Bigg Boss Telugu 7: హిస్టరీలోనే మొదటి సారి ఇలా... రికార్డు సృష్టించిన తెలుగు బిగ్ బాస్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టాగా సాగుతోంది. ఇక మొదటి నుంచి ఊహకు అందకుండా.. ఉల్టా పుల్టాగా సాగుతుందని నిర్వహకులు చెప్పుకువచ్చారు. ఇక అందుకు తగ్గట్లుగానే ఈ బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. ఇక ఆరువారాలు పూర్తి కావొస్తున్న ఈ షో ఓ చరిత్ర సృష్టించింది. హిస్టరిలోనే ఆ పని చేసి.. బిగ్ బాస్ షో రికార్డు సృష్టించింది. అసలు బిగ్ బాస్ షో సృష్టించిన ఆ రికార్డు ఏంటి.. ఏం చేసింది అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తిగా సాగుతున్న విషయం తెలిసిందే. మొదటి వారం నుంచి ఈ షోపై అందరికీ ఆసక్తి కలిగింది. అంతే కాదు ఇక ఐదో వారంలో అసలైన ఉల్టా పుల్టా ట్విస్టు ఇచ్చి.. వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఇవ్వడంతో ఈ షోపై మరికాస్త ఇంట్రెస్ట్ అందరికీ కలిగింది. అయితే ఈ షో హిస్టరీలోనే మొదటి సారి అలా చేసి రికార్డు సృష్టింది. వరుసగా ఆరుగురు ఫీమేల్ కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేసి.. తెలుగు బిగ్ బాస్ రికార్డు సృష్టించింది.

మొదట హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఇందులో ఏడుగురు ఫీమేల్ కంటెస్టెంట్స్ ఉండగా.. 7 మంది మేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే మొదటి వారంలోనే ఫీమేల్ కంటెస్టెంట్ కిరణ్ రాథోడ్ ను ఎలిమినేట్ చేసి.. బిగ్ బాస్అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక రెండో వారంలో సైతం మరో ఫీమేల్ కంటెస్టెంట్ షకీలాను ఎలిమినేట్ చేసి మరో షాక్ ఇచ్చాడు. అయితే షకీలా ఏజ్డ్ పర్సన్. ఇక హౌజ్ లో ఉండక పోవడం బెటర్ అని భావించిన బిగ్ బాస్.. ఆమెను వెంటనే ఎలిమినేట్ చేసేశాడు.
ఇక మూడో వారం అయితే.. అసలైన ట్విస్టు అని అనుకోవచ్చు. సింగర్ దామినిని ఎలిమినేట్ చేసి.. అందరికీ షాక్ ఇచ్చాడు. ఆమెకు ఓటింగ్ పరంగా ఓట్లు వచ్చినా కానీ ఆమె ఎలిమినేట్ అయింది. దానికి కారణం.. వినాయక చవితి పూజల్లో యావర్ గురించి మత ప్రస్తావన తేవడమే అని తెలుస్తోంది. ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినా.. కులాల గురించి, మతాల గురించి హౌస్ లో మాట్లాడకూడదు. ఆమె ఆ రూల్ బ్రేక్ చేసి... అలా ఎలిమినేట్ అయిందని ఇన్ సైట్ టాక్.

నాలుగో వారంలో అయితే.. రతికా రోజ్ ను ఎలిమినేట్ చేసి.. బిగ్ బాస్ చాలా మందికి షాక్ ఇచ్చాడు. అయితే ఈ భామకు బయట ఉన్న నెగిటివిటీ వల్లే ఎలిమినేట్ అయ్యిందని తెలుస్తోంది. రైతు బిడ్డతో లవ్ ట్రాక్ నడిపి.. ఆ తర్వాత యావర్ తో క్లోజ్ గా ఉండి.. మళ్లీ రైతు బిడ్డను టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలే ఈ భామ ఎలిమినేట్ అయ్యేందుకు కారణాలు అయ్యాయి. ముఖ్యంగా ఈమెపై బయట ట్రోలింగ్ ఎక్కువగా వచ్చింది. ఇక నాల్గోవారంలో ఈ బ్యూటీని బిగ్ బాస్ ఇంటికి పంపేంచేశాడు.
ఇక ఐదో వారంలో మంచి ఆట ఆడినా... శుభ శ్రీని ఎలిమినేట్ అయింది. ఇక ఈ భామకు ఓటీంగ్ తక్కువ రావడంతోనే ఎలిమినేట్ అయిందని తెలుస్తోంది. ఇక ఆరో వారంలో కొత్తగా వచ్చిన పాప నయని పవని ఎలిమినేట్ అయింది. శోభా శెట్టిని కాపాడేందుకు బిగ్ బాస్ ఈ పాపను బలి చేశాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇలా గత ఆరు వారాలుగా బిగ్ బాస్ ఆరుగురు ఫీమేల్ కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేసి.. రికార్డు క్రియేట్ చేశాడు. ఒక విధంగా షోకు మైనస్ కానుందని తెలుస్తోంది. వరుసగా ఆడవాళ్లను ఎలిమినేట్ చేయడం.. సరికాదని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











