Bigg Boss 7 Telugu ఉల్టా పల్టా.. బిగ్‌బాస్‌ను రిజెక్ట్ చేసింది వీరే.. హౌస్‌లోకి వెళ్లిన వారి జాబితా ఇదే..
ఉల్టా పల్టా పేరుతో బిగ్ బాస్ సెవెన్ తెలుగు ప్రసారమయ్యేందుకు రంగం సిద్ధమైపోయింది. ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచి ఈ బిగ్ బాస్ సెవెన్ ప్రసారం కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఇప్పటికే మొదటి ఎపిసోడ్లో ప్రసారం చేసేందుకుగాను ఎంట్రీలకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా... ఫైనల్ లిస్ట్ కూడా దాదాపుగా ఖరారు అయిపోయినట్టుగానే చెబుతున్నారు. ఇక ప్రస్తుతానికి హౌజ్ లోకి ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరు రిజెక్ట్ చేశారనే అనే విషయం మీద ఒక లుక్ వేద్దాం.
ఇప్పటికే విజయవంతంగా తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఏడవ సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది. మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించగా... తర్వాత సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఇక మూడవ సీజన్ నుంచి వరుసగా ఇప్పటివరకు నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఏడవ సీజన్ కి సంబంధించి రానా లేదా నందమూరి బాలకృష్ణ హాస్టల్ గా వ్యవహరించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో మరోసారి నాగార్జుననే ఆ బాధ్యతలను నెత్తిమీద వేసుకున్నాడు

ఇక సోషల్ మీడియా వర్గాలలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈసారి ఫైనల్ లిస్టు ఈ మేరకు ఉంది. ఈసారి సీరియల్ నటుడు అమర్దీప్ చౌదరి, సీరియల్ నటుడు క్రాంతి, సీరియల్ నటి శోభా శెట్టి, మోడల్ ప్రిన్స్ యవర్, సీరియల్ నటి ఐశ్వర్య పిస్సే, సీరియల్ నటి ప్రియాంక జైన్, సీరియల్ నటి శుభశ్రీ, ఒకప్పటి హీరో శివాజీ, ఒకప్పటి హీరోయిన్లు ఫర్జానా, షకీలా నటుడు గౌతమ్ కృష్ణ, జబర్దస్త్ నటుడు యూట్యూబ్ ఫేం తేజ, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా మారుతున్న భోలే షావలి, పల్లవి ప్రశాంత్ గా సోషల్ మీడియాలో రైతు బిడ్డగా తనకు తాను చెప్పుకునే ఒక వ్యక్తిని కామన్ మాన్ గా హౌస్ లోకి వెళ్లారు

వీరు కాకుండా ఆట షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించి ఈమధ్య హీరోగా మారిన ఆట సందీప్ కూడా హౌస్ లోపలికి వెళ్లినట్లు తెలు్స్తోంది. సింగర్ దామినీ, యాంకర్ ప్రత్యూష హీరోయిన్ రితిక నాయక్ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ కూడా హౌస్ లోపలికి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు ఇప్పటివరకు అయితే ఈ లిస్టు ఫైనల్ అయినట్లే చివరి నిమిషంలో అయినా మార్పులు చేర్పులు జరిగితే ఎవరూ చెప్పలేం.

ఇక నిజానికి పూజ మూర్తి, అంజలి పవన్ కూడా హౌస్ లోకి వెళ్లాల్సి ఉంది... కానీ పూజా మూర్తి తండ్రి చనిపోవడంతో షో క్యాన్సిల్ చేసుకుంది. ఇక అంజలి పవన్ రెమ్యూనరేషన్ ఇష్యూ వల్ల చివరి నిమిషంలో ఆగిపోయారు. వారి స్థానంలోకి ఐశ్వర్యను తీసుకొచ్చారు. ఇక గౌతమ్ కృష్ణ కూడా చివరి నిమిషంలో యాడ్ అయినట్లుగా చెబుతున్నారు. మరొక ఆప్షన్ కూడా అందుబాటులో పెట్టుకున్నారు బిగ్ బాస్ టీం.

ఇక మహేష్ అచంట, మహేశ్ కాలిదాస్, సాగర్ (మొగలిరేకులు ఫేం), యువ సామ్రాట్, అనిల్ గీలా, అన్షూ రెడ్డి, మోహన భోగరాజు, జబర్దస్త్ నరేష్ వంటి వారు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా... పలు కారణాల వల్ల వెనుతిరిగారు. జబర్దస్త్ నరేష్ మాత్రం జబర్ధస్త్ షో కాంట్రాక్టు బ్రేక్ చేయడానికి ఇష్టం లేక వదులుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒక షో ఆస్ట్రేలియా టూర్ కోసం బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











