Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆ రోజు రెండు పండుగలు.. కంటెస్టెంట్స్‌కు సర్ ప్రైజ్ ప్లానింగ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంత ఆసక్తి చూపిస్తుందో అందరికి తెలిసిందే. ఇక బుల్లితెరపై ఈ షో దూసుకుపోతుంది. టీఆర్పీ సైతం బాగానే వస్తుందని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా.. 9 వారాలుగా ఈ షో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ షో దీపావళి ఎపిసోడ్ కోసం బిగ్ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. ఆరోజున కంటెస్టెంట్స్ కు బిగ్ సర్ ప్రైజ్ తో పాటు.. ఎమోషనల్ చేసే విధంగా ప్లాన్ చేస్తుందట. ఇక దీనితో టీఆర్పీతో పాటు.. షోకు మంచి ఆదరణ దక్కుతుందని ప్లాన్. అసలు వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ సీజన్ 7 గత సీజన్స్ కంటే విభిన్నంగా సాగుతుంది. ఇక నిర్వాహకులు చెప్పినట్లుగానే... ఈ షో మొదటి నుంచి ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో... ఆరోజున 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. కిరణ్ రాథోడ్, దామిని, షకీలా, శుభ శ్రీ, రతికా రోజ్, ప్రశాంత్, ప్రియాంక జైన్, గౌతమ్, శివాజీ, అమర్ దీప్, శోభా శెట్టి, ఆట సందీప్, టేస్టీ తేజ, యావర్ ఇలా.. 14 మంది ఎంటర్ అయ్యారు.

Bigg Boss Telugu Season 7 family meet for the contestants on the occasion of Diwali festival

ఇక వీరిలో 5వ వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభ శ్రీ ఇలా ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆరోజున వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా జరిగాయి. అక్టోబర్ 8వ తేదీన అర్జున్ అంబటి, బోలే షవాలి, పూజా మూర్తి, నయని పవని, అశ్విని శ్రీలు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లో అడుగుపెట్టారు. ఇక వీరిలో ఇప్పటి వరకు పూజా మూర్తి, నయని పవని ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఐదుగురులో బోలే, అశ్విని, అర్జున్ మాత్రమే ఉన్నారు.

ఇక ఇటీవల రతికా రోజ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోతే హౌస్ లో శివాజీ, యావర్, ప్రశాంత్, బోలే, అశ్విని, అమర్, ప్రియాంక, శోభా, అర్జున్, గౌతమ్ ఇలా పది మంది మాత్రమే మిగులుతారు. ఇక నెక్ట్స్ వారం నుంచి ఆట రసవత్తరంగా సాగుతూ ఉంటుంది.

Bigg Boss Telugu Season 7 family meet for the contestants on the occasion of Diwali festival

ఇక దీపావళి ఎపిసోడ్ కోసం ఇప్పటికే బిగ్ బాస్ టీమ్ సర్వం సిద్ధం చేస్తుంది. ఆరోజున రెండు పండుగలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఒకటి దీపావళి సెలబ్రేషన్స్ ఉండగా.. హౌస్ లోని కంటెస్టెంట్స్ కోసం.. ఫ్యామిలీ మెంబర్స్ ను పిలిపిస్తున్నారట. వారిని హౌస్ లోకి పంపించి... కంటెస్టెంట్స్ ను ఎమోషనల్ చేయించనున్నారట. అంతే కాదు సెలబ్రేటీలు కూడా వచ్చి కంటెస్టెంట్స్ కోసం సపోర్ట్ చేయనున్నారని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే చాలా మంది సెలబ్రేటీలను పిలిచేందుకు బిగ్ బాస్ టీమ్ వారిని సంప్రదించిందట. అయితే రాహుల్ సిప్లిగంజ్ ను కూడా పిలవాలని ట్రై చేస్తున్నారట. మరీ ఆ రోజున రాహుల్ వస్తే.. రతికా రోజ్ రియాక్షన్ ఏంటనేది ఆసక్తిగా మారుతుంది. మరి దానికోసం అయినా ప్రేక్షకులు చూస్తారు. ఇక టీఆర్పీతో పాటు... షోకు ఆదరణ పెరుగుతుందని బిగ్ బాస్ ఈ విధంగా ప్లాన్ వేశారట. ఏం జరగనుందో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X