సూపర్ హిట్ అవ్వడం వల్ల.. నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఓ సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తూ షోను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే 6 రెగ్యులర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది మంచి సక్సెస్​ను అందుకుందీ షో.

biggbosstelugu7

ట్విస్టులతో ఆరో సీజన్ : ఆరో సీజన్​ మంచి ట్విస్టులతో సాగింది. మంచి ఉత్కంఠతను కలిగించింది. గత సీజన్లలో ఎప్పుడూ చూడని, సరికొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి ఈ ఆరో సీజన్​ను విజయంవంతంగా పూర్తి చేశారు. ఎన్నో ట్విస్టులతో, ఊహించని సంఘటనలతో, అరుపులు, గొడవలు, ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్, రొమాన్స్, వెటకారాలతో షోనూ సాగించారు. ఇక ఆరో సీజన్ ఫినాలే కూడా ట్విస్ట్ తోనే పూర్తైంది. అయితే ఈ ఆరో సీజన్​ ఎలిమినేషన్స్, అలాగే కంటెస్టెంట్స్​కు అన్యాయం జరిగిందన్న విమర్శలు తెగ వచ్చాయి. దీంతో ఆరో సీజన్​పై కాస్త నెగిటివిటీ వచ్చింది.

biggbosstelugu7

పాతవారికి అవకాశం ఉందా : ఆరో సీజన్ నెగటివ్ ఎఫెక్ట్ వల్ల 7వ సీజన్​ను పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు షో నిర్వాహకులు. అయితే కొత్త సీజన్‌లో గత సీజన్లలో పాల్గొన్న పాత కంటెస్టెంట్లను తీసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. వీరిలో మిత్ర, ఆదర్శ్, నోయల్ సహా పలువురు ఉన్నారని కథనాలు వస్తున్నాయి. అయితే అందులో నిజం లేదని తెలిసింది. ప్రస్తుత సీజన్‌లో సురేఖా వాణి, ఆమె కూతురు, టీవీ 9 యాంకర్ ప్రత్యూష, యూట్యూబర్ నిఖిల్, వర్షిణి, దీపికా పిళ్లై, సీనియర్ ఉదయ్ భాను రానున్నారని సమాచారం అందింది. కానీ ఈ కంటెస్టెంట్​ల లిస్ట్​పై కూడా సందేహాలు ఉన్నాయి.

biggbosstelugu7

వీళ్లు పాల్గొనేందుకు ఎక్కువ ఛాన్స్​ : శ్వేతా నాయుడు, యాంకర్ ధనుశ్​, శోభితా శెట్టి.. ఈ సారి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జబర్దస్త్ షో నుంచి ఒకరు కచ్చితంగా వస్తారని ఇన్​సైడ్​ టాక్. విదేశాల్లో ఉంటూ ఫేమస్​ అయిన ఓ మహిలా యూట్యూబ్ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలిసింది. ఇన్ స్టాలో రీల్స్, యూట్యూబ్​తో ఫేమసైన మరో లేడీ కంటెస్టంట్ పేరు కూడా వినిపిస్తోంది. టీవీ యాక్టర్స్​ అండ్ కపుల్​ అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ కూడా రానున్నారని సమాచారం. అసలు వీరు గత సీజన్​లోనే వస్తారని ప్రచారం సాగింది. కానీ అది అవ్వలేదు. రీసెంట్​గా బాగా పాపులర్ అయినా ఆట సందీప్, జ్యోతి జంట కూడా రావొచ్చు. అలాగే డివొర్స్​ తీసుకున్న ఓ జంటను రప్పించి ఆసక్తి పెంచాలని మేకర్స్ ట్రై చేస్తున్నారట. గతంలో తమిళ బిగ్ బాస్ షోలోనూ ఇలాంటి ప్రయోగం చేశారు. మరి, తెలుగులో ఆ విడిపోయిన జంట ఎవరనేది ఉత్సుకత నెలకొంది.

biggbosstelugu7

బిగ్ బాస్ లోగోపై అసంతృప్తి : ఈసారి బిగ్ బాస్ షో లోగోపై అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారని అంటున్నారు. ప్రతి సారి ఆసక్తిని రేకెత్తించేలా ఉండే బిగ్ బాస్ లోగో ఈసారి అలా లేదని టాక్ వినిపిస్తోంది. ఏదిఏమైనా.. ఆడియెన్స్​లో ఇంట్రెస్ట్ పెంచేందుకు షోనిర్వాహకులు.. చాలా జాగ్రత్తగా ప్లాన్​ చేస్తున్నారని తెలిసింది. చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నారట. సెప్టెంబర్ 3 ఆదివారం నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X