Bigg Boss Telugu7 Nominations: రైతుబిడ్డపై అమర్‌దీప్ ఉగ్రరూపం.. నువ్వు వెదవవైతే.. నేను పరమ వెదవని అంటూ...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొత్తానికి రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఇక రెండో వారం కూడా నామినేషన్స్ ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. ఇక ఈ ఎపిసోడ్ లో శివాజీకి జరిగిన నామినేషన్స్ హైలెట్ కాగా... పల్లవిప్రశాంత్ నామినేషన్స్ అయితే.. హౌజ్ లో వార్ జరిగింది. ఇక ముఖ్యంగా అమర్ దీప్ బిగ్ బాస్ హౌజ్ లో ఉగ్రరూపం చూపించారు. ఆ వివరాల్లోకి వెళితే....

హౌజ్ మేట్ గా గుర్తింపబడిన సందీప్ కు.. బిగ్ బాస్ డైరెక్ట్ నామినేషన్స్ ఇవ్వగా.. ఆయన ప్రిన్స్ ను నామినేట్ చేశాడు. ఇక సందీప్ చేసిన ప్రిన్స్ ను మళ్లీ ఎవరు నామినేట్ చేయొద్దని బిగ్ బాస్ చెప్పాడు. ఇక మిగతా కంటెసెంట్స్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ యే నామినేట్ చేస్తే కారణాలు చెప్పాలని చెప్పారు.ఈ ప్రక్రియలో పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేయాలి అనుకునేవారి గురించి పిలుపు వచ్చింది.

Bigg Boss Telugu Season 7 Day 8 Updates Amardeep And Pallavi Prashanth War in Nominations Episode

పల్లవి ప్రశాంత్ ను నామినేషన్స్ ను నామినేట్ చేసేందుకు ఆరుగురు కంటెస్టెంట్స్ వచ్చారు. ఆ నామినేషన్స్ సమయంలో కంటెస్టెంట్స్ చెప్పిన కారణాలు, వారికి ప్రశాంత్ ఇచ్చిన సమాధానాలు గొడవలకు దారితీశాయి. ముఖ్యంగా అమర్‌ దీప్ అయితే పల్లవి ప్రశాంత్‌ ను మట్లాడనివ్వకుండా ఉగ్రరూపం దాల్చి ప్రేక్షకులను అవాక్ అయ్యేలా చేశాడు.

ముందుగా గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, ప్రియాంక, దామిని, షకీలా.. పల్లవి ప్రశాంత్‌ ను పలు కారణాలు చెప్పి నామినేట్ చేసుకువచ్చారు. ప్రియాంక, గౌతమ్ నామినేట్ చేస్తున్న సమయంలో ప్రశాంత్ అయితే తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ఇక సైటెరికల్ గా మాట్లాడటం మొదలు పెట్టగా... ఆ టైం లో శివాజీ కూడా ప్రశాంత్‌ కు మద్దతుగా ముందుకు వచ్చాడు.

Bigg Boss Telugu Season 7 Day 8 Updates Amardeep And Pallavi Prashanth War in Nominations Episode

దీంతో ఇతర కంటెస్టెంట్స్ అంతా ప్రశాంత్‌ దే తప్పు అన్నట్టుగా, అతడి తప్పు ఈరోజు ఒప్పుకోవాల్సిందే అన్నట్టుగా మాట్లాడారు. చివరికి అమర్‌ దీప్ ఎంటర్ అయిన తర్వాత మాత్రం అతడి చెప్పిన పాయింట్స్‌ కు, మాట్లాడిన మాటలకు ప్రేక్షకులతో పాటు ఇతర కంటెస్టెంట్స్ కూడా షాక్ అయ్యారు. అమర్ దీప్ చెప్పిన కారణాలు ఏంటంటే... ఇంటి పనుల్లో ఎక్కువగా కనిపించు అని చెప్పుకు వచ్చాడు. ఆ తర్వాత నీకు రెండు మొహాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఉపయోగిస్తున్న బాడీ లాంగ్వేజ్ ఇంట్లో లేదు. అదే ఇంట్లో చేస్తే ఎంటర్‌ టైన్మెంట్. నువ్వు కూడా ప్రేక్షకులకు సుపరిచితుడివే. నీ వీడియోలు బాగా ట్రోల్ అయ్యాయి అంటూ సీరియస్‌ గా చెప్పడం మొదలుపెట్టాడు.

కానీ పల్లవి ప్రశాంత్ వింటున్న పద్ధతి అమర్‌ దీప్‌ కు నచ్చలేదు. ప్రశాంత్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లా భుజం పెట్టడంతో.. దీంతో భుజం దించు అంటూ బెదిరించాడు అమర్ దీప్. ఎన్నో సీజన్లు చూసి వచ్చావు.. నిజమైన ప్రశాంత్‌ ను చూడాలని ఉందని అమర్‌దీప్ అన్నాడు. అంటే ఫేక్‌ గా ఉన్నానా అని ప్రశాంత్ ప్రశ్నించాడు. సందర్భానికి తగినట్టు అల్లుకుపోతున్నావు. ఎన్నో సీజన్లు పర్యవేక్షిస్తే కానీ ఇలాంటి పర్ఫార్మెన్స్ రాదు అని అమర్‌ దీప్ అన్నాడు.

నీకంటే పెద్ద నటుడిని. నువ్వు వెధవ అయితే నేను పరమ వెధవ అంటూ అమర్ దీప్ కౌంటర్ ఇచ్చాడు. ప్రతీ సారి రైతు బిడ్డ కష్టాలు అంటున్నావు కానీ బీటెక్ కష్టాలు ఇలా ఉంటాయి అంటూ అమర్‌దీప్ చెప్పిన మాటలకు సందీప్, రతిక చప్పట్లు కొట్టారు. రైతుబిడ్డ అనే పదం వాడుతున్నావు అని అమర్‌దీప్ చెప్పగా.. ఆ మాట ప్రశాంత్ అసలు ఒప్పుకోలేదు. ఈ విషయంలో ఇద్దరు గొంతులేపారు. మధ్యలో నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అని ప్రశాంత్ అనగా.. నువ్వు ఇప్పుడు చేస్తుంది అదేనని అమర్‌ దీప్ అరిచాడు,

Bigg Boss Telugu Season 7 Day 8 Updates Amardeep And Pallavi Prashanth War in Nominations Episode

ఎవరి కింద పనిచేయడం ఇష్టం లేక పొలం పనులు చేస్తున్నానని చెప్పాడు ప్రశాంత్. కుక్కలాగా స్టూడియో చుట్టూ తిరిగానని గుర్తుచేసుకున్నాడు. అప్పుడు రతిక.. కుక్కలాగా తిరిగి ఇప్పుడేం చేస్తున్నావు అంటూ ప్రశ్నించింది. దానికి కంటెస్టెంట్స్ చప్పట్లు కొట్టారు. అలా పల్లవి ప్రశాంత్‌కు నామినేషన్స్‌లో 6 ఓట్లు పడ్డాయి. మొత్తానికి నామినేషన్స్ ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X